స్ట్రాబెర్రీ మూన్: ఈ రోజు రాత్రికి చంద్ర గ్రహణం - భారతదేశంలో కనిపించే సమయాలివీ...

ఫొటో సోర్స్, EPA
ఈ ఏడాది ప్రారంభంలోనే జనవరి నెలలో ఒక చంద్రగ్రహణాన్ని వీక్షించిన దేశ ప్రజలు ఈనెలలో పౌర్ణమి రోజున మరో చంద్రగ్రహణాన్ని చూడనున్నారు.
2020 జూన్ 5, 6 తేదీల్లో ఏర్పడే దీనిని ఉపఛాయ చంద్ర గ్రహణం (పెనుంబ్రల్ లూనార్ ఎక్లిప్స్) అంటారు.
ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా ఖండాలలో ఉన్నవారందరూ ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు.
ఆ సమయంలో చంద్రుడిని స్ట్రాబెర్రీ మూన్ అంటున్నారు. రోజ్ మూన్, హాట్ మూన్, మెడ్ మూన్ అని కూడా పిలుస్తున్నారు.
భారత కాలమానం ప్రకారం జూన్ 5వ తేదీ రాత్రి 11.15 గంటలకు మొదలయ్యే చంద్రగ్రహణం జూన్ 6వ తేదీ ఉదయం 2.34 గంటలకు ముగుస్తుందని టైమ్ అండ్ డేట్ వెబ్సైట్ చెబుతోంది.
అంటే ఈ చంద్రగ్రహణం పూర్తిగా 3 గంటల 18 నిమిషాల పాటు ఉంటుంది.
భారత్‌లో పూర్తి స్థాయి చంద్రగ్రహణం అర్థరాత్రి 12 గంటల 54 నిమిషాలకు కనిపిస్తుందని, వాతావరణం స్పష్టంగా ఉంటే దేశంలో అందరూ దానిని చూడవచ్చని ‘టైమ్ అండ్ డేట్’ తెలిపింది.
సాధారణంగా చంద్రుడికి సూర్యుడికి మధ్యన భూమి అడ్డుగా వచ్చినపుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
అంటే సూర్యుడి వెలుతురు చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుకున్నప్పుడు అలా జరుగుతుంది. ఆ సమయంలో భూమిపైన ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. ఇది పౌర్ణమి రోజే సంభవిస్తుంది.
జూన్ 5, 6 తేదీల్లో స్ట్రాబెర్రీ మూన్ చంద్రగ్రహణాన్ని టెలిస్కోప్‌ల అవసరం లేకుండా నేరుగానే వీక్షించవచ్చు.
ఫొటో సోర్స్, GERHARD GELDENHUYS
ఉపఛాయ చంద్రగ్రహణం
చంద్రగ్రహణం మొదలవక ముందు చంద్రుడు భూమి పాక్షిక నీడలోకి అడుగుపెడతాడు. అందుకే దీని పెనుంబ్రాల్(ఉపఛాయ) చంద్ర గ్రహణం అంటున్నారని నాసా చెప్పింది.
తర్వాత భూమి వాస్తవిక ఛాయలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. ఆ సమయంలో అసలైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
అయితే ఎక్కువగా చంద్రుడు, భూమి ఉపఛాయలోకి ప్రవేశించిన వెంటనే ఆ నీడ నుంచి బయకు వస్తాడు.
ఆ సమయంలో చంద్రుడు పాక్షికంగా మాత్రమే కనిపిస్తాడు. అందుకే చంద్రుడు మసకగా కనిపిస్తాడు. అందుకే దీనిని ఉపఛాయ చంద్రగ్రహణం అంటారు.
జూన్‌లో వచ్చే పౌర్ణమిని వసంతకాలంలో చివరి పౌర్ణమిగా భావించిన ఆల్గోన్క్విన్ తెగలు దీనికి స్ట్రాబెరీ మూన్ అనే పేరు పెట్టారని నాసా చెప్పింది.
జ్యేష్ట మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని హిందువులు జ్యేష్ట పూర్ణిమ, వట పూర్ణిమగా పిలుస్తారు.
ఈ పౌర్ణమి రోజున మహిళలు వట సావిత్రి వ్రతం చేస్తారు. గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో జ్యేష్ట పూర్ణిమ, వట పూర్ణిమ వ్రతాలు చేస్తారు.
ఆ రోజున మూడు రోజులు మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం మర్రి చెట్టుకు పూజలు చేస్తారు. ఇదే రోజున సావిత్రి యముడిని ఎదిరించి భర్త సత్యవంతుడిని బ్రతికించుకుందనే పురాణాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- గర్భంతో ఉన్న ఏనుగును దారుణంగా చంపేశారు
- ఏనుగు మరణం: కేరళలోని గుళ్లలో 600 ఏనుగులను చంపేశారని మేనకా గాంధీ ఆరోపణలు.. అది నిజమేనా?
- జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం-ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)