20 లక్షల ఏళ్ల కిందటి మనిషి పుర్రె లభ్యం

20 లక్షల ఏళ్ల కిందటి మనిషి పుర్రె లభ్యం

దక్షిణాఫ్రికాలో 20 లక్షల ఏళ్ల నాటి మానవ కపాలం తవ్వకాల్లో బయటపడిందని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు. మానవ పరిణామక్రమం గురించి ఈ పుర్రె మరిన్ని విషయాలు తెలియజేయగలదని ఆశిస్తున్నారు.

దీన్ని 'పరాంత్రోపస్ రోబస్టస్' అనే జాతికి చెందిన మగ జీవి పుర్రెగా గుర్తించారు.

పరాంత్రోపస్ రోబస్టస్ జాతిని, ఆధునిక మానవులకు పూర్వీకులైన 'హోమో ఎరక్టస్' జాతికి 'కజిన్స్'గా చెప్పుకోవచ్చు.

ఈ రెండు జాతులూ ఒకే కాలంలో మనుగడ సాగించాయి. కానీ పరాంత్రోపస్ రోబస్టస్ జాతి ముందుగా అంతరించిపోయింది.

"సాధారణంగా తవ్వకాల్లో దొరికే అవశేషాల్లో ఒకటో, రెండో పళ్లు లేదా దంతాలు అక్కడా ఇక్కడా దొరుకుతాయి. కానీ ఇలా పుర్రె మొత్తం దొరకడం అరుదు"అని డా. ఏంజలిన్ లీస్ బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)