పాకిస్తాన్‌లో 22 హిందూ నివాసాల కూల్చివేత

పాకిస్తాన్‌లో 22 హిందూ నివాసాల కూల్చివేత

ఇవి పాకిస్తాన్‌లోని దక్షిణ పంజాబ్‌లో కనిపిస్తున్న దృశ్యాలు. హిందువులు నివసించే ప్రాంతంలోని 22 ఇళ్ళను కూల్చేశారు దక్షిణ పంజాబ్‌.. జిల్లా అధికారులు.

మొహమ్మద్ బూట అనే ఓ స్థానిక ముస్లిం ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు.

మాన్షా రామ్ అనే హిందూ నేత ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా తమ సముదాయానికి అమ్మాలనుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు.మొహమ్మద్ బూటా ఈ భూమిపై కన్నేసాడని, తనకున్న రాజకీయ సంబంధాలను ఉపయోగించి తమను బెదిరిస్తున్నాడని అక్కడి హిందువులు అంటున్నారు.

ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ వివాదంపై స్థానిక కోర్టు ఇదివరకే స్టే విధించింది.ఇప్పుడు హిందూ సముదాయం వారు స్థానిక అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేశారు.జరిగిన ఘటనను పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా ఖండించింది.మత విద్వేషంతోనే హిందూ సముదాయాన్ని టార్గెట్ చేశారనడానికి పూర్తి ఆధారాలున్నాయని మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)