శామ్‌సంగ్‌ సంస్థపై 30 ఏళ్లుగా పోరాడుతోన్న మాజీ ఉద్యోగి

శామ్‌సంగ్‌ సంస్థపై 30 ఏళ్లుగా పోరాడుతోన్న మాజీ ఉద్యోగి

దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో 61 ఏళ్ల కిమ్‌యాంగ్ హీ 20 మీటర్ల ఎత్తున్న ఓ ట్రాఫిక్ టవర్‌పై ఏడాది కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఆయన గత 30 ఏళ్లుగా చేస్తోన్న నిరసనల్లో ఇది కొత్త రూపమని చెప్పాలి. శామ్‌సంగ్‌లో పనిచేసే కార్మికుల హక్కులకోసం ఆయన పోరాడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ అతిపెద్ద కంపెనీలో 30 ఏళ్ల క్రితం తాను కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా, తనను ఉద్యోగంలోంచి తీసివేశారని కిమ్ చెప్తున్నారు.

కానీ నిబంధనల ప్రకారమే ఆయనను ఉద్యోగంలోంచి తీసేసామని శామ్‌సంగ్‌ చెప్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)