కరోనావైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలి... లాక్డౌన్ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి?

ఫొటో సోర్స్, Getty Images
కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి ఇబ్బడి ముబ్బడిగా అనేక చోట్ల నుంచి సలహాలు వస్తున్నాయి. అయితే, మనల్ని మనం రక్షించుకోవడానికి పాటించాల్సిన సూచనలు ఏమిటి?
కరోనావైరస్ నుంచి రక్షించుకోవడానికి ముందుగా పాటించాల్సింది పరిశుభ్రత అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. చేతుల్ని, సబ్బు నీరు ఉపయోగించి తరచుగా కడుక్కోవడం, లేదా శానిటైజేర్ వాడి శుభ్రం చేసుకోవడం చెయ్యాలి. ఇది చేతుల మీద వైరస్ ని హరిస్తుంది.
మీ చేతులతో కళ్ళు, ముక్కు, నోరు ముట్టుకోవడం మానెయ్యాలి. చేతుల నుంచే వైరస్ శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
వైరస్ వ్యాప్తి చేయకుండా చూడటం ఎలా?
దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ టిష్యూ ని అడ్డం పెట్టుకోవాలి. టిష్యూ చేతిలో లేని పక్షంలో మోచేతిని అడ్డం పెట్టుకోవాలి.
ఒక్కసారి వాడిన టిష్యూలని వెంటనే పడేయాలి. దీంతో మరొకరికి వ్యాపించే అవకాశం తగ్గుతుంది.
ఒక వ్యక్తి నుంచి ఇంకొకరు కనీసం 2 మీటర్ల దూరం పాటించాలి.
చాలా దేశాలలో ప్రజల్ని ఇంటి వద్దనే ఉండి, అవసరమైతేనే బయటకి వెళ్ళమని సూచిస్తున్నారు.
అలాగే, ఎవరినైనా కలిసినప్పుడు షేక్ హ్యాండ్ మానేసి, తల వంచి, చేయి ఊపి కానీ పలకరించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
మాస్క్‌లు, గ్లోవ్స్ పని చేస్తాయా?
సూపర్ మార్కెట్ లలో దొరికే మాస్క్‌లు ఇన్ఫెక్షన్ నుంచి రక్షించలేవు. అవి కళ్ళని కప్పి ఎక్కువ సేపు వేసుకునేందుకు వీలుగా ఉండవు.
అయితే, ఇన్ఫెక్షన్ సోకిన వారి నుంచి దగ్గు, జలుబు తుంపరలు దగ్గరకి రాకుండా అడ్డుకోగలవు.
కోవిడ్-19 సోకని వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు అవి వేసుకోవడంలో నష్టం లేదు.
గ్లోవ్స్ వాడినప్పటికీ కోవిడ్ 19 నుంచి పూర్తిగా రక్షించలేవు.
గ్లోవ్స్ ధరించడం కన్నా తరచుగా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవడం ద్వారా ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడుకోగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
కోవిడ్ 19 లక్షణాలు సోకినట్లు నాకెలా తెలుస్తుంది?
కరోనా వైరస్ ప్రధాన లక్షణాలు పొడి దగ్గు, జ్వరంతో మొదలవుతాయి.
గొంతు నొప్పి, తలనొప్పి, డైయేరియా కూడా కొంత మందిలో కనిపించాయి.
కొంత మందికి రుచి, వాసన కోల్పోయిన లక్షణాలు కూడా కనిపించాయని అనుమానాలు ఉన్నాయి.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
ఈ లక్షణాలు ఉంటే ఏమి చెయ్యాలి?
ఆరోగ్యం బాలేదని అనిపించగానే ఇంటి దగ్గరే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. తేలికపాటి దగ్గు, జలుబు ఉన్నప్పటికీ అవి తగ్గే వరకు ఇంటి వద్దనే ఉండమని సూచిస్తోంది.
80 శాతం కోవిడ్ 19 కేసు లలో అది తేలికపాటి ఇన్ఫెక్షన్ తోనే మొదలవుతోంది. ఆ సమయంలో ఎవరినీ కలవకుండా ఉండటం మంచిది/
జ్వరం వచ్చి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి.
హాస్పిటల్ కి వెళ్లక ముందే డాక్టర్ కి కాల్ చేసి వైద్య సలహా తీసుకోవడం మంచిది.
కోవిడ్ 19 ఎంత ప్రమాదకరం?
కోవిడ్ 19 బారిన పడిన వారిలో 0.66 శాతం మంది మరణిస్తున్నట్లు లాన్సెట్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం పేర్కొంది.
ఇది ఫ్లూ సోకి చనిపోయేవారి శాతం కంటే చాలా ఎక్కువ
ఈ మహమ్మారి సమయంలో మరణాల రేటుని అంచనా వేయడం కూడా కష్టమే.
సాధారణ పరిస్థితుల్లో కంటే 80 సంవత్సరాలు పైబడినవారిలో ఇప్పుడు సంభవిస్తున్న మరణాల రేటు 10 రేట్లు ఎక్కువుందని ఇంపెరియల్ కాలేజీ లండన్ తెలిపింది.
చైనా లో అధ్యయనం చేసిన 44 వేల కేసులలో డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ , ఇతర గుండె, శ్వాస సంబంధ సమస్యలున్న వారిలో మరణాల రేటు ఐదు రేట్లు ఎక్కువుందని తేలింది.
ఫొటో సోర్స్, Getty Images
దీనికి మందు ఉందా?
ఈ వైరస్ కి ప్రత్యేకంగా మందు కానీ, వాక్సిన్ కానీ అందుబాటులో లేవు. దీనికి ఆంటీ బయో టిక్స్ పని చేయటం లేదు.
కొన్ని చికిత్సా విధానాలు ఉన్నాయి, కానీ చాలా వరకు రోగులు వారంతట వారే కోలుకుంటున్నారు.
ఈ వైరస్ కి వాక్సిన్ ని కనిపెట్టడానికి ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా కలిసి కృషి చేస్తున్నారు. అయితే, ఇది అందుబాటులోకి తేవడానికి ముందు చాలా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ సమయంలో మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా?
ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఈ సమయంలో ఆందోళన, ఒత్తిడి, విచారం కలగడం చాలా సహజం. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ 10 సూచనలు చేస్తోంది.
- మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఫోన్ లో తరచుగా మాట్లాడుతూ ఉండండి.
- మిమ్మల్ని విచారానికి గురి చేస్తున్న విషయాలని చర్చించండి.
- ఇతరులని విచారానికి గురి చేస్తున్న విషయాల గురించి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.
- మీ కొత్త జీవన శైలిని ప్రణాళిక బద్ధంగా ఎలా మలచుకోవాలో ఆలోచించుకోండి.
- ఇంట్లోకి కావాల్సిన ఆహార సరఫరాలని తెచ్చి పెట్టుకోవడం కానీ, ఇంటి నుంచే పని చేయడం లాంటి విషయాలలో ప్రణాళికాబద్ధంగా ఉండండి.
- మీ ఆరోగ్యం గురించి కూడా దృష్టి పెట్టండి. వ్యాయామం చేస్తూ, వేళకి సరైన ఆహారం తీసుకోండి. ఎక్కువగా మంచి నీరు తాగండి. పొగ తాగడం , మద్యం సేవించడం మానెయ్యాలి.
- మహమ్మారి గురించి సమాచారాన్ని అధికారిక సమాచార సాధనాల నుంచి మాత్రమే తీసుకోండి.
- మీకు వచ్చే ఆలోచనలని ఎదుర్కోండి. కొన్ని పరిస్థితులు మీ స్వాధీనంలో ఉండవు. కానీ మీ ప్రవర్తనని నియంత్రణ పెట్టుకోగల్గడం మీ చేతుల్లోనే ఉంటుంది.
- మీకు నచ్చిన పనులు చేయండి. ప్రస్తుత క్షణం మీద దృష్టి పెట్టి, ఈ స్థితి తాత్కాలికం అని చెప్పుకోండి.
- తగినంత సేపు నిద్రపోండి. కెఫీన్ తీసుకోవడం, పడుకునే ముందు స్క్రీన్ చూడటం మానేయండి.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా?
- ఆంధ్రప్రదేశ్: 'పంట బాగా పండినా, లాక్డౌన్ నాన్నను మాకు దూరం చేసింది'
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల లాక్డౌన్ సమయంలో తండ్రి అయిన ఒక కొడుకు కథ
- ‘రంజాన్ మాసంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి’ : మతపెద్దల మార్గదర్శకాలు
- కరోనావైరస్: లాక్‌డౌన్‌తో దేశంలో రోజూ ఎన్ని వేల కోట్ల నష్టం వస్తోంది? ఎన్ని ఉద్యోగాలు పోతాయి?
- ఏపీలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో ఏం జరుగుతోంది? డిశ్ఛార్జ్ అయిన వాళ్లు ఏం చెబుతున్నారు?
- కరోనావైరస్: రాయలసీమలో ఈ మహమ్మారి ఎలా వ్యాపిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)