అమెరికాలో ఈ ఈగ ఎందుకు ట్రెండవుతోంది?

అమెరికాలో ఈ ఈగ ఎందుకు ట్రెండవుతోంది?

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు కమలా హారిస్, మైక్ పెన్స్ మధ్య సాల్ట్ లేక్ సిటీలో డిబేట్ జరుగుతోంది.

అధ్యక్షుడు ట్రంప్‌‌ కరోనా పాజిటివ్ అయిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న ఈ అభ్యర్థుల మధ్య జరిగే ఈ చర్చ చాలా కీలకంగా నిలిచింది.

ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య ఈ చర్చను జర్నలిస్ట్ సుజాన్ పేజ్ నిర్వహిస్తున్నారు.

కరోనా దృష్ట్యా అభ్యర్థుల మధ్య ఒక గ్లాస్ షీల్డ్ ఏర్పాటుచేశారు. అభ్యర్థులకు, హోస్ట్ కు మధ్య ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ చర్చకు హాజరైన ప్రేక్షకులందరికీ కోవిడ్ టెస్ట్ చేశారు. చర్చ జరుగుతున్న సమయంలో అందరూ మాస్క్ వేసుకోవడం, ఫిజికల్ డిస్టన్స్ పాటించడం తప్పనిసరి చేశారు.

90 నిమిషాల ఈ చర్చను వివిధ భాగాలుగా విభజించారు.

అయితే ఈ చర్చలో అందరికంటే ఎక్కువగా ఆకర్షించింది మాత్రం మైక్ పెన్స్ తలపై వాలిన ఒక ఈగ.

గతంలో హిల్లరీ క్లింటన్‌పైన కూడా ఈగ వాలిందని, ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారని, ఈగ ఎవరిపై వాలితే వాళ్లు ఓడిపోతారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)