షూటర్ నుంచి చెల్లెల్ని కాపాడిన ‘హీరో’ బ్రదర్

షూటర్ నుంచి చెల్లెల్ని కాపాడిన ‘హీరో’ బ్రదర్

ఆరేళ్ల రువైడా సెలా నీళ్ల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. హౌతీ దళాలకు చెందిన ఒక షూటర్ ఆమె తలలో బుల్లెట్ దించారు.

రువైడా రోడ్డుపై పడిపోయింది. ఆమెను అలా చూసిన సోదరుడు వెంటనే వెళ్లి రోడ్డు మీదే ఆమెను ఈడ్చుకుంటూ ఇంటివైపు లాక్కొచ్చాడు.

ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యెమెన్ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంచినీళ్ల బాలిక అంటూ రువైడాను సంబోధిస్తూ.. ఆమెను కాపాడిన సోదరుడిని ‘హీరో’ అని పొగుడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)