కరోనావైరస్: కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? హెర్డ్ ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ కేసులు భారత్ సహా ప్రపంచంలోని మిగతా దేశాల్లో కూడా పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 75 లక్షల కేసులు నమోదయ్యాయి. చనిపోయిన వారి సంఖ్య నాలుగు లక్షలు దాటింది. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఇక్కడ మృతుల సంఖ్య 8 వేలకు పైనే ఉంది.
ఇంత భారీ సంఖ్యలో కేసులు పెరిగాక ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(సామాజిక వ్యాప్తి), హెర్డ్ ఇమ్యూనిటీ(అధిక రోగనిరోధక శక్తి) అనే ప్రశ్నలు వస్తున్నాయి.
అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకారం భారత్‌లో సామాజిక వ్యాప్తి పరిస్థితి ఇంకా రాలేదు.
ఫొటో సోర్స్, Getty Images
సామాజిక వ్యాప్తి అంటే?
'సామాజిక వ్యాప్తి' ఎలా జరుగుతుంది?
కరోనా వ్యాప్తిలో నాలుగు దశలు ఉన్నాయని ఐసీఎంఆర్ చెబుతోంది.
మొదటి దశలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని కరోనా పాజిటివ్‌గా గుర్తిస్తారు. భారత్ ఈ దశను దాటేసింది. ఎందుకంటే వైరస్ అలాంటి వారి నుంచి ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో వ్యాపించింది.
రెండో దశలో ప్రాంతీయ స్థాయి వ్యాప్తి జరుగుతుంది. కానీ, విదేశాల నుంచి తిరిగి వచ్చి, పాజిటివ్ అయిన వారిని కలిసినవారిలోనే ఇది వ్యాపిస్తుంది.
మూడో దశలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(సామాజిక వ్యాప్తి). దీన్లో ఒకరికి వైరస్ వ్యాపించడానికి కారణం ఎవరో తెలుసుకోవడం కష్టం అయిపోతుంది.
ఏ వైరస్‌కు అయినా నాలుగో దశ కూడా ఉంటుంది. ఆ సమయంలో అది ప్రాంతీయ స్థాయిలో మహమ్మారిగా మారిపోతుంది.
ఫొటో సోర్స్, Getty Images
సామాజిక వ్యాప్తి అంటే?
'హెర్డ్ ఇమ్యూనిటీ'అంటే ఏంటి?
ఏదైనా ఒక వ్యాధి జనాభాలోని ఒక పెద్ద భాగంలో వ్యాపిస్తే, మనుషుల రోగ నిరోధక శక్తి ఆ వ్యాధి వ్యాపించకుండా అడ్డుకునేందుకు సాయం చేస్తుంది.
అంటే, జనాభా ఆ వ్యాధితో పోరాడి పూర్తిగా కోలుకోగలరు. వారు ఆ వ్యాధి నుంచి ‘ఇమ్యూన్’ అవుతారు. అంటే వారిలో రోగ నిరోధక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. వారిలో ఆ వైరస్‌ను తట్టుకోగలిగే ‘యాంటీ-బాడీస్’ తయారవుతాయి.
‘హెర్డ్ ఇమ్యూనిటీ’ ఎలా జరుగుతుంది?
క్రమంగా జనం ‘ఇమ్యూన్’ అయ్యే కొద్దీ, వైరస్ వ్యాపించే ప్రమాదం కూడా తగ్గుతూ ఉంటుంది. దానివల్ల కరోనా రానివారికి, ఆ వ్యాధికి ఇమ్యూన్ కాని వారికి పరోక్షంగా రక్షణ లభిస్తుంది.
అమెరికా హార్ట్ అసోసియేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎడ్వర్డ్ శాంచెజ్ తన బ్లాగ్‌లో దీనిని వివరించే ప్రయత్నం చేశారు.
“ఒక మనుషుల గుంపు(ఇంగ్లిష్‌లో హెర్డ్)లో ఎక్కువ శాతం మంది వైరస్ నుంచి ఇమ్యూన్ అయిపోతే, అది వారి మధ్యలో ఉన్న వారి వరకూ చేరడం చాలా కష్టం అవుతుంది. అంటే, ఒక పరిమితి తర్వాత దాని వ్యాప్తి ఆగిపోతుంది. కానీ, ఆ ప్రక్రియకు సమయం పడుతుంది. దానితోపాటు ఏదైనా టీకా వేసే కార్యక్రమం సాయంతో అత్యంత సున్నితమైన వ్యక్తులు కూడా సురక్షితంగా ఉన్నారని నిర్ధరణ అయినప్పుడు దానిని హెర్డ్ ఇమ్యూనిటీగా భావిస్తారు.
ఒక అంచనా ప్రకారం ఒక సమాజంలో 60 శాతం జనాభాకు కరోనా వ్యాపిస్తే, వారు దానితో పోరాడి ఇమ్యూన్ అయినప్పుడు కోవిడ్-19 నుంచి వారిలో హెర్డ్ ఇమ్యూనిటీ వృద్ధి చెందింది అని చెప్పచ్చు” అని తెలిపారు.
80 శాతం ఇమ్యూన్ కావాలి
కానీ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వివరాల ప్రకారం “హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయికి చేరుకోవాలంటే సుమారు 80 శాతం జనాభా ఇమ్యూన్ కావాల్సిన అవసరం ఉంటుంది. అంటే, ప్రతి ఐదుగురిలో నలుగురు కరోనా రోగుల కాంటాక్టులోకి వచ్చినా, అది వారికి రాకపోతే.. దానిని నియంత్రించవచ్చు. అయితే అది ఆ అంటువ్యాధి లక్షణాలను బట్టి కూడా ఉంటుంది. ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ స్థాయికి చేరుకోడానికి సాధారణంగా 70 నుంచి 90 శాతం జనాభా ఇమ్యూన్ కావడం తప్పనిసరి”.
తట్టు, గవదబిళ్ల, పోలియో, చికన్ పాక్స్ లాంటివి అంటువ్యాధులు. ఒకప్పుడు అవి సర్వ సాధారణం. కానీ ఇప్పుడు అమెరికా లాంటి ప్రాంతాల్లో ఇవి అరుదుగా వస్తుంటాయి. ఎందుకంటే వాక్సిన్ సాయంతో హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయిని చేరుకోడానికి అక్కడివారికి సాయం లభించింది. వారు ఆ స్థితికి చేరుకోగలిగారు.
ఏదైనా ఒక అంటువ్యాధికి ఇంకా టీకా తయారుకాకపోతే, ఆ వ్యాధికి పెద్దవారిలో అప్పటికే రోగనిరోధక శక్తి ఉంటే, అది పిల్లలకు లేదా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఇప్పటికీ సోకవచ్చు.
పైన మనం ప్రస్తావించిన వ్యాధుల్లో, చాలా వైరస్‌లకు టీకాలు కనిపెట్టే ముందే ఈ విషయాన్ని గమనించారు.
ఫ్లూ వైరస్ లాంటి కొన్ని వైరస్లు కాలంతోపాటు మారుతుంటాయి. అందుకే మనుషుల శరీరంలో తయారైన పాత యాంటీ-బాడీస్ వాటికి పనిచేయవు. అవి మళ్లీ మనకు వస్తుంటాయి. ఫ్లూ విషయంలో ఈ మార్పు ఏడాదిలోపే జరుగుతుంది.
కోవిడ్-19కు కారణమైన సార్స్-కోవీ-2 కూడా మిగతా కరోనావైరస్ల లాంటిదే అయితే, దానికి ఇమ్యూన్ అయినవారికి కొన్ని నెలలు లేదా ఏళ్ల వరకూ అది రాదని మనం ఆశించవచ్చు. కానీ మొత్తం జీవితాంతం అలాగే ఉండగలమని అనుకోలేం.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- ప్రసవం తర్వాత మహిళల కుంగుబాటు లక్షణాలేంటి? ఎలా బయటపడాలి?
- తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది.. రెండేళ్లా? ఐదేళ్లా?
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఉత్తర ప్రదేశ్‌లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీల తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)