కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- జస్టిన్ రౌలట్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ సమయంలో పర్యావరణానికి సంబంధించిన అంశాలు కూడా విస్తృతంగా చర్చకి వచ్చాయి.
కాలుష్య రహిత ఆకాశాన్ని, గాలిని మనలో చాలా మంది ఆస్వాదించాం. ఇంధన వాడకంలో ఒక వినూత్న ప్రయోగం జరుగుతుందనడానికి ఇదొక సంకేతమని చెప్పవచ్చు.
ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు లాక్ డౌన్ తో ఇళ్లల్లో ఉండిపోవడంతో ఇంధనానికి కూడా డిమాండ్ విపరీతంగా తగ్గింది.
ఇది ఇంధన పరిశ్రమ ఆర్ధిక పరిస్థితిని తేటతెల్లం చేసింది. ఆధునిక ప్రపంచ నిర్మాణానికి సహకరించిన బొగ్గుకి పొంచి ఉన్న ముప్పుని వాటి ఆర్ధిక పునాదుల బలహీనతలను బయట పెట్టింది.
ఈ మహమ్మారి ప్రభావం నుంచి బొగ్గు ఎప్పుడూ బయట పడకపోవచ్చని కొందరు పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఇలా చెప్పడానికి వెనకనున్న ఆధారేమిలేమిటో ఒకసారి చూద్దాం.
బ్రిటన్ ఎలెక్ట్రిసిటీ గ్రిడ్ గత 60 రోజులుగా విద్యుత్ ఉత్పత్తికి బొగ్గుని వాడలేదు. పారిశ్రామిక విప్లవం మొదలైన 200 సంవత్సరాలలో ఇన్ని రోజులు బొగ్గుని వాడకుండా ఉండటం ఇదే మొదటిసారి.
ఇప్పట్లో బొగ్గు ఆధారంతో నడిచే జనరేటర్ ను నడిపే దాఖలాలు కనిపించటం లేదని నేషనల్ గ్రిడ్ అధికారులు చెప్పారు.
అమెరికాలో బొగ్గు కంటే ఇతర పునరుత్పాదక వనరులతో విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నారు.
ఒక దశాబ్దం క్రితం వరకు అమెరికాలో సగం విద్యుత్ బొగ్గు ఆధారంగానే ఉత్పత్తి అయ్యేది.
బొగ్గుని అత్యధికంగా వాడే భారతదేశంలో కూడా డిమాండ్ విపరీతంగా పడిపోయింది. దీంతో 37 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా కార్బన్ డై ఆక్సైడ్ వాయువులు తగ్గిపోయాయి.
ఇందుకు లాక్ డౌన్ ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అయితే, మొత్తంగా విద్యుత్ కి తగ్గిన డిమాండ్ బొగ్గు పరిశ్రమ పై తీవ్ర ప్రభావం చూపించింది. .
ఫొటో సోర్స్, Getty Images
ఇదే తీరు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బొగ్గు వాడకం విపరీతంగా పడిపోవడం ఇదే మొదటిసారని ఇంటర్నేషనల్ అటామిక్ఎనర్జీ ఏజెన్సీ కూడా తెలిపింది.
పునరుత్పాదక ఇంధనాలు మాత్రమే ఇప్పుడు నిలదొక్కుకున్నాయని ఐ ఇ ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫెయిత్ బైరల్ చెప్పారు.
కరోనావైరస్ తలెత్తక ముందు నుంచే ఈ పరిణామం కనిపించిందని చెప్పారు. గత సంవత్సరం కూడా ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ఆధారిత విద్యుత్ తయారీ గణనీయంగా పడిపోయిందని తెలిపారు.
ఇదంతా పర్యావరణ వేత్తలు బొగ్గు వలన కలిగే హాని గురించి వాపోతుండడం వలన జరిగిన పరిణామం మాత్రమే కాదు.
విద్యుత్ ఉత్పత్తికి వాడే వివిధ రకాల ఇంధనాల వలన అయ్యే సగటు ఖర్చు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
పవర్ ప్లాంట్ నిర్వహణలో సహజ వనరులైన గాలి, వర్షం, సూర్యరశ్మి కంటే ఇంధన ఆధారిత పవర్ ప్లాంట్ల నిర్వహణకి ఎక్కువ ఖర్చవుతుంది.
గాలి గాని, లేదా సోలార్ ఆధారిత విద్యుత్ తయారీ యంత్రాన్ని కొనుక్కుంటే దాని నుంచి వచ్చే విద్యుత్ ఉచితంగా వస్తుంది. అదే బొగ్గు అయితే నిరంతరం డబ్బు వెచ్చించి బొగ్గును కొంటూ ఉండాలి.
బొగ్గు కంటే పునరుత్పాదక ఇంధనాలు చవకగా దొరుకుతాయి.
విద్యుత్ కి డిమాండ్ పెరిగితే , పునరుత్పాదక శక్తి ద్వారా విద్యుత్ ని ఉత్పత్తి చేసుకోవడం సులభమైన మార్గం.
అదే విద్యుత్ కి డిమాండ్ అకస్మాత్తుగా తగ్గితే లేదా గాలి ఎక్కువగా ఉన్న రోజు విద్యుత్ ఉత్పత్తి పెరిగే అవకాశం వలన బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం మూత పడే అవకాశం ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
జూన్ నెలలో భారత ప్రభుత్వం 24 గంటలు ప్రజలకు విద్యుత్ సరఫరా చేసేందుకు టెండర్ విడుదల చేసింది. అయితే సోలార్ జనిత విద్యుత్ కి ఇచ్చే ధర బొగ్గు ఆధారిత విద్యుత్ సరఫరాకు ఇచ్చే ధర కన్నా తక్కువని విద్యుత్ రంగ నిపుణుడు సునీల్ దహియా చెప్పారు.
ఇదే పద్దతిని ప్రపంచమంతా అవలంబిస్తే బొగ్గుకు ఉనికి ఉండదు
ఒక వేళ ఒక కొత్త విద్యుత్ కేంద్రాన్ని స్థాపించడానికి ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే అది కనీసం 30 - 40 సంవత్సరాలు పని చెయ్యాలని ఆశిస్తారు.
అదే బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు డిమాండ్ లేదని తెలిసినప్పుడు అందులో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ఆసక్తి చూపరు.
కాలుష్య రహిత ఇంధనం కోసం ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతోంది.
అన్ని ఇంధనాలలోకెల్లా బొగ్గు ఎక్కువగా కార్బన్ ని విడుదల చేస్తుంది. అంతే కాకుండా గాలిని కలుషిత పదార్ధాలతో నింపేస్తుంది.
ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటికే చాలా దేశాలు విద్యుత్ ఉత్పత్తికి పునరుత్పాదక వనరుల వాడకానికి ప్రాముఖ్యతని ఇవ్వడం మొదలుపెట్టాయి. దీంతో కేవలం కొత్తగా బొగ్గు పై పెట్టే పెట్టుబడులకు మాత్రమే కాకుండా పాత వాటికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
ఇప్పటికే భారతీయ బొగ్గు పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయిందని దహియా తెలిపారు.
బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమలు ఇప్పటికే 60 శాతం తక్కువ సామర్ధ్యంతో పని చేస్తున్నాయని ఆయన చెప్పారు. దీంతో అప్పులు కూడా తీర్చడం కష్టమని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఈ రంగంలో పెట్టే పెట్టుబడుల నుంచి నెమ్మదిగా వైదొలుగుతారనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.
గత వారం అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలైన నార్వేజియన్ సోవెరిన్ వెల్త్ ఫండ్, బి ఎన్ పి పరిబాస్, బ్లాక్ రాక్, స్టాండర్డ్ ఛార్టర్డ్, జె పి మోర్గన్ చేస్ బొగ్గు ఆధారిత పెట్టుబడులను బ్లాక్ లిస్ట్ లో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
అంటే, బొగ్గు భవిష్యత్తుని ఇక మీదట ఆ యా దేశాల ప్రభుత్వాలే నిర్ణయించాలని బైరల్ చెప్పారు.
బొగ్గు పై పెట్టే పెట్టుబడులకు స్వస్తి చెప్పి పునరుత్పాదక వనరులకు ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు.
అయితే ఇది అంత ఆకర్షణీయంగా కనిపించటం లేదు.
చైనా పంచ వర్ష ప్రణాళికలో బొగ్గు పరిశ్రమకి 20 శాతం పెరుగుదల ఇవ్వాలని సూచిస్తూ ప్రణాళిక చేశారు.
చైనా తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రయత్నంలో భాగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు పెట్టుబడులను సమకూర్చేందుకు సహాయపడుతుంది.
భారత దేశంలో ప్రకటించిన కరోనావైరస్ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా బొగ్గు ఆధారిత పరిశ్రమలకు కూడా సహాయం చేసేందుకు చూస్తున్నారు.
2019 లో బొగ్గు వినియోగం ప్రపంచ వ్యాప్తంగా పెరిగినప్పటికీ , 2030 కల్లా ఇది కుంటుపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సంస్థలు ఎదుర్కొంటున్నంత ఒత్తిడిని ప్రభుత్వాలు ఎదుర్కోవు. కాకపొతే, కాలుష్య కారకమైన, డిమాండ్ తగ్గిపోతున్న పరిశ్రమలకి రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వాలు ఆసక్తి చూపవు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: లాక్డౌన్ వారికి కొత్త కాదు... ఆ అందమైన దేశంలో అదొక చిరకాల సంప్రదాయం
- వందల ఏళ్ల క్రితమే క్వారంటైన్ విధానాన్ని అనుసరించిన పురాతన నగరం ఇది
- కోవిడ్-19: ‘నేను వెంటిలేటర్ తొలగించి రోగి మరణించడానికి సహాయపడతాను’
- లాక్డౌన్ 4.0.. స్టేడియంలను తెరవొచ్చు, ప్రేక్షకులు వెళ్ల కూడదు.. విమానాలు, మెట్రో రైళ్ల సేవలు రద్దు
- కరోనావైరస్: ఒంటరి వ్యక్తులు ‘సెక్స్ స్నేహితుల’ను వెదుక్కోండి – ప్రభుత్వ మార్గదర్శకాలు
- 800 మీటర్ల ఎత్తున్న శిఖరాల మీద నివసించే ప్రజలను పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్న చైనా
- ప్రపంచం మెరుగవుతోంది... ఇవిగో రుజువులు
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)