పాకిస్తాన్‌లో సివిల్ వార్ మొదలైందా?

పాకిస్తాన్‌లో సివిల్ వార్ మొదలైందా?

పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో అంతర్యుద్ధం రాజుకుందంటూ భారతదేశానికి చెందిన వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో ఈ వారం విస్తృతంగా ఫేక్ న్యూస్ చలామణీ అవుతోంది.

ప్రముఖ ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసేలా ఒత్తిడి చేయటానికి రాష్ట్ర పోలీస్ బాస్‌ను సైనిక బలగాలు కిడ్నాప్ చేశాయంటూ పాకిస్తాన్ మీడియాలో వార్తలు రావటంతో ఈ ఫేక్ న్యూస్ వరద మొదలైంది.

కరాచీలో పోలీసులకు, సైన్యానికి మధ్య ఘర్షణలో చాలా మంది పోలీసులు చనిపోయారని, కరాచీ వీధుల్లో యుద్ధ ట్యాంకులు కనిపిస్తున్నాయని చెప్పేంత దూరం ఈ ఫేక్ న్యూస్ పోయింది.

పాక్‌లో అశాంతి అని చెప్తూ ఒక ఫేక్ వీడియో కూడా ట్విటర్‌లో సర్క్యులేట్ అయింది.

కానీ వాస్తవంలో ఇందులో ఏదీ నిజం కాదు.

రాజకీయ నేత అరెస్టు విషయంలో స్థానిక పోలీసులు, ప్రతిపక్ష నాయకులు చాలా మంది ఆగ్రహంతో ఉన్నారు కానీ.. అక్కడ ఎటువంటి హింసా చోటు చేసుకోలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)