వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
- జాన్ సడ్వర్త్
- బీబీసీ న్యూస్, బీజింగ్

ఫొటో సోర్స్, STR
బుధవారం తెల్లవారుజామున వుహాన్ హైవే టోల్ గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు
చైనాలోని వుహాన్ నగర ప్రజలు.. కొన్ని నెలల లాక్ డౌన్ తర్వాత ఎట్టకేలకు నగరం విడిచి బయటకు వెళ్లటానికి అనుమతించారు. ఇది అద్భుత విజయమని అధికారులు అంటుంటే.. జనానికి మాత్రం విభిన్న అనుభవాలు ఉన్నాయి.
కరోనావైరస్ వుహాన్ నగరంలోనే పుట్టుకొచ్చింది.. తర్వాత ప్రపంచం మొత్తం వ్యాపించింది. మహమ్మారిలా మారటంతో నగరాన్ని 76 రోజులుగా దిగ్బంధించారు. ఇది మానవ చరిత్రలో అతి పెద్ద లాక్ డౌన్ అనటంలో సందేహం లేదు.
ఇప్పుడు లాక్ డౌన్ ముగిసింది. హైవేలు తెరచుకున్నాయి. నగరం నుంచి రైళ్లు, విమానాలు బయటకు బయలుదేరాయి.
వైరస్ లేదని పరిగణించే నగరవాసులు.. చైనాలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు.
‘‘గడచిన రెండు నెలల పాటు వీధుల్లో ఏ ఒక్కరూ కనిపించలేదు. అది చాలా విచారకరంగా అనిపించింది’’ అని జియా షెంఘ్జీ అనే ఓ డెలివరీ డ్రైవర్ నాతో చెప్పారు. ఆయన జెడి.కామ్ డెలివరీ స్టేషన్ ఒక దానికి హెడ్ కొరియర్ గా ఉన్నారు.
భూమి మీద ఎన్నడూ లేనంత కఠినమైన, విస్తారమైన క్వారంటైన్ ఆంక్షలను వుహాన్ ఎదుర్కొంది. తొలుత.. ప్రజలు ఆహారం కొనుక్కోవటానికి బయటకు వెళ్లటానికి అనుమతించారు. కానీ ఫిబ్రవరి మధ్యకల్లా.. ఏ ఒక్కరూ వారి ఇళ్లు దాటి బయటకు రావటానికి అనుమతించలేదు.
డెలివరీ డ్రైవర్లు కీలకమైన జీవన రేఖగా మారారు.
‘‘వేరే చోట ఉన్న తమ వయసు మళ్లిన తల్లిదండ్రులకు మందులు పంపించాలని కోరుతూ కూడా కస్టమర్ల నుంచి మాకు ఫోన్ కాల్స్ వచ్చేవి’’ అని జియా తెలిపారు.
అటువంటి అత్యవసర పరిస్థితుల్లో సాధారణ పద్ధతుల్లో డెలివరీ పంపిస్తే అవి అవసరమైన సమయానికల్లా కస్టమర్లకు చేరుకోవని ఆయన ఆందోళన చెందేవారు.
‘‘అందుకని నేను స్కూటర్ నడుపుకుంటూ ఫార్మసీకి వెళ్లి, మందులు తీసుకుని అతడి తండ్రికి అందించాను’’ అని చెప్పారు.
ఈ సంక్షోభ సమయంలో సానుకూల సాహసోపేత ఉదంతాలకు ఇది ప్రతీక.
జేడీ డెలివరీ డ్రైవర్ జియా షెంఘ్జీ
విమర్శల గొంతు నొక్కేయటంపై ఆగ్రహం...
కానీ.. వుహాన్‌లో వేరే కథలు కూడా ఉన్నాయి.
‘‘వుహాన్‌లోని ఓ అధికారుల బృందం చేసిన తప్పు వల్ల నా తండ్రి చనిపోయారు. నాకు క్షమాపణ చెప్పాలి. నాకు పరిహారం కావాలి’’ అంటున్నారు ఝాంగ్ హాయ్.
ఆయన తండ్రి ఝాంగ్ లిఫా. వయసు 76 సంవత్సరాలు. కాలు విరగటంతో సర్జరీ కోసం ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు కోవిడ్-19 సోకింది. ఫిబ్రవరి 1న ఆయన చనిపోయారు.
‘‘నాకు చాలా కోపంగా ఉంది.. ఇతర కుటుంబాలు కూడా కోపంగా ఉన్నాయనే నేను నమ్ముతున్నా’’ అని ఝాంగ్ చెప్పారు.
వైరస్ విజృంభిస్తున్న తొలి రోజుల్లో.. దాని వ్యాప్తి గురించి ఆందోళనలు వ్యక్తం చేసిన వైద్యులను అధికారులు నోరు మూయించారు.
కానీ.. ఇప్పటికీ కూడా తమ చర్యల మీద విమర్శల గళాన్ని నొక్కివేయటానికి ఆ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఝాంగ్ మండిపడుతున్నారు.
ఝాంగ్ లిఫా
తన తండ్రి చితాభస్మాన్ని తీసుకోవటానికి తాను వెళ్లినపుడు.. అధికారులు తనను వెన్నంటే ఉన్నారని ఆయన చెప్పారు.
‘‘వాళ్లు లేకుండా మేం వెళ్లినట్లయితే కుటుంబాలు కలుసుకుని, విషయాలు మాట్లాడుకుని, అధికారిక వివరణ అడగగలిగేవాళ్లం’’ అని ఆయన అందుకు కారణాన్ని వివరించారు.
బాధిత కుటుంబాలకు ‘వియ్‌చాట్’ గ్రూపు ఉండేదని.. కానీ ఆ గ్రూపును పోలీసులు రద్దు చేసి.. దాని నిర్వాహకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆయన తెలిపారు.
తన తండ్రి చితాభస్మాన్ని తీసుకెళ్లటానికి ఝాంగ్ తిరస్కరించారు. తర్వాత ఎప్పుడైనా తాను ఒంటరిగా వెళ్లి తీసుకుంటానని చెప్తున్నారు.
‘‘నా తండ్రి చితాభస్మం సేకరించటం చాలా వ్యక్తిగత విషయం. కుటుంబానికి సంబంధించిన విషయం. ఇతరులెవరూ నా దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు’’ అని పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
‘మా ప్రభుత్వాన్ని నిందించొద్దు’
డెలివరీ డ్రైవర్ జియా.. తన కుటుంబంలో కానీ, స్నేహితుల్లో కానీ ఎవరికీ వైరస్ సోకలేదని చెప్పారు.
ఇది లాక్డౌన్ ఎంత సమర్థవంతంగా పనిచేసిందనే దానికి చిహ్నం. అధికారిక గణాంకాల ఖచ్చితత్వం మీద సందేహాలు ఉన్నప్పటికీ.. ఈ లాక్డౌన్ ఇన్ఫెక్షన్ రేటును చాలా వేగంగా తగ్గించింది.
వుహాన్ లోపల విధించిన ఆంక్షలను గత కొన్ని వారాలుగా నెమ్మదిగా సడలించారు. కొంతమంది ప్రజలు తమ నివాసాలను వదిలి బయటకు రావటానికి అనుమతించారు. వ్యాపారాలు మళ్లీ తెరచుకోవటం మొదలైంది.
ఇప్పుడు చివరి చర్య చేపట్టారు. చైనాతో వుహాన్ రవాణా అనుసంధానాలను పునరుద్ధరించారు.
వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నిరోధించటానికి వేరే మార్గాలు ఉండొచ్చనటానికి ఆధారాలు ఉన్నప్పటికీ.. చైనా సరైన మార్గంలోనే ఉందని జియా, ఝాంగ్ ఇద్దరూ నమ్ముతున్నారు.
‘‘మామూలుగా చెప్పుకుంటే.. మేం గెలిచాం. కానీ ఉదాసీనంగా మారకూడదు’’ అంటారు జియా.
‘‘జనం మొత్తం మాస్కులు ధరించటం, ఎల్లప్పుడూ చేతులు కడుక్కుంటూ ఉండటం, మొబైల్ హెల్త్ కేర్ యాప్‌లు ఉపయోగించటం, జ్వరం ఉందేమో చూసుకోవటం, గుమిగూడకుండా ఉండటం ద్వారా తమను తాము రక్షించుకోవటాన్ని కొనసాగించాలి’’ అని పేర్కొన్నారు.
మహమ్మారిని నిరోధించటం, ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించటం మధ్య సంతులనంలో.. మరోసారి ఇన్స్పెక్షన్లు ప్రబలే ప్రమాదం పొంచే ఉంది.
తన తండ్రి మరణానికి స్థానిక అధికారులను తప్పుపడుతున్న ఝాంగ్.. జాతీయ ప్రభుత్వం మీద తనకు ఎలాంటి కోపం లేదని చెప్తున్నారు.
విదేశీ ప్రభుత్వాలు విమర్శలకు అతీతం కాదని ఆయన అంటారు.
‘‘పశ్చిమ దేశాల ప్రభుత్వాలు వారి దేశాల్లో మరణాల తీవ్రతకు మా ప్రభుత్వాన్ని నిందించజాలవు. మొదట్లో వారి అలవాట్ల ప్రకారం వాళ్లు మాస్కులు ధరించటానికి ఇష్టపడలేదు. వారి నమ్మకాలు, సిద్ధాంతాలు మాకన్నా భిన్నమైనవి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్-లాక్డౌన్ ఎప్పుడు, ఎలా ముగుస్తుంది?
- కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా? అందుకు ఆధారాలు ఉన్నాయా?
- కరోనాపై ప్రభుత్వం ఎలా ‘యుద్ధం’ చేయబోతోంది? కంటైన్మెంట్ ఆపరేషన్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది?
- కరోనావైరస్: కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేశారు?
- ప్రజల కదలికలను స్మార్ట్ ఫోన్ల ద్వారా కనిపెడుతున్న గూగుల్.. భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించాక పరిస్థితిపై రిపోర్ట్
- లైట్లు ఆర్పేయాలన్న మోదీ మాట వినలేదని.. నలుగురు ముస్లిం సోదరుల మీద దాడి
- ఆత్మీయులు చనిపోయినప్పుడు ఆకలి చచ్చిపోతుంది... ఆ శోకంలో ఆహారం ఊరటనిస్తుందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)