కమలా హారిస్: అమెరికా రాజకీయ కొలనులో భారత సంతతి కమలం

కమలా హారిస్: అమెరికా రాజకీయ కొలనులో భారత సంతతి కమలం

అమెరికాలోని నల్లజాతి రాజకీయ నేతల్లో కమలా హారిస్ ప్రముఖులు. అయితే, ఆమెకు భారత్ మూలాలు కూడా ఉన్నాయి. వాటి పట్ల కూడా ఆమె గర్వం వ్యక్తం చేస్తుంటారు.

కమల ఆత్మకథ ‘ద ట్రూత్స్ వి హోల్డ్’ పుస్తకం 2018లో విడుదలైంది.

‘నా పేరును కమలా అని పిలవాలి. పంక్చుయేషన్ కోసం ఉపయోగించే కామా ( , ) పలికినట్లు పలకాలి’’ అని అందులో కమలా రాశారు.

‘‘కమల అంటే తామర లేదా కమలం అని అర్థం. భారత సంస్కృతిలో దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పైకి ఆ పూవు కొలనులో తేలియాడుతున్నట్లే కనిపిస్తుంది. కానీ, దాని వేళ్లు కొలను అడుగున బలంగా పాతుకుపోయి ఉంటాయి’’ అంటూ అమెరికన్లకు తన పేరు గురించి ఆ పుస్తకంలో వివరించారామె.

కమలా తల్లి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి జమైకాలో పుట్టారు.

కమలాకు మాయా అనే చెల్లెలు కూడా ఉన్నారు. చిన్నప్పుడు వారి ఇంట్లో ఎప్పుడూ నల్ల జాతి అమెరికన్ గాయకుల సంగీతం వినిపిస్తూ ఉండేది.

కమలా తండ్రి డోనల్డ్ హారిస్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్. తల్లి శ్యామల గోపాలన్ క్యాన్సర్ పరిశోధకురాలు, పౌర హక్కుల కార్యకర్త.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)