పోర్చుగల్: సముద్రంలో ఆపదలో చిక్కుకున్న ఇద్దరు మహిళలను రక్షించిన దేశాధ్యక్షుడు

ఫొటో సోర్స్, RADIOTELEVISAO PORTUGUESA
సముద్ర తీరంలో కయాక్ మీద విహరిస్తున్న ఇద్దరు మహిళలు ప్రమాదంలో చిక్కుకున్నపుడు.. స్వయంగా దేశాధ్యక్షుడు వారిని రక్షించిన ఉదంతమిది.
పోర్చుగల్‌లోని అల్గ్రేవ్ బీచ్‌లో కయాక్ తిరగబడి మహిళలు ఆపదలో చిక్కుకున్నారు. ఆ సమయంలో సమీపంలోనే సముద్రంలో ఈత కొడుతున్న దేశాధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌసా.. వారి దగ్గరకు వెళ్లి కాపాడారు.
రెబెలో వయసు 71 సంవత్సరాలు. కయాక్ తిరగబడి సముద్ర జలాల్లో చిక్కుకున్న సదరు మహిళల దగ్గరకు ఆయన ఈదుకుంటూ వెళుతున్న దృశ్యాన్ని వీడియోలో బంధించారు.
ఆ ఇద్దరు మహిళలు అక్కడికి సమీపంలోని మరొక బీచ్ నుంచి సముద్ర ప్రవాహంలో కొట్టుకుపోతూ ఇక్కడికి వచ్చారని అధ్యక్షుడు ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
ఆల్గ్రేవ్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అధ్యక్షుడు రెబెలో ప్రస్తుతం అక్కడ విహరిస్తున్నారు.
పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటక రంగం మీద ఆధారపడి ఉంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది.
అధ్యక్షుడు రెబెలో సోమవారం ప్రయా డో అల్వోర్ బీచ్ దగ్గర పాత్రికేయులతో మాట్లాడారు. అప్పుడే సముద్రంలో నీటిలో చిక్కుకున్న విషయాన్ని ఆయన గమనించారు.
వారికి సాయం చేయటానికి అధ్యక్షుడు నీటిలో ఈదుకుంటూ వెళుతున్న దృశ్యం వీడియోలో రికార్డయింది.
అప్పటికే ఆ మహిళలకు సాయం చేయటానికి ప్రయత్నిస్తూ అక్కడ మరో వ్యక్తి ఉన్నారు. తిరగబడిన కయాక్‌ను సరిచేయటానికి ప్రయత్నిస్తున్నారు. సమీపంలో ఒక జెట్ స్కీ మీద ఉన్న మరో వ్యక్తి కూడా సాయం అందించటానికి వారి దగ్గరకు చేరుకున్నారు.
జెట్ స్కీ మీద ఉన్న వ్యక్తి ఆ మహిళల కయాక్‌ను ఒడ్డుకు లాక్కొచ్చారు.
ఫొటో సోర్స్, RADIOTELEVISAO PORTUGUESA
మహిళలకు సాయం చేసిన తర్వాత అధ్యక్షుడు మళ్లీ మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరూ వేరొక బీచ్ నుంచి నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ ఇక్కడికి వచ్చారని చెప్పారు.
''పశ్చిమ ప్రవాహం చాలా భారీగా ఉండటంతో అది వారిని ఈడ్చుకొచ్చింది. వారి కయాక్‌ను తలకిందిలు చేసింది. వారిద్దరూ చాలా నీళ్లు మింగేశారు. కనీసం కయాక్‌ను మళ్లీ సరిగా తిప్పలేకపోతున్నారు. దాని మీదకు కూడా ఎక్కలేకపోతున్నారు. ఈదేంత శక్తి కూడా వారిలో లేకుండా పోయింది. ప్రవాహం అంత బలంగా ఉంది'' అని ఆయన స్థానిక మీడియాకు వివరించారు.
వారిని రక్షించటంలో జెట్ స్కీ మీద వచ్చిన మరో 'దేశభక్తుడు' తనకు సాయమందించారని అధ్యక్షుడు చెప్పారు.
ఆ మహిళలు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
టీవీ చానల్ '20 మినటోస్' ప్రకారం.. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటం కోసం దేశాధ్యక్షుడు వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ సెలవులు గడుపుతున్నారు.
బ్రిటన్ ప్రభుత్వం క్వారంటైన్ ఆంక్షల నుంచి మినహాయింపులు ఇచ్చిన దేశాల జాబితాలో పోర్చుగల్ లేదు.
బ్రిటిష్ ప్రజలు సెలవులు గడపటానికి పెద్ద సంఖ్యలో పోర్చుగల్ వెళుతుంటారు. ఏటా దాదాపు 30 లక్షల మంది బ్రిటిష్ జనం ఈ దేశాన్ని సందర్శిస్తుంటారు.
ప్రతి వేసవి కాలంలో ఆల్గ్రేవ్ సందర్శించే విదేశీయుల్లోనూ అత్యధికులు బ్రిటిష్ వారే ఉంటారు.
ఇవి కూడా చదవండి:
- సౌదీ అరేబియాను పాకిస్తాన్ నుంచి భారత్ తనవైపు లాగేసుకుందా?
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- భారత్, చైనాల సంబంధాల్లో మార్పులు రాబోతున్నాయా? మోదీ, జిన్‌పింగ్ భేటీ సాధ్యమేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్‌లు విడిపోయేవి కాదు’
- పెళ్లి వయసు 21 ఏళ్లు ఉండాలన్న ప్రతిపాదనను కొందరు అమ్మాయిలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)