భార‌త్, పాకిస్తాన్ దేశాల్లో రేపిస్టుల‌కు శిక్ష‌లు ఎందుకు ప‌డ‌ట్లేదు?

భార‌త్, పాకిస్తాన్ దేశాల్లో రేపిస్టుల‌కు శిక్ష‌లు ఎందుకు ప‌డ‌ట్లేదు?

ఉత్తరప్రదేశ్‌లోని హాథరస్‌లో వివాదాస్పదంగా జరిగిన అంత్యక్రియలు.. శోకంలో మునిగిపోయిన ఓ కుటుంబం... భారత్‌లో మహిళలపై దారుణ అకృత్యాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

సరిగ్గా 2012లో దిల్లీ నిర్భయ కేసులో జరిగినట్టుగానే... మరోసారి జనాగ్రహం వెల్లువెత్తింది.

2014లో ఉత్తరప్రదేశ్‌, బదాయూలోని ఓ గ్రామంలో ఇద్దరు మైనర్ బాలికలు శవాలుగా మారి ఈ చెట్టుపైనే వేలాడుతూ కనిపించారు. ఆ ఘటన తర్వాత నేను బదాయూకు వెళ్లాను.

బాలలపై హింసకు సంబంధించి ప్రభుత్వం 2012లో ఆమోదించిన పోక్సో చట్టం ప్రకారం, రేప్ కేసుల్లో సాధ్యమైనంత వరకు ఏడాది లోపుగానే విచారణను పూర్తి చేయాలనే నిబంధన ఉంది. అంతేకాదు.. కేసుల విచారణను త్వరగా పూర్తి చేయడం కోసం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రకటించారు.

అయినప్పటికీ కూడా 2013 నాటికి దేశంలోని కోర్టుల్లో 95 వేల రేప్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2019 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగిపోయి 1,45,000కు చేరుకుంది.

ఇక పాకిస్తాన్‌లో కూడా పరిస్థితులు దీనికి భిన్నంగా ఏమీ లేవు. చట్టాలైనా, సామాజిక కట్టుబాట్లయినా.. అన్నీ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.

అయితే.. రేప్స్‌కు సంబంధించి పూర్తి పూర్తి డేటా పబ్లిక్ డొమైన్‌లో లేనందువల్ల... ఈ కేసులు పెరుగుతున్నాయా, లేదా తగ్గుతున్నాయా అనేది అంచనా వేయడం కష్టం. అయితే.. ఒక్క విషయం మాత్రం స్పష్టం - రేప్ బాధితులు న్యాయం పొందటం మాత్రం చాలా కష్టం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)