కరోనా లాక్‌డౌన్: ఎట్టకేలకు బిడ్డను కలిసిన తల్లిదండ్రులు

కరోనా లాక్‌డౌన్: ఎట్టకేలకు బిడ్డను కలిసిన తల్లిదండ్రులు

ఉక్రెయిన్‌లో వాణిజ్య సరోగసీ చట్టబద్ధం. దీంతో పలు ఆస్పత్రులు ఈ కార్యక్రమం చేపడుతున్నాయి. విదేశాల నుంచి దంపతులు ఇక్కడికి వచ్చి సరోగసి ద్వారా సంతానాన్ని పొందుతున్నారు. దీనికి అయ్యే ఖర్చు సుమారు 50 వేల డాలర్లు.

అయితే, కరోనావైరస్ లాక్ డౌన్ల నేపథ్యంలో ఈ మధ్యకాలంలో జన్మించిన పిల్లలను విదేశాల్లో ఉన్న వారి తల్లిదండ్రులు కలవలేకపోయారు.

ఆ పిల్లలను ఒక ఆస్పత్రిలో ఉంచారు. అలా తమ పిల్లాడిని కలిసేందుకు తపనపడ్డ ఒక జంట ఎట్టకేలకు ఉక్రెయిన్ వచ్చారు.

ఆ తర్వాత ఏం జరిగిందో పై వీడియోలో చూడండి.