ఈ చిన్నారులకు వీధులే ఆన్‌లైన్.. గోడలే కంప్యూటర్ స్క్రీన్లు

ఈ చిన్నారులకు వీధులే ఆన్‌లైన్.. గోడలే కంప్యూటర్ స్క్రీన్లు

మహారాష్ట్రలో షోలాపూర్ లోని శ్రామిక్ నగర్‌లోని ఆశా మరాఠీ విద్యాలయ్.

పుస్తకాల్లో కనిపించే పాఠాలు ఈ బడిలో గోడల మీదకు ఎక్కేశాయి.

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో స్కూళ్లు నడవడం లేదు.

కొన్ని స్కూళ్లు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నాయి.

కానీ, ఈ స్కూల్ విద్యార్థుల్లో చాలా మంది ఆన్‌లైన్‌లో పాఠాలు వినే స్థోమత లేనివారే.

దీంతో ఇక్కడి ఉపాధ్యాయులు ఈ వినూత్న ఆలోచన అమలు చేశారు.

లాక్‌డౌన్ అమల్లోకి వచ్చాక, ఈ స్కూల్లో నలుగురైదుగురే చదువు కొనసాగించగలిగారు.

కానీ, ఈ ప్రయత్నంతో ఇప్పడు దాదాపు 1,700 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)