కరోనావైరస్ చైనాలోని వూహాన్లో డిసెంబర్ కన్నా ముందే బయటపడిందా... శాటిలైట్ చిత్రాలు ఏం చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, AFP
లాక్డౌన్ తరువాత మొదటిసారిగా జూన్ 8న వూహాన్ విశ్వవిద్యాలయంలో బ్యాగులు శానిటైజ్ చేసుకుంటున్న విద్యార్థులు
చైనాలోని వూహాన్ నగరంలో ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఆస్పత్రుల వద్ద భారీగా ట్రాఫిక్ పెరిగినట్టు ఉపగ్రహ ఛాయ చిత్రాల ద్వారా స్పష్టమవుతోందని హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు.
అదే సమయంలో దగ్గు, డయేరియా లక్షణాలకు సంబంధించి జనం ఆన్ లైన్లో వెతకడం కూడా ఒక్కసారిగా పెరిగింది.
అయితే చైనా మాత్రం ఏ మాత్రం సారం లేని సమాచారంతో చేసిన అర్థం లేని పరిశోధన అంటూ దీన్ని కొట్టి పారేసింది.
తొలిసారిగా నవంబర్లోనే వైరస్ ఉనికి తెలిసిందని మరోసారి స్పష్టం చేసింది. అయితే డిసెంబర్ 31న ఒక్కసారిగా న్యూమోనియా కేసులు పెరిగాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అధికారవర్గాలు సమాచారాన్ని ఇచ్చాయి. కారణాలేంటన్నది తెలియడం లేదని అందులో పేర్కొన్నాయి.
అయితే తాజా పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ జాన్ బ్రౌనిస్టీన్ మాత్రం కరోనావైరస్ మహమ్మారిని గుర్తించడం కన్నా ముందే ఒక స్థాయిలో సామాజిక విచ్ఛిన్నం జరిగిందని ఏబీసీ న్యూస్‌తో అన్నారు. అయితే ఈ పరిశోధనను మరింత విస్తృత స్థాయిలో సమీక్ష చేయవలసి ఉంది.
ఫొటో సోర్స్, Harvard University
ఉపగ్రహ చిత్రాలలతో వూహాన్‌లోని ఆస్పత్రులను పరిశీలిస్తున్న పరిశోధకులు
ఈ పరిశోధన ఏం చెబుతోంది?
పరిశోధకులు కమర్షియల్ శాటిలైట్ చిత్రాల ద్వారా వూహాన్‌లోని ఆస్పత్రుల పరిసర ప్రాంతాలను గమనించారు. 2018లో ఆగస్టు తరువాత అలాగే 2019 ఆగస్టు నెల తర్వాత ఆస్పత్రుల వద్ద పరిస్థితుల్ని అధ్యయనం చేశారు.
2018 అక్టోబర్‌లో వూహాన్‌లోని అతి పెద్ద ఆస్పత్రుల్లో ఒకటైన టయాన్యు ఆస్పత్రి వద్ద 171కార్లు నిలిపి ఉన్నాయి.
అదే ఆస్పత్రి వద్ద 2019 అక్టోబర్ శాటిలైట్ డేటాను పరిశీలించగా నిలిపి ఉన్న కార్ల సంఖ్య 285కి చేరింది. అంటే దాదాపు 67 శాతం పెరిగాయన్నమాట.
అదే సమయంలో చైనా సెర్చింజన్ బైదులో కరోనావైరస్ లక్షణాలతో సంబంధం ఉన్న పదాలతో సెర్చ్ చేయడం అనుహ్యంగా పెరిగింది.
“ఇదంతా ఆ సమయంలో వూహాన్లో ఏదో జరిగిందనడానికి చెప్పడానికి సంబంధించిన సమాచారం” అని డాక్టర్ బ్రౌనిస్టీన్ ఏబీసీకి చెప్పారు.
అయితే మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో చైనా విదేశా మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ ఈ పరిశోధనను కొట్టి పారేశారు.
“ఇదో హాస్యాస్పదమైన పరిశోధన. పెరిగిన ట్రాఫిక్‌ను పరిగణనలోకి తీసుకొని ఓ నిర్ణయానికి రావడంలో అర్థం లేదు” అని ఆమె వ్యాఖ్యానించారు.
ఫొటో సోర్స్, Meituan
ఈ పరిశోధనపై ఎన్నో అనుమానాలు
పరిశోధకులు ఉపయోగించిన డేటా విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయని బీబీసీ బీజింగ్ ప్రతినిధి జాన్ సడ్ వర్త్ అన్నారు. ఉదాహరణకు వరుస సంవత్సరాలలో అదే రోజు ఉపగ్రహాలు చిత్రీకరించిన ఛాయ చిత్రాలను వారు పరిశీలించ లేదు. అందుకు కారణం ఆ సమయంలో తీసిన ఫోటోల్లో మబ్బులు పూర్తిగా కప్పి ఉండటమే.
అయితే చైనా కావాలనే ఈ వైరస్ విషయాన్ని బయట పెట్టడంలో ఆలస్యం చేసిందని చెప్పడానికి ఈ పరిశోధనను ఆధారం చేసుకోవడం సరికాకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ తెలియని వ్యాధి మూలాలు అక్కడ సమాజంలో ఉంటే దాన్ని అధికారికంగా గుర్తించకముందే మనకు తెలియకుండానే అది అక్కడ మరింత వ్యాపించి ఉండేది. అని సడ్ వర్త్ చెప్పారు.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
2019 డిసెంబర్ 31న న్యూమోనియా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని కారణాలు అంతు చిక్కడం లేదని చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపింది.
సుమారు 9 రోజుల తర్వాత కొన్ని న్యూమోనియా కేసుల విషయంలో కరోనావైరస్ను గుర్తించినట్టు చైనా అధికార వర్గాలు వెల్లడించాయి.
ఆపై 2020 జనవరి 23 నుంచి వూహాన్ సహా చైనాలోని ఇతర నగరాల్లో లాక్ డౌన్ మొదలయ్యింది.
2020 జనవరి 30న డబ్ల్యూహెచ్ఓ కోవిడ్-19ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఆ తరువాత చైనాకు ఆవల 82 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
ఫొటో సోర్స్, EPA
బీబీసీ హెల్త్ కరస్పాండెంట్ హెలెన్ బ్రిగ్స్ విశ్లేషణ
ఆరు నెలల తర్వాత కూడా వైరస్ టైమ్ లైన్ విషయంలో స్పష్టత లేదు. మొదటి సారిగా 2019 డిసెంబర్లో వూహాన్‌లోని చేపలు, జంతు మాంసం అమ్మే మార్కెట్లో ఈ కేసులు బయటపడ్డాయి.
ఆ తరువాత నిర్వహించిన పరీక్షల్లో వైరస్ ఉనికి కనుగొన్నప్పటికీ అన్ని కేసులకు వూహాన్లో ఆ మార్కెట్‌తో సంబంధం లేదు. అలాగే జంతువుల నుంచే ఈ వైరస్ వ్యాప్తి చెందిందనడానికి ఎలాంటి ఆధారాలను కూడా గుర్తించలేదు. డిసెంబర్లో ఓ ఫ్రెంచ్ వైద్యుడు తన రోగిలో కరోనావైరస్ వ్యాధి లక్షణాలు కనిపించాయని చెప్పడానికి ముందు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు ఆధారాలు బయటపడ్డాయి.
ఇప్పుడు ఈ తాజా ఆసక్తికర పరిశోధన ప్రత్యక్ష సాక్షుల నుంచి కాకుండా ఉపగ్రహ ఛాయా చిత్రాలు, ఆస్పత్రుల వద్ద ఉన్న ట్రాఫిక్, ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్‌లో వెతికిన పదాల ఆధారంగా జరిగింది. దాని ప్రకారం 2019 శరదృతువు ప్రారంభం నుంచి వూహాన్లో ఈ తరహా వ్యాధి లక్షణాలు బయటపడం ప్రారంభించిదని చెప్పడానికి ఒక కొత్త క్లూ దొరికినట్టయ్యింది.
వైరస్ విషయంలో అటు జంతువులపై, ఇటు మానవులపై మరింత పరిశోధన చెయ్యడం ద్వారా మాత్రమే తగిన సమాధానం లభిస్తుంది. అదే సమయంలో ఇది సరిగ్గా ఎప్పుడు ఎక్కడ నుంచి ప్రారంభమయ్యిందన్న విషయం మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు కూడా.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)