పాకిస్తాన్: విమానం కూలడంతో 25 ఇళ్లు పూర్తిగా ధ్వంసం

పాకిస్తాన్: విమానం కూలడంతో 25 ఇళ్లు పూర్తిగా ధ్వంసం

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం కరాచీ విమానాశ్రయానికి సమీపంలో జనావాసాలపై శుక్రవారం కూలిపోయింది.

ఈ విమాన ప్రమాదంలో మొత్తం 97 మంది మృతిచెందినట్లు ఆ దేశంలోని సింధ్ ప్రావిన్స్ అధికారులు ధ్రువీకరించారు.

విమానంలో 8 మంది సిబ్బంది సహా మొత్తం 99 మంది ఉండగా ఇద్దరు సజీవంగా బయటపడ్డారు.

60 మృతదేహాలు జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్(జేపీఎంసీ), మిగతావి కరాచీ సివిల్ హాస్పిటల్(సీహెచ్‌కే)లో ఉన్నాయని పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు. మృతుల్లో 19 మందిని గుర్తించామని, మిగతవారిని గుర్తించే ప్రక్రియ సాగుతుందని తెలిపారు. ఈ ప్రమాదంలో 25 ఇళ్లు దెబ్బతిన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)