కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు.. నాలుగు దేశాల్లోనే అత్యధికం

ఫొటో సోర్స్, Getty Images
గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా లక్షా 6 వేల కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పటివరకూ ఒకే రోజు నమోదైన అత్యధిక కరోనా కేసుల్లో ఇదే ఎక్కువ.
“ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో వెలుగులోకి వచ్చిన కొత్త కేసుల్లో మూడింట రెండు వంతులు నాలుగు దేశాల్లోనే నమోదయ్యాయి" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
ఈ నాలుగు దేశాల్లో భారత్ కూడా ఉంది. మిగతావి అమెరికా, రష్యా, బ్రెజిల్.
కరోనా అంతం దిశగా వెళ్తోందని ఏమాత్రం అనుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం కూడా హెచ్చరించింది.
“సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలు లాక్డౌన్ నుంచి బయటకు వస్తున్న సమయంలో, పేద దేశాల్లో కరోనా వ్యాపిస్తోంది” అని జెనీవాలో మాట్లాడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ అన్నారు.
“మనం ఇంకా చాలా సుదీర్ఘ ప్రయాణం చేయాలి. ఈ మహమ్మారి ఇప్పుడు పేద, మధ్య తరగతి ఆదాయ వర్గాలున్న దేశాల్లో పెరుగుతోందని మాకు ఆందోళనగా ఉంది” అన్నారు.
లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్ ఇప్పుడు ఈ మహమ్మారికి కొత్త కేంద్రంగా మారింది. ఇక్కడ పాజిటివ్ కేసులు బ్రిటన్ను దాటిపోయాయి. దేశంలో కరోనా వ్యాప్తి రేటు కూడా పెరుగుతోంది.
ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ధ్రువీకరించిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది.
ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం కేసుల సంఖ్య 50,00,561కు చేరింది. గత 24 గంటల్లో లక్షా 6 వేల కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ డాష్‌బోర్డ్ ప్రకారం అమెరికాలో కరోనావైరస్ వల్ల చనిపోయినవారి సంఖ్య 93,439కి చేరింది. ఇక్కడ మృతుల సంఖ్య త్వరలో లక్షకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో మొత్తం 15,51,853 కరోనా కేసుల నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 లక్షల దాటగా, ఇప్పటివరకూ కోవిడ్-19 వల్ల 3.28 లక్షల మంది చనిపోయారు.
కరోనా సెకండ్ వేవ్‌కు యూరప్ సిద్ధం కావాలి
"యూరోప్ కరోనా సెకండ్ వేవ్ కోసం సిద్ధంగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది, అది ఎంత పెద్దదిగా ఉంటుంది అనేదే తెలీదు" అని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ డైరెక్టర్ ఆండ్రియా అన్నారు.
సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత యూరప్‌లోని చాలా దేశాలు తమ ఆర్థికవ్యవస్థలను దృష్టిలో పెట్టుకుని, జనాలపై ఉన్న ఆంక్షలను సడలించాయి.
ఫొటో సోర్స్, Getty Images
విమానాశ్రయాలలో స్క్రీనింగ్ తప్పనిసరి
దేశీయ విమాన ప్రయాణీకులకు కొత్త మార్గదర్శకాలు
దేశీయ విమాన ప్రయాణాలు చేసేవారికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు జారీ చేసిందని పీటీఐ వార్తా సంస్థ చెప్పింది.
మే 25 నుంచి దేశీయ విమాన సేవలు పునరుద్ధరిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది.
14 ఏళ్ల లోపు పిల్లల మినహా ప్రయాణికులందరూ ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం తప్పనిసరి.
ఎయిర్‌పోర్టులో ప్రవేశించే ముందు ప్రయాణికులందరికీ స్క్రీనింగ్ జరుగుతుంది.
ప్రయాణికులు సామాజిక దూరం పాటించేలా విమానంలో మధ్య సీటు ఖాళీగా ఉంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే జరిగితే చార్జీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
మార్చి చివర్లో లాక్డౌన్ అమలు చేసిన తర్వాత విమాన సేవలు కూడా రద్దు చేశారు.
విమాన ప్రయాణికులందరూ మొదట స్క్రీనింగ్ జోన్లోకి రావాలి, పరీక్షలు చేసిన తర్వాతే వారికి ఎయిర్ పోర్టులోకి ప్రవేశించడానికి అనుమతిస్తారని ఎయిర్ పోర్ట్ అథారిటీ చెప్పింది.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంటే, తెలంగాణలో అవి జీహెచ్ఎంసీ వరకే పరిమితం అయ్యాయి.
ఏపీలో కొత్తగా 45 కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 45 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,452కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 718 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా 41 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న మొత్తం రోగుల సంఖ్య 1680కి పెరిగింది.
గత 24 గంటల్లో కరోనా వల్ల నెల్లూరులో ఒక వ్యక్తి మరణించాడు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 54కు పెరిగింది.
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో చిత్తూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరిని కోయంబేడు(తమిళనాడు) మార్కెట్ నుంచి వచ్చినవారుగా గుర్తించారు.
తెలంగాణలో 27 కొత్త కోవిడ్ కేసులు
తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 27 పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1661కి చేరింది.
కొత్తగా ఇద్దరు కరోనా నుంచి కోలుకోవడంతో, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన మొత్తం కేసుల సంఖ్య 1013కు చేరింది.
తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 40 దగ్గర ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 608 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 15, వలస కార్మికులు 12 మంది ఉన్నారు.
ఇప్పటివరకూ రాష్ట్రానికి వలస వచ్చిన కరోనా కేసుల సంఖ్య 89కి చేరిందని ప్రభుత్వం చెప్పింది.
హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడుతున్న ట్రంప్.. నిజంగానే ఆ మందు పనిచేస్తుందా?
భారత్‌లో కొత్తగా 5609 కేసులు నమోదు
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 12 వేలు దాటింది.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 5,609 కరోనా కేసులు నమోదవడంతో, మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1,12,359కు చేరుకుంది.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ 45,299 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా వల్ల ఇప్పటివరకూ 3,435 మంది చనిపోయారు.
దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. తర్వాత తమిళనాడు, గుజరాత్, దిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
మహారాష్ట్రలో ఇప్పటివరకూ 39,297 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, తమిళనాడులో 13,191, గుజరాత్లో 12,537, దిల్లీలో 11,088 కేసులు ధ్రువీకరించారు.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 1390 మంది చనిపోగా, తర్వాత గుజరాత్లో 749 మంది మరణించారు.
ఇప్పటివరకూ 26 లక్షలకు పైగా కోవిడ్ టెస్టులు: ఐసీఎంఆర్
దేశంలో ఇప్పటివరకూ మొత్తం 26 లక్షలకు పైగా కోవిడ్ టెస్టులు చేశామని ఐసీఎంఆర్ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా చేసిన (మాలిక్యులర్ ఆధారిత) పరీక్షల సంఖ్య 26,15,920కి చేరిందని తెలిపింది.
ఐసీఎంఆర్ గత 24 గంటల్లో లక్షా 3 వేలకు పైగా పరీక్షలు చేసిందని ఏఎన్ఐ చెప్పింది.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్తో సహజీవనం: ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ ఎలా మొదలైంది.. మ్యాచ్‌లు ఎలా ఆడుతున్నారు
- కరోనావైరస్: మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే రోగ నిరోధక వ్యవస్థ, మీ శరీరంపైనే దాడి చేస్తే..
- ఆమె రాసిన ‘వుహాన్ డైరీ’లో ఏముంది? ఆమెను చైనాలో ‘దేశద్రోహి’ అని ఎందుకు అంటున్నారు?
- కరోనావైరస్: అమెరికా వర్సెస్ చైనా... పోటాపోటీగా కుట్ర సిద్ధాంతాలు
- ఇండియా లాక్డౌన్: వలస కూలీల కోసం మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందంటే... – అభిప్రాయం
- తుపాను: ఒకటో నంబరు, రెండో నంబరు, మూడో నంబరు.. ఈ హెచ్చరికలకు అర్థం ఏమిటి?
- ‘20 తుపాన్లు చూశా.. ఈ తుపాను సాధారణంగానే కనిపిస్తోంది’
- గ్లోబల్ వార్మింగ్: ఈ 5 పనులూ చేయండి.. భూ తాపాన్ని మీరే తగ్గించండి
- సూపర్ సైక్లోన్ ఆంఫన్: ప్రపంచంలో అత్యంత ఘోరమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)