వివాహేతర సంబంధం బయటపడడంతో గుండు చేయించుకుని అభిమానులకు క్షమాపణ కోరిన గాయని.. సారీ చెప్పడంలో అదో పద్ధతి

  • ఎరియన్ కోహెన్
  • బీబీసీ ప్రతినిధి
మహిళ

ఫొటో సోర్స్, Getty Images

క్షమాపణలు చెప్పడానికి కొత్త పరిశోధనలు ఏం జరగడం లేదని విద్యావేత్తలకు క్షమాపణలు చెబుతున్నాం. ఎందుకంటే అలాంటి పరిశోధనలకు ఒక అవుట్‌లైన్ సృష్టించడం చాలా కష్టం.

ఇది బహుశా చెట్టును తొలుస్తున్న ఒక వడ్రంగి పిట్టకు ఎంత తలనొప్పి ఉందని తెలుసుకునేంత కష్టంగా ఉంటుంది.

అమెరికాలోని ఒహాయోలో ఓబర్లిన్ కాలేజ్ సైకాలజిస్టు సిండీ ఫ్రాంటజ్ ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. ఆమె “నేను ఒక పరిశోధన చేయాలని ప్రయత్నించాను. కానీ నైతిక కారణాల వల్ల దాన్ని చేయడం చాలా కష్టమైంది” అన్నారు.

క్షమాపణ ఎలా చెప్పాలనేది గుర్తించడానికి పరిశోధకులు తరచూ జుట్టుపీక్కోవాల్సి వస్తోంది. వారి దగ్గర ఈ పరిశోధనలో పాల్గొనే వారు వేరే ఎవరికైనా సారీ చెప్పేలా, వారి దగ్గర ఏదైనా అనైతికమైన తప్పు చేయించడం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images

ఇందులోపాల్గొనేవారిని పరిశోధకులు ఎక్కువగా కల్పిత ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే “గోపీ మీ కాళ్ల మీద కారు ఎక్కించేశాడనుకోండి అప్పుడేం చేస్తారు” ఇలాంటివి.

లేదంటే ఆలోచించకుండా చేసిన తప్పులకు పనులకు సంబంధించి పాత జ్ఞాపకాలను తిరగదోడే ప్రశ్నలు వేస్తుంటారు. అంటే “మీరు మీ అమ్మను ఎప్పుడైనా క్షమించమని అడిగారా?” లాంటివి.

క్షమాపణకు ఉన్న సాంస్కృతిక లక్షణాలు దాన్ని మరింత జటిలం చేస్తాయి. దీని వెనుక ఇన్ని కష్టాలు ఉన్నా ఈ అంశంపై కొన్ని పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

కోబే యూనివర్సిటీలోని సైకాలజిస్ట్ యోహసుకే వోహసుబో అలాంటి ఒక పరిశోధనే చేస్తున్నారు. ఆయన క్షమాపణ గురించి 12 ఏళ్లు అధ్యయనం చేశారు. గత ఏడాది ఆయన తన ఆరు పరిశోధనా పత్రాల్లో ఐదో పేపర్‌ను ప్రచురించారు. అందులో క్షమాపణ ఎలా అడగాలి అనేదానికి సంబంధించి కొన్ని సూచనలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, alamy

ఫొటో క్యాప్షన్,

సారీ చెప్పడం ఎలా?

క్షమాపణ ఎలా అడగాలి?

క్షమాపణ అడుగుతున్న సమయంలో, ఒక మంచి ఖరీదైన బహుమతి ఇవ్వడం అన్నిటికంటే ఉత్తమం. ఏదైనా కంపెనీ తమ వినియోగదారులను క్షమాపణ అడిగినపుడు, ఖరీదైన గిఫ్ట్ సర్టిఫికెట్ ఇచ్చి తన పనికి విచారం వ్యక్తం చేస్తుంది.

లేదా ఎవరికైనా సారీ చెప్పాలంటే “నేను ఈ వీకెండ్ నా టూర్ కాన్సిల్ చేసుకుంటున్నా. శనివారం నేను మీతోనే ఉండాలనుకుంటున్నా” అని చెప్పచ్చు.

“సారీ చెబుతూ ఇచ్చే బహుమతులు, ఆ తప్పుల్లాగే పాతబడిపోతాయి. తీసుకునేవారిని అలాంటి బహుమతులు సంపన్నులుగా మార్చేయవు. ఇక్కడ, తప్పు చేసేవారు ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది అనేదే ముఖ్యం” అని వోహసుబో చెబుతారు.

మరో మాటలో చెప్పాలంటే “ఎక్కువ బాధ బహుమతి తీసుకునేవారికే కలిగుంటుంది. ఇచ్చేవారికి కాదు. అది వ్యక్తిగతం కావచ్చు, లేదా సామూహిక క్షమాపణ కావచ్చు. ఒంటరిగా, బహిరంగంగా అడిగే క్షమాపణల విషయంలో కూడా అలాగే జరుగుతుంది”.

అమెరికా, దక్షిణకొరియా, నెదర్లాండ్, ఇండోనేషియా, చిలీ, జపాన్, చైనా సహా చాలా దేశాల్లో వోహసుబో మాట నిరూపితమైంది.

ఆయన జపాన్‌లోని ఒక ప్రముఖ గాయనిని దీనికి ఉదాహరణగా చెప్పారు. ఒకసారి తన వివాహేతర సంబంధం బయటపడడంతో, ఆమె గుండు చేయించుకుని అభిమానులను క్షమించమని అడిగారని చెప్పారు.

“ఆమె తన కెరియర్, అభిమానులకు ఎంత ప్రాధాన్యం ఇస్తోందో దీనివల్ల తెలుస్తుంది. ఆమె మరోసారి ఆ బంధాన్ని నాశనం చేసుకోదు” అని ఆయన చెప్పారు.

మనలో ఎవరైతే ఓ.. అయాం సారీ అని చెబుతూ కలిసిపోతుంటారో, వారిలో ఏం జరుగుతుందో తెలుసా?

క్షమాపణ అడగడం వెనుక ఉద్దేశం, సారీ చెప్పడం, గడిచిపోయిన విషయాలను గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు. దానివెనుక బంధాలకు ప్రాధాన్యం ఉంటుంది. చేసిన తప్పు వల్ల మనం పాఠం నేర్చుకున్నామని చెప్పడం కూడా ఉంటుంది.

దానితోపాటు ఇంకోసారి అలా తప్పుగా ప్రవర్తించను అని మాట ఇవ్వడం కూడా ఉంటుంది. (ఖరీదైన బహుమతులు మళ్లీ మళ్లీ కొనడం అంత సులభం కాదు)

ఫొటో సోర్స్, alamy

ఫొటో క్యాప్షన్,

సారీ ఎలా చెప్పాలి?

తిరిగి గౌరవించడం ఉత్తమం

బహుమతులు ఇవ్వడానికి భిన్నంగా, క్షమాపణ అడిగే సాధారణ నియమాలు చాలా సూటిగా ఉంటాయని హవాయి యూనివర్సిటీలో కమ్యూనికాలజీ విభాగం చీఫ్ ఎమీ ఇబెసు హబార్డ్ చెబుతారు.

“బాధ్యతను అంగీకరిచండి, నష్టాన్ని, కష్టాన్ని భరించండి. భవిష్యత్తులో మంచిగా ప్రవర్తిస్తానని మాట ఇవ్వండి. వెంటనే ఉపశమనం అందించే పరిష్కారం వెతకండి. నిజాయితీ చూపించండి” అంటారు ఆయన.

“విచారం, క్షమించడం లాంటి మాటలను కచ్చితంగా వాటిలో చేర్చాలి. చిన్న చిన్న తప్పుల్లో వీటన్నింటినీ చేర్చాల్సిన అవసరం లేదు” అని చెప్పారు..

అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక రీసెర్చిలో దీనికి మరో మార్గనిర్దేశాన్ని జోడించారు. దాని ప్రకారం మీరు చెప్పే క్షమాపణను, ముఖ్యంగా సీరియస్ విషయాల్లో థాంక్స్ చెబుతూ ప్రారంభించండి.

ఆ రీసెర్చి పేపర్‌ రచయిత ఒహాయో స్టేట్ యూనివర్సిటీలో ఫిషర్ కాలేజ్ ఆఫ్ బిజినెస్‌లో మార్కెటింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన షియోయాన్ డేంగ్ “సారీ చెప్పడానికి బదులు, ‘మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’, లేదా ‘మీ సహనానికి ధన్యవాదాలు’ అని ప్రారంభించండి” అని చెప్పారు.

అమెరికా, చైనా విద్యార్థులతోపాటు, తమ సేవల్లో పొరపాట్లు లేదా ఆలస్యం చేసిన అమెజాన్‌ ఉద్యోగులపై డెంగ్ 7 పరిశోధనలు చేశారు.

“మీరు వారి సహకారాన్ని ప్రశంసించడం వల్ల వారి ఆత్మగౌరవాన్ని పెంచుతారు. ఆత్మగౌరవాన్ని ప్రోత్సహించడం వల్ల వారిలో సంతృప్తి పెరుగుతుంది”.

మీ తప్పుల గురించి మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల అవి అవతలి వారి జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. దానికి బదులు వాటిని స్పష్టంగా అంగీకరించండి

తప్పులను గుర్తు చేయకండి

థాంక్స్ లేదా ధన్యవాదాలతోపాటు క్షమాపణ అడగడం పరిస్థితిని చాలా మెరుగ్గా చేస్తుంది అని ఒబరలిన్ కాలేజ్‌లోని ఫ్రాంట్జ్ అంటారు.

“ఇతరుల దృష్టిలో విలువ పెంచుకోడానికి మన నడవడిక చాలా అవసరం. ధన్యవాదాలు చెప్పడం వల్ల వారిలో తిరిగి ఆత్మగౌరవం ఏర్పడుతుంది. ధన్యవాదాలు చెప్పడం వారికి అత్మగౌరవాన్ని తిరిగి అందిస్తాం. క్షమాపణ అడగడం అనేది భవిష్యత్తులో ఆ బంధం ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది.” అన్నారు ఫ్రాంట్జ్.

హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ ఎలిసన్ బుడ్ బ్రూక్స్ రీసెర్చ్ కూడా ఆమె వాదనను సమర్థించింది. వివిధ నేరాల్లో పెరోల్ ఇస్తున్న సమయంలో నిందితుల కోరిన క్షమాపణలపై బ్రూక్స్ తన సహచరులతో కలిసి అధ్యయనం చేశారు.

భవిష్యత్తులో మంచిగా ప్రవర్తిస్తాననే హామీతో అడిగిన క్షమాపణలు చాలా ఎక్కువ ప్రభావం చూపించినట్లు ఆమె గుర్తించారు. నేరం గురించి వివరణ ఇస్తూ అడిగిన క్షమాపణ ప్రభావం ఎవరిమీదా కనిపించలేదని చెప్పారు.

ఉదాహరణకు “నేను చాలా అలసిపోయి ఉండడంతో మద్య తాగాను, అదే సమయంలో వెళ్లాలని అనిపించడంతో కారు నడిపాను. నా తప్పుడు నిర్ణయానికి నేను బాధ్యత వహిస్తున్నాను” అనే మాటను వినడానికి ఏ పెరోల్ బోర్డు ఇష్టపడలేదు.

దాని బదులు నేను ప్లాన్ ప్రకారం, నేను క్రమం తప్పకుండా కోర్టుకు హాజరవుతాను. ఇక మీదట మద్యం తాగి కారు నడపడం ఆపేస్తాను. ఆదివారం ఎవరినైనా తోడు తీసుకుని బయటకు వెళ్తాను” అని చెప్పేది వినాలని కోరుకుంటారు.

గతంలో చేసిన తప్పులకు వివరణ ఇవ్వడం, లేదా సాకులు చెప్పడం వదిలేయాలి అని బ్రూక్స్ చెబుతారు. ఆ ప్రయత్నంలో సమయం కూడా చాల ముఖ్యమని అంటారు.

ఇదే విషయం చెబుతున్న ఫ్రాంట్జ్ 20 ఏళ్ల పాత పరిశోధనను ఇప్పటికీ విస్తృతంగా ఉదహరిస్తారు. “చాలా త్వరత్వరగా క్షమాపణలు చెప్పడం వల్ల, అది పెద్దగా ప్రభావం చూపదు” అని ఆ పాత పరిశోధన చెపుతుంది.

సారీ అడగడం వెనుక ఒకే ఉద్దేశం ఉంటుంది. “మిమ్మల్ని అర్థం చేసుకున్నానని, మీరు మంచివారని, మరోసారి అలాంటి తప్పు చేయరని అవతలి వారికి తెలిసేలా చేయడం.

ఫొటో సోర్స్, Getty Images

క్షమాపణలో ఎంత నిజాయితీ ఉంది.

క్షమాపణ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలను క్షమాపణ పరంపరగా చూస్తున్నారు. అయినా వారు తరచూ వాటికి సంబంధించిన వివరణలను గుర్తు చేసుకోరు.

“నేను ఘటన వివరణను గుర్తుంచుకోను. కానీ ఆ వివాదం ఇలా వచ్చింది, దానిని ఇలా పరిష్కరించారు అనేది గుర్తుండిపోతుంది” అని ఫ్రాంట్జ్ చెబుతారు.

“మీకు చెప్పని బహిరంగ క్షమాపణలకు మార్కుల వేయడం వల్ల ఉపయోగం లేదు. దానికి ఒక క్లాసిక్ ఉదాహరణ ఉంది. ఒక నేత తన భార్యను మోసం చేస్తూ పట్టుబడ్డారు. ఆయన దానికి బహిరంగంగా ప్రజలను క్షమాపణ అడిగారు. అదే సమయంలో ఆయన భార్యను కూడా క్షమించమని అడిగారు” అని చెప్పారు.

ఇబెసు హబార్డ్ తన రీసెర్చిలో దీనిని ఒక వింతని చెబుతారు. “మిగతావారు దానిని మరో విధంగా చూస్తారు. మీరు ఎవరిని క్షమాపణ అడిగారో, వారు మీ మాటల్లో నిజాయితీని గుర్తిస్తారు. ఏ వ్యక్తిని మనం క్షమాపణ అడిగామో, వారికి అది నిజం అనిపించిందా, లేదా అనేదే ఇక్కడ ముఖ్యం” అన్నారు.

ఆమె కెంటకీ గవర్నర్ ఏండీ బషీర్‌ను ప్రశంసిస్తారు. ఆయన దివంగత ర్యాపర్ ట్యూపక్ షకూర్ పేరుతో నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసిన ఒక వ్యక్తిని నానామాటలూ అన్నారు.

యాదృచ్చికంగా దరఖాస్తు చేసిన వ్యక్తి పేరు నిజంగానే ట్యూపక్ షకూర్. ఆయనను గవర్నర్ మాటలు బాధించాయి.

దాంతో “బషీర్ తన క్షమాపణలో మీరు ఆశించే ప్రతిదాన్నీ చెప్పారు” అన హబార్డ్ చెప్పారు.

ఆయన మొదట షకూర్‌కు ఫోన్ చేసి వ్యక్తిగతంగా క్షమించమని అడిగారు. తర్వాత బహిరంగంగా తను షకూర్‌ మనసు బాధపెట్టినట్లు అంగీకరించారు. దానికి పూర్తి బాధ్యత తనదే అన్నారు. షకూర్‌ను ప్రశంసించారు.

‘సారీ అబౌట్ దట్ ది లాంగ్వేజ్ ఆఫ్ పబ్లిక్ అపాలజీ’ రచయిత ఎడ్విన్ బటిస్టెలా కార్పొరేట్ క్షమాపణకు కేఎఫ్‌సీ ప్రకటనను ఒక ఉదాహరణగా చెబుతారు. 2018లో చికెన్ కొరత తీవ్రంగా ఉండడంతో కేఎఫ్‌సి వార్తా పత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చింది. అందులో కోడి లేకుండా ఖాళీగా ఉన్న బోను, దానిపై కేఎఫ్‌సీ అని రాసి ఉంది”.

ఇదే ఫొటోలో వినియోగదారులను అది క్షమాపణ కూడా అడిగింది. దానితోపాటు కేఎఫ్‌సీతో మీ బంధాన్ని కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు కూడా చెప్పారు. ఆ ప్రకటన గురించి అప్పట్లో చాలా మంది చర్చించుకున్నారు.

“అది నిజానికి చాలా మంచి పని చేసింది. తమ సమస్యను ప్రజలు తేలిగ్గా తీసుకోవడంలో విజయవంతం అయ్యింది” అని బటిస్టెలా చెప్పారు.

(మూల కథనం చదివేందుకు బీబీసీ వర్క్ లైఫ్‌లో ఉన్న ఇక్కడ క్లిక్ చేయండి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)