జార్జ్ ఫ్లాయిడ్: పోలీసు కాల్పుల్లో చనిపోయేదీ, కేసుల్లో అరెస్టయేదీ, జైళ్లలో మగ్గుతున్నదీ అత్యధికంగా నల్లజాతి వారే... ఎందుకు?

ఫొటో సోర్స్, AFP
అమెరికాలో జరిగే నేరాలు.. అక్కడున్న చట్టాలకు సంబంధించిన డేటాను ఓ సారి పరిశీలిద్దాం. లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చేసరికి అక్కడ ఆఫ్రికన్ –అమెరికన్ల అనుభవాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
కాల్పులకు ఎక్కువగా గురవుతున్నది ఆఫ్రో-అమెరికన్లే
ఇప్పటి వరకు జరిగిన వివిధ ఘటనల్ని, అలాగే వాటికి సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే, మొత్తం అమెరికా జనాభాలో పోలీసుల కాల్పుల్లో మరణించిన వారిలో ఆఫ్రికన్-అమెరికన్ల శాతమే ఎక్కువగా ఉంది.
2019 సంవత్సరానికి చెందిన గణాంకాలనే పరిశీలిస్తే అధికారిక జనాభా లెక్కల ప్రకారం ఆఫ్రికన్-అమెరికన్ల సంఖ్య మొత్తం జనాభాలో 14 శాతం కన్నా తక్కువే ఉంది. కానీ మొత్తం వెయ్యికి పైగా పోలీసు కాల్పుల ఘటనలు జరిగితే వారిలో 23 శాతం కంటే ఎక్కువ మంది ఆఫ్రికన్-అమెరికన్లే ఉన్నారు.
ఇటువంటి ఘటనల్లో బాధితులుగా ఉన్న వారి సంఖ్య దాదాపు 2017 నుంచి స్థిరంగా కొనసాగుతోంది. అదే శ్వేత జాతీయుల విషయానికి వస్తే అప్పటి నుంచి ఏ ఏటికాయేడు బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
ఫొటో సోర్స్, GETTY IMAGES
అమెరికా నిరసనలు
డ్రగ్ కేసుల్లోనే ఎక్కువగా అరెస్ట్ అవుతున్న ఆఫ్రికన్-అమెరికన్లు
ముఖ్యంగా డ్రగ్స్ ఉపయోగిస్తున్న వారిలో అమెరికన్లు-ఆఫ్రికన్ అమెరికన్ల సంఖ్య దాదాపు సమానంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ కేసుల్లో అరెస్ట్ ఎక్కువగా అవుతున్న వారు మాత్రం ఆఫ్రికన్-అమెరికన్లే.
2018 ఏడాదికి సంబంధించిన గణాంకాల ప్రకారం ప్రతి లక్ష మంది ఆఫ్రికన్-అమెరికన్లలో 750 మంది డ్రగ్ కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు. అదే శ్వేత అమెరికన్ల విషయానికి వస్తే ప్రతి లక్ష మందిలో అరెస్ట్ అవుతున్న వారి సంఖ్య సుమారు 350 మాత్రమే.
విచిత్రమేంటంటే గణాంకాలన్నీ వారు డ్రగ్స్ వాడకంలో రెండు జాతులకు చెందిన వారి సంఖ్య దాదాపు ఒకేలా ఉంది. కానీ అరెస్ట్ అయ్యే వారి సంఖ్య మాత్రం ఆఫ్రికన్-అమెరికన్లలోనే ఎక్కువ.
విచిత్రమేంటంటే గణాంకాలన్నీ వారు డ్రగ్స్ వాడకంలో రెండు జాతులకు చెందిన వారి సంఖ్య దాదాపు ఒకేలా ఉంది. కానీ అరెస్ట్ అయ్యే వారి సంఖ్య మాత్రం ఆఫ్రికన్-అమెరికన్లలోనే ఎక్కువ.
ఫొటో సోర్స్, Getty Images
జైళ్లకి వెళ్తున్న వారిలోనూ ఆఫ్రికన్-అమెరికన్లే ఎక్కువ
అమెరికన్లతో పోల్చితే ఐదు రెట్లు, హిస్పానిక్-అమెరికన్లతో పోల్చితే రెట్టింపు సంఖ్యలో ఆఫ్రికన్-అమెరికన్లు జైలు శిక్షలు అనుభవిస్తున్నారన్నది తాజా గణాంకాల సారాంశం.
2018 నాటికి అమెరికాలో ఆఫ్రికన్-అమెరిన్ల జనాభా సుమారు 13 శాతం. అదే అమెరికన్ జైళ్లలో మగ్గుతున్న వారి జనాభాతో పోల్చినప్పుడు ఏకంగా 33శాతం మంది నల్లజాతీయులే ఉన్నారు.
అంటే ప్రతి లక్ష మంది ఆఫ్రికన్-అమెరికన్లలో వెయ్యి మంది జైళ్లలో ఉండగా, అదే తెల్లజాతీయుల విషయానికి వచ్చేసరికి ప్రతి లక్ష మందిలో కేవలం 200 మంది మాత్రమే శిక్షలు అనుభవిస్తున్నారు.
ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని మాత్రమే జైల్లో ఉన్న జనాభాగా అక్కడ ప్రభుత్వం పరిగణిస్తుంది.
నిజానికి గత పదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నల్లజాతీయుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కానీ ఇప్పటికీ మిగిలిన జాతుల జనాభాతో పోల్చితే జైళ్లలో నల్ల జాతీయులే అధికంగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- బంకర్లో దాక్కున్న ట్రంప్.. వైట్‌హౌస్ సమీపంలో హింసాత్మక ఘటనలతో జాగ్రత్తపడిన భద్రతా సిబ్బంది
- ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా తెగతెంపులు - ట్రంప్
- బాంబులు తయారుచేసిన మిలిటెంటే ఉగ్రవాదుల్లో మార్పు తెస్తున్నాడు
- డోనల్డ్ ట్రంప్: ‘భారత్, చైనాల సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధం’
- ‘మోదీతో కలిసి తింటే ఎంతో బాగుండేది’: సమోసాలు తయారు చేసి ట్వీట్ చేసిన ఆస్ట్రేలియా ప్రధాని
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)