కరోనావైరస్: వుహాన్‌లో అదృశ్యమైన జర్నలిస్ట్ లీ జెహువా తిరిగి ప్రత్యక్షం

ఫొటో సోర్స్, Li Zehua / YouTube
లి జెహువా
పోలీసులు వెంటాడి నిర్బంధంలో పెట్టిన వుహాన్ జర్నలిస్ట్ లీ జెహువా తిరిగి కనిపించారు.
ఫిబ్రవరి 26వ తేదీన లీ జెహువా అనే జర్నలిస్ట్ తనను పోలీసులు వెంటాడుతున్న వీడియోను అప్ లోడ్ చేసిన తర్వాత మళ్ళీ కనిపించలేదు.
రెండు వారాల క్వారంటైన్ నుంచి తిరిగి వచ్చానని ఈనెల 22వ తేదీ బుధవారం ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు. క్వారంటైన్ పూర్తి అయిన తర్వాత తన స్వగ్రామంలో గడిపినట్లు చెప్పారు.
ఆయన కోవిడ్ 19 గురైన ప్రాంతాలకి వెళ్లడంతో క్వారంటైన్ అవసరమైనట్లు వీడియోలో చెప్పారు.
లీ జెహువా ఒక సిటిజెన్ జర్నలిస్ట్. మరో జర్నలిస్ట్ చెన్ కిషి అదృశ్యమైన తర్వాత ఆయన ఫిబ్రవరిలో వుహాన్ వెళ్లారు. తాను వుహాన్ ఎందుకు వెళ్లిందీ తొలుత విడుదల చేసిన ఒక వీడియోలో వివరించారు.
“చైనీస్ కేంద్ర ప్రభుత్వం కరోనావైరస్ గురించి చెడు వార్తలన్నిటిని సేకరిస్తోందని ఒక చైనీస్ ప్రధాన వార్తా పత్రికలో పని చేస్తున్న స్నేహితుడు చెప్పారు. రోగులు కోలుకుంటున్న వార్తలని ప్రాంతీయ మీడియా మాత్రమే ప్రచురించగలదని చెప్పారు. అది ఎంత వరకు నిజమో నాకు తెలియదు” అని వీడియోలో తెలిపారు.
ఇన్ఫెక్షన్ల సంఖ్యని దాచి పెట్టడం, రద్దీగా ఉన్న స్మశాన వాటిక లాంటి కథనాలని జెహువా ప్రచురించారు.
వీటిని యూట్యూబ్, ట్విటర్ ల్లో కొన్ని లక్షల మంది చూసారు.
ఫిబ్రవరి 26 వ తేదీన ఏమి జరిగింది?
25 సంవత్సరాల లి జెహువా విడుదల చేసిన వీడియోలో తాను కారు డ్రైవ్ చేస్తుండగా ఇంకొక కారు వచ్చి తనను ఆపమంటూ 30 కిలోమీటర్ల వరకు వెంబడించారని ఆయన చెప్పారు. ఇదే వీడియోని ఆయన యూట్యూబ్ లో ఎస్ ఓ ఎస్ పేరుతో పబ్లిష్ చేశారు.
భయంతో కారు ఆపకుండా వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లినట్లు వీడియోలో ఆయన చెప్పారు.
ఆయన ఉంటున్న చోటుకి వెళ్లి పోలీసులు తలుపు కొట్టక ముందే యూట్యూబ్ లో వీడియో ని లైవ్ స్ట్రీమ్ చేశారు.
తాను రూమ్ లోకి వెళ్లి లైట్ లన్నీ ఆర్పేసి కూర్చున్నట్లు చెప్పారు. ఆయన తలుపు తీయనప్పటికీ మూడు గంటల తర్వాత పోలీసులు మళ్ళీ తలుపు కొట్టారు.
దాంతో తలుపు తీయాల్సి వచ్చింది. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి వేలి ముద్రలు, రక్త పరీక్షలు నిర్వహించడానికి శాంపిల్ తీసుకుని వెళ్లారని చెప్పారు.
ఆయన ప్రజా జీవితానికి భంగం కలిగించినట్లు అనుమానంతో పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చామని కానీ, జరిమానా ఏమి విధించమని పోలీసులు చెప్పినట్లు జెహువా చెప్పారు.
వైరస్ ప్రబలిన ప్రాంతాలలో తిరిగినందున క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు చెప్పారు.
ఆ తర్వాత ఏం జరిగింది?
జెహువాని పోలీస్ అధికారులు వుహాన్ లోని క్వారంటైన్ భవనానికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆయన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలని తీసుకుని వెళ్లిపోయినట్లు తెలిపారు.
క్వారంటైన్ లో రెండు వారాలు ఉన్నట్లు చెప్పారు.
అక్కడ నుంచి తమ సొంత ఊరిలో ఉన్న క్వారంటైన్ కేంద్రానికి వెళ్లి, అక్కడ రెండు వారాలు ఉన్న తర్వాత ఇంటికి వెళ్లినట్లు చెప్పారు.
క్వారంటైన్లో ఉన్న సమయంలో పోలీసులు తన బాగోగులు చూసుకున్నారని, తనకి మంచి ఆహారం ఇచ్చారని చెప్పారు.
"నన్ను బాగా చూసుకున్న వారందిరికి నేను కృతజ్ఞుడినై ఉంటాను. వైరస్ తో బాధపడుతున్నవారందరూ కోలుకుంటారని ఆశిస్తున్నాను. చైనాని దేవుడు రక్షించాలని కోరుకుంటున్నాను. ప్రపంచం అంతా ఐక్యం కావాలని ఆశిస్తున్నాను” అని వీడియోలో మాట్లాడారు.
చెన్ కిషి ఆచూకీ ఇంకా తెలియలేదు. ఆయన గత 75 రోజులుగా కనిపించటం లేదని ఆయన స్నేహితులు ట్వీట్ చేశారు.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
ఇది పరీక్షా సమయం (వీక్లీ షో)
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందా?
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనా ఎఫెక్ట్: నారింజ రసం ధరలు పైపైకి
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్ లాక్ డౌన్: ఆంధ్రప్రదేశ్‌లో పడిపోయిన పాలు, పాల ఉత్పత్తుల విక్రయం... కష్టాల్లో పాడి రైతులు
- కరోనావైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలి... లాక్డౌన్ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)