Sushant Singh Rajput: ధోనీ బయోపిక్ హీరో 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
- బీబీసీ హిందీ డెస్క్
- .

ఫొటో సోర్స్, @itsSSR
ప్రముఖ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి నేటికి రెండేళ్లు. ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఆయన చనిపోయారు.
34 ఏళ్ల సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని అప్పట్లో ముంబయి పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఆత్మహత్యకు కారణాలేంటి అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. చనిపోవడానికి ముందు ఆరు నెలలుగా ఆయన డిప్రెషన్‌తో బాధపడుతున్నారని కూడా కొందరు పోలీసులకు తెలిపారు.
బాలీవుడ్లో క్రమక్రమంగా ఎదుగుతూ, తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న ఒక యువ నటుడు ఇలా ఉన్నట్టుండి చనిపోవడం పట్ల అంతా షాకయ్యారు.
టీవీ సీరియల్స్ ద్వారా నట ప్రస్థానాన్ని ప్రారంభించిన సుశాంత్ సింగ్‌కు చాలా కలలు ఉన్నాయి. ఆ కలలే ఆయన్ను బాలీవుడ్‌కి చేర్చాయి.
కై పో చే, డిటెక్టివ్ బ్యోమ్కేష్ భక్షి, ధోనీ, పీకే, కేదార్నాథ్, చిచ్చోరే, దిల్ బేచారా వంటి చిత్రాలు ఆయనకు పేరుతెచ్చిపెట్టాయి.
సినిమాలకు సంబంధించి సుశాంత్ సింగ్ కలలు క్రమంగా నెరవేరుతూ వచ్చాయి. కానీ, ఇంకా నెరవేరని కలలు చాలా ఉన్నాయి.
ట్విటర్ వేదికగా తన కలలను ఆయన అందరితో పంచుకున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2019 సెప్టెంబర్ 14వ తేదీన 'My 50 DREAMS & counting' పేరుతో మొదటి పేజీ ఫొటోను పెట్టారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదటి కల ఒక విమానాన్ని నడపడం నేర్చుకోవడం.
రెండో కల ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్‌కు సిద్ధం కావడం. ఇందులో ఒక వ్యక్తి ఒక్క రోజులోనే 2.4 మైళ్లు స్విమ్మింగ్, 112 మైళ్లు సైకిల్ రైడింగ్, 26.22 మైళ్లు పరుగుపందెంలో పాల్గొనాల్సి ఉంటుంది. మూడు పందేలకూ నిర్ణీత సమయం ఉంటుంది. ఈ మూడింటిలో గెలుపొందిన వారికి ఐరన్ మ్యాన్ టైటిల్ ఇస్తారు.
సుశాంత్ సింగ్ మూడో కల ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడటం. ఎంఎస్ ధోనీ చిత్రంలో ఆయన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్, కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనీగా నటించిన సంగతి తెలిసిందే.
నాలుగో కల మోర్సె కోడ్ నేర్చుకోవడం. ఈ కోడ్‌ను టెలీకమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తుంటారు. దీని సాయంతో పదాలను రెండు భిన్నమైన సిగ్నళ్లుగా ఎన్కోడ్ చేస్తారు. వీటిని డాట్లు లేదా డాష్‌లు అంటారు.
ఐదో కల చిన్నారులు అంతరిక్షం గురించి తెలుసుకునేందుకు సహాయం చేయడం.
ఒక క్రికెట్ ఛాంపియన్ పాత్రలో నటించిన సుశాంత్ సింగ్ ఆరోకల ఒక టెన్నిస్ ఛాంపియన్ పాత్రలో నటించడం.
సుశాంత్ సింగ్ సోషల్ మీడియాలో చాలా ఫిట్నెస్ వీడియోలు కనిపిస్తుంటాయి. ఆయన ఏడో కల కూడా దీనికి సంబంధించినదే. నాలుగు క్లాప్ పుషప్‌లు చేయడం.
ఈ ఏడు కలలతో మొదటి పేజీ పూర్తయ్యింది. కానీ, ఆయన కలలు రెండో పేజీలో కొనసాగాయి.
రెండో పేజీ..
సుశాంత్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అంతరిక్షం గురించి, విశ్వం గురించి తన అభిప్రాయాలు పంచుకునేవారు. తన నటనతోను, చిరునవ్వుతోనూ గుర్తింపు తెచ్చుకున్న ఆయన కలల గురించి తెలుసుకుంటే అంతరిక్షం, గ్రహాలపై ఆయనకు ఎంత ఆసక్తి ఉందో తెలుస్తుంది.
సుశాంత్ సింగ్ ఎనిమిదో కల.. ఒక వారం రోజుల పాటు చంద్రుడు, అంగాకరుడు, బృహస్పతి, శని గ్రహాలను పర్యవేక్షించడం.
తొమ్మిదో కల ఒక బ్లూ హోల్లో ఈత కొట్టడం. సముద్రాల్లోని దీవుల్లో నీలం రంగులో ఉండే గుహలను బ్లూహోల్ అంటారు.
పదో కల.. ఒకసారి డబుల్ స్లిట్ ప్రయోగం చేసేందుకు ప్రయత్నించడం. కాంతి, పదార్థాలను వివరించేదే ఈ భౌతిక శాస్త్ర ప్రయోగం.
సుశాంత్ సింగ్ కొన్ని వేల మొక్కలు నాటాలని అనుకున్నాడు. అదే అతని 11వ కల.
సుశాంత్ సింగ్ 2003వ సంవత్సరంలో 12వ తరగతిలో ఉత్తీర్ణుడయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం ఏఐఈఈఈ పరీక్ష రాసి ఆలిండియా 7వ ర్యాంకు సంపాదించారు. దాంతో దేశంలో అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటైన దిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరారు. ఆ కాలేజీని సందర్శించడం సుశాంత్ సింగ్ 12వ కల.
ఇస్రో లేదా నాసా వర్క్‌షాపుకు వంద మంది పిల్లల్ని పంపించడం అతని 13వ కల.
కైలాశ్ (పర్వతం)పై ధ్యానం చేయడం సుశాంత్ సింగ్ 14వ కల. ఆయన కేదార్నాథ్ సినిమాలో నటించిన నేపథ్యంలో బహుశా ఈ కల నెరవేరి ఉండొచ్చు.
మూడో పేజీ..
ఒక ఛాంపియన్‌తో పోకర్ (పేకాట) ఆడటం 15వ కల
ఒక పుస్తకం రాయడం 16వ కల
యురోపియన్ న్యూక్లియర్ రీసెర్చి సంస్థ అయిన సీఈఆర్ఎన్ను సందర్శించడం 17వ కల
పోలార్ లైట్స్, నార్తరన్ లైట్స్, సదరన్ లైట్స్‌గా పేరొందిన ఆరోరాను చూస్తూ పెయింటింగ్ వేయడం 18వ కల
నాసాలో మరొక వర్క్‌షాపుకు హాజరు కావడం 19వ కల
ఆరు నెలల్లోనే సిక్స్ ప్యాక్స్ శరీరాన్ని పొందడం 20వ కల
సెనోట్ (సున్నపురాయి భూమి కుంగిపోవడంతో సహజంగా ఏర్పడిన నీటి కొలను)లో ఈదడం 21వ కల
చూపులేని వారికి కోడింగ్ నేర్పించడం 22వ కల
అడవిలో ఒక వారం రోజుల పాటు గడపడం 23వ కల
వైదిక జ్యోతిష్య శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం 24వ కల
డిస్నీలాండ్‌కి వెళ్లడం 25వ కల
నాలుగో పేజీ..
అమెరికాలోని లిగో (లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ)ని సందర్శించడం 26వ కల. ఇక్కడ భౌతిక శాస్త్ర ప్రయోగాలు జరుగుతుంటాయి.
ఒక గుర్రాన్ని పెంచుకోవడం 27వ కల
కనీసం పది నాట్య రీతుల్ని నేర్చుకోవడం 28వ కల
ఉచిత విద్య కోసం పనిచేయడం 29వ కల. సుశాంత్ ఫర్ ఎడ్యుకేషన్ పేరిట ఆయన విద్యార్థులకు సహాయం కూడా చేసేవారు.
అండ్రొమేడా అనే పాలపుంతను ఒక శక్తివంతమైన టెలిస్కోప్ సాయంతో పరిశీలించడం 30వ కల
క్రియా యోగను నేర్చుకోవడం 31వ కల
మంచుతో నిండిపోయిన అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడం 32వ కల
మహిళలు స్వీయ రక్షణ నైపుణ్యాలు నేర్చుకునేలా సహాయం చేయడం 33వ కల
నిప్పులు చిందే ఒక అగ్నిపర్వతాన్ని చిత్రీకరించడం 34వ కల
ఐదో పేజీ..
వ్యవసాయం నేర్చుకోవడం సుశాంత్ సింగ్ 35వ కల
పిల్లలకు డాన్స్ నేర్పించడం 36వ కల
రెండు చేతులతో బాణాలు వేసేలా శిక్షణ పొందాలని సుశాంత్ సింగ్ భావించారు. అదే అతని 37వ కల
రెస్నిక్ హల్లిడే రచించిన ఫిజిక్స్ పుస్తకం మొత్తాన్ని చదవాలనుకోవడం అతని 38వ కల
పాలినేసియన్ ఆస్ట్రానమీని అర్థం చేసుకోవడం సుశాంత్ సింగ్ 39వ కల
తన ఫేవరెట్ 50 పాటలకు గిటార్ నేర్చుకోవడం 40వ కల
ఒక ఛాంపియన్‌తో చెస్ ఆడటం 41వ కల
లాంబోర్గిని కారును సొంతం చేసుకోవడం 42వ కల
ఆరో పేజీ..
వియన్నాలోని సెయింట్ స్టీఫెన్స్ కేథడ్రల్ చర్చిని సందర్శించడం 43వ కల
సైమాటిక్స్ ప్రయోగాలు (ప్రకంపనలకు సంబంధించిన ప్రయోగాలు) చేయడం 44వ కల
భారత సైన్యంలో చేరేలా విద్యార్థులు సిద్ధమయ్యేందుకు సహాయం చేయడం 45వ కల
సముద్ర అలలపై సర్ఫింగ్ చేయడం 47వ కల
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్స్‌పోనేషియల్ టెక్నాలజీలపై పని చేయడం 48వ కల
కపోరియా (ఆఫ్రో-బ్రెజిలియన్ మార్షల్ ఆర్ట్)ను నేర్చుకోవడం 49వ కల
యూరప్ మొత్తం రైలులో ప్రయాణించడం 50వ కల
అయితే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేవలం కలలు కనడం, వాటిని బయటపెట్టడంతోనే ఆగిపోలేదు. వాటిలో కొన్నింటిని పూర్తి చేశారు కూడా.
మొదటి కల నిజమైంది ఇలా..
రెండో కల
మూడో కల
17వ కల
37వ కల
21వ కల
12వ కల
30వ కల
9వ కల
25వ కల
44వ కల
ఫొటో సోర్స్, @itsSSR
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ట్విటర్ ఖాతాలో తనను తాను ‘ఫోటాన్ ఇన్ ఎ డబుల్ స్లిట్’ అని నిర్వచించుకున్నారు. కాంతి, పదార్థాలను వివరించే భౌతిక శాస్త్ర ప్రయోగాన్ని డబుల్ స్లిట్ అంటారు. అందులో కాంతి పరిమాణాన్ని సూచించే కణమే ఫోటాన్.
మొత్తం 50 కలలు కన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వాటిలో 11 పూర్తి చేశారు.
మిగతావి ఇక పూర్తయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆ కలలు కన్న కన్నులు 2020 జూన్ 14వ తేదీ ఆదివారం శాశ్వతంగా మూసుకుపోయాయి.
మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
మానసిక ఆరోగ్యం: మీకు దిగులుగా ఉంటోందా... గుండె దడ పెరుగుతోందా?
ఇవి కూడా చదవండి:
- "నీది ఎంత ధనిక కుటుంబం అయినా కావొచ్చు.. కానీ, సమాజం లేకుండా నువ్వు బ్రతకలేవు" - దలైలామా
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- ధోనీలా హెలికాప్టర్ షాట్ ట్రై చేసి చేయి విరగ్గొట్టుకున్నాను: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
- గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి
- అధ్యయనం: 1,330 కోట్ల ఏళ్ల క్రితం ఆక్సిజన్ ఆనవాళ్లు
- స్టీఫెన్ హాకింగ్: తప్పక తెలుసుకోవాల్సిన 11 విషయాలు
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- మగాళ్ల ఆత్మహత్యకు ఈ ఐదు విషయాలే కారణమా
- విశ్వ రహస్యం గుట్టు విప్పే ప్రయత్నంలో మరో 'ముందడుగు'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)