కరోనావైరస్ లాక్ డౌన్‌తో దక్షిణాఫ్రికాలో రోడ్లపైకి వచ్చిన సింహాలు

ఫొటో సోర్స్, RICHARD SOWRY/KRUGER NATIONAL PARK
దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో ప్రజల అలికిడి లేకపోవడాన్ని గమనించిన సింహాలు రోడ్లపైకి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాన్ని పార్క్ రేంజర్ రిచర్డ్ సౌరీ తన మొబైల్ కెమెరాలో బంధించారు.
సాధారణంగా పర్యటకులతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డు లాక్ డౌన్‌తో నిర్మానుష్యంగా మారడంతో ఒక సింహాల గుంపు రోడ్లపై విశ్రాంతి తీసుకోవడాన్ని రిచర్డ్ సౌరీ బుధవారం గమనించారు.
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్చ్ 25 నుంచి విధించిన లాక్ డౌన్‌తో క్రూగర్ వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా మూతపడింది.
సాధారణంగా పెద్ద పులులు, సింహాలు రాత్రి పూట మాత్రమే రోడ్లపై కనిపిస్తాయి.
క్రూగర్ నేషనల్ పార్కులో సౌరి రేంజర్‌గా అత్యవసర విధులు నిర్వహిస్తున్నారు.
ఫొటో సోర్స్, రిచర్డ్ సౌరీ
బుధవారం మధ్యాహ్నం ఒర్పేన్ రెస్ట్ క్యాంపు వైపు వెళ్తుండగా ఆయనకి రోడ్డుపై సింహాలు కనిపించాయి. ఆయన 5 మీటర్ల దూరంలోనే ఉండి వాటిని గమనించారు.
అవన్నీ నిద్రలో ఉండటం వలన ఆయన ఫొటోలు తీస్తున్నప్పుడు అవి పెద్దగా పట్టించుకోలేదు.
"వాహనాల్లో ప్రజలని చూడటం వాటికి అలవాటు అయిపోయింది. సహజంగా నడిచి వెళ్లే వారిని చూస్తే జంతువులకి భయం కలుగుతుంది. నేను ఒకవేళ నడిచి వెళ్లి ఉంటే అవి నా మీద దాడి చేసేవి" అని ఆయన అన్నారు.
ఆ గుంపులో అన్నిటి కంటే వృద్ధ సింహానికి 14 సంవత్సరాలు.
సాధారణంగా శీతాకాలంలో సింహాలు వెచ్చదనం కోసం రోడ్ల మీదకి వచ్చి విశ్రమించడం చూశానని సౌరి చెప్పారు. కాకపొతే రోడ్లు సురక్షిత స్థలాలని అవి అనుకోకపోతే చాలని ఆయన అన్నారు.
- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
లాక్ డౌన్ ప్రభావం పార్క్‌పై ఎలా ఉంది?
వనం అంతా నిర్మానుష్యంగా ఉండటంతో సింహాలు, ఒక్కొక్కసారి అడవి కుక్కలు పార్కులో ఉన్న గోల్ఫ్ కోర్స్‌లోకి రావడమే తప్ప జంతువులపై లాక్ డౌన్ ప్రభావం పెద్దగా ఏమీ లేదని సౌరి చెప్పారు.
"క్రూగర్లో వన్య ప్రాణులు చాలా ఉంటాయి. కరోనావైరస్ మహమ్మారి వలన పార్క్‌ని సందర్శించలేని వారి కోసం నేను ఈ చిత్రాలు తీశాను. కష్ట కాలంలో అందరికీ కాస్త ఆనందాన్ని అందివ్వడమే తన ఉద్దేశం" అని అన్నారు.
ఫొటో సోర్స్, RICHARD SOWRY/KRUGER NATIONAL PARK
దక్షిణాఫ్రికాలో 2506 మంది కోవిడ్-19 బారిన పడగా 34 మంది మరణించారు.
ఇక్కడ మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగించారు.
లాక్ డౌన్ అవసరం అందరూ గుర్తించారని, రేంజర్లు వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాల్లో తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారని మీడియా ఆఫీసర్ ఐజాక్ ఫాల చెప్పారు.
పార్క్‌కు ఒకసారి పర్యటకులు రావడం మొదలైతే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కష్టమవుతుందని చెప్పారు.
సాధారణంగా పొదల్లో ఉండే సింహాలు, వాహనాల రద్దీ లేకపోవడంతో రోడ్లపైకి వస్తున్నాయని అన్నారు.
"మంగళవారం రాత్రి వర్షం కురిసింది. గడ్డి మీద కంటే రోడ్లు కాస్త పొడిగా ఉండటం వలన సింహాలు రోడ్ల పైకి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఎందుకంటే సింహాలకి, నీటికి పడదు" అని సౌరి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- లైట్లు ఆర్పేయాలన్న మోదీ మాట వినలేదని.. నలుగురు ముస్లిం సోదరుల మీద దాడి
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)