నెదర్లాండ్స్: ప్రపంచ ఫ్లవర్ మార్కెట్ రాజధాని ఇదే...

నెదర్లాండ్స్: ప్రపంచ ఫ్లవర్ మార్కెట్ రాజధాని ఇదే...

నెదర్లాండ్స్ దాదాపు 200 ఏళ్లుగా ప్రపంచ పూల వ్యాపారానికి రాజధానిగా వర్ధిల్లుతోంది. ఈ దేశంలో పూల వ్యాపారం ఒక పబ్‌లో మొదలైందని చెబుతారు. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో ఇక్కడ పూల వ్యాపారం ఎంతో వ్యవస్థీకృతంగా సాగుతుంటుంది.

ఆమ్‌స్టర్‌డామ్ సమీపంలోని ఆల్స్‌మార్‌లో ఉన్న రాయల్ ఫ్లోరా హాలండ్ ఆక్షన్ హౌజ్‌లో పూల కోసం వేలం పాటలు జరుగుతుంటాయి. ఇక్కడ ఎప్పుడూ పూలతో నిండిన ట్రాలీలు కనిపిస్తుంటాయి.

పూలను భారీగా దిగుమతి చేసుకుని, మళ్లీ ఎగుమతి చేసుకునే వ్యాపారానికి రాయల్ ఫ్లోరా హౌజ్ చాలా ఏళ్లుగా ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది. ప్రపంచ పూల మార్కెట్లో 40 శాతం విక్రయాలు ఇక్కడే జరుగుతుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)