ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్లలో ఇంత జోష్ ఎందుకుంది

  • హోవర్డ్ ముస్తో, డానియెల్ పాలుంబో
  • బీబీసీ బిజినెస్ ప్రతినిధులు
షేర్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగాలు పోయాయి. కొన్ని దేశాల్లో పని లేక చాలా మంది ఇళ్లలోనే ఉండిపోవడంతో ప్రభుత్వాలు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వస్తోంది.

కానీ, గత ఏడాది 2020 మార్చిలో పతనం తర్వాత షేర్ మార్కెట్‌లో జోష్ వచ్చింది. నాస్డాక్ షేర్లలో గత ఏడాది చివరి వరకూ 42 శాతం వృద్ధి నమోదైంది. అమెరికాలోనే అతిపెద్ద వృద్ధి ఇదే.

ఏడాది పొడవునా ఎస్అండ్‌పి500 షేర్లు 15 శాతం పైకి వెళ్లాయి. కానీ, కరోనా మహమ్మారి ప్రభావంతో కష్టాల్లో పడిన చమురు కంపెనీలు, బ్యాంకులు, ఎయిర్ లైన్స్ వల్ల బ్రిటన్ స్టాక్ ఎక్ఛేంజ్ ఇండెక్స్ ఎఫ్‌టీఎస్ఈ100 అంత మెరుగైన స్థితిలో నిలవలేకపోయింది.

గత ఏడాది ప్రారంభంలో ఇందులో 14 శాతం పతనం వచ్చింది. కానీ గత కొన్ని నెలల్లో అందులో వేగంగా వృద్ధి వచ్చింది. యూరోపియన్ యూనియన్‌తో ట్రేడ్ డీల్, వ్యాక్సీన్‌కు అనుమతులు లభించిన తర్వాత ఇందులో చాలా జోరు కనిపించింది.

భారతదేశంలో కూడా నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది.

జపాన్‌లో వ్యాక్సీన్ తయారైన తర్వాత మరోసారి షేర్ మార్కెట్లలో జోష్ కనిపించడం మొదలైంది. ఫార్మస్యూటికల్ స్టాక్స్, గేమింగ్ కంపెనీల షేర్లు వీటిలో ముందంజలో నిలిచాయి. అయితే షేర్ మార్కెట్ పనితీరు అంచనా ఈ మొత్తం ప్రక్రియను ప్రతిబింబించదు.

ఫొటో సోర్స్, Getty Images

నగదు విలువ పతనం

"ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే.. షేర్ మార్కెట్ ధర అనేది ఇప్పుడు, ఈ సమయం కోసం కాదు. షేర్ మార్కెట్ ఒక కారు నడపడం లాంటిది. అందులో, దూరంగా ఉన్న లక్ష్యాలను చూస్తుంటాం. ముందు కనిపిస్తున్న గుంతలను కాదు" అని మనీ మేనేజర్ స్క్రాండర్స్‌లో యూకే ఈక్వెటీస్ చీఫ్ స్యూ నాఫ్కా చెప్పారు.

ఆమోదించిన లేదా అభివృద్ధి చేస్తున్న కొత్త వ్యాక్సీన్లు విజయవంతం అయితే వాటి వల్ల వృద్ధి వస్తుందని, అమ్మకాలు సాధారణంగానే ఉంటాయని పెట్టుబడిదారులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. వారు చౌక రుణాలను ఉపయోగిస్తున్నారు. వ్యాపారాలకు అది ఒక వరం లాంటిది.

కేంద్ర బ్యాంకులు కూడా ఈ చౌక రుణాల వ్యాపారంలో ఉన్నాయి. వాటి ప్రభావం కూడా కనిపిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఒక్కటే ప్రభుత్వ, కార్పొరేట్ నుంచి 895 బిలియన్ పౌండ్ల బాండ్లు కొనుగోలు చేయాలని ఒక ప్రణాళిక రూపొందించింది. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకూ అమెరికా ఫెడ్ మూడు ట్రిలియన్ డాలర్ల ఆస్తులు కొనుగోలు చేసింది.

రుణాలను మరింత చౌకగా చేయడమే ఈ కొనుగోళ్ల ఉద్దేశం. బాండ్ల కొనుగోలు రూపంలో ఈ డబ్బు ఆర్థికవ్యవస్థలోకి వచ్చినపుడు, అది ఇంకెక్కడైనా ధరలు పెరగడానికి కారణం అవుతుంది.

"దానివల్ల డబ్బు విలువలో పతనం వచ్చింది. ఈ చౌక డబ్బు ఆర్థిక ఆస్తుల విలువను పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో మనం చూస్తున్నది అదే" అంటారు నాఫ్కా.

ఐదు పెద్ద కంపెనీలు

మనం మార్కెట్ ప్రదర్శన చూసినప్పుడు, సాధారణంగా కంపెనీల గ్రూప్ ఇండెక్స్ చూస్తాం. ఇండెక్స్ వాల్యూపై చిన్న కంపెనీల ప్రదర్శనకు బదులు పెద్ద కంపెనీల వృద్ధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ముఖ్యంగా అమెరికాలో పెద్ద కంపెనీలు చాలా పెద్దవి అయిపోయాయి. ఈ ఏడాది టెక్ కంపెనీలకు చాలా బాగుంది. జనం సుదూర ప్రాంతాల నుంచి పనిచేస్తుండడం వల్ల వారి ఆదాయంలో వృద్ధి వచ్చింది.

ఉదాహరణకు నాస్డాక్ ఏడాది మొదట్లో చాలా గ్రోత్ చూసింది. కానీ, ఐదు కంపెనీలు.. అంటే గూగుల్‌కు చెందిన అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్ ధర మిగతా 95 కంపెనీలన్నిటినీ కలిపితే దాదాపు దానితో సమానంగా ఉంది.

"అలాంటప్పుడు షేర్ మార్కెట్ ఇండెక్స్ చూస్తే కరోనా మహమ్మారి వల్ల అమెరికా ఆర్థికవ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడలేదనే అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. అందుకే, ఇండెక్స్ చూసి మనం అన్ని కంపెనీల పరిస్థితి సరిగానే ఉందని అంచనా వేయాల్సిన అవసరం లేదు" అని స్యూ నాఫ్కా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

పదేళ్లుగా ట్రెండ్ ఉంది

ఒక ఇండెక్స్‌లో కొన్ని పెద్ద కంపెనీల ఆధిపత్యం, నిష్క్రియాత్మక పెట్టుబడి అనే దాని వృద్ధితో ముడిపడి ఉంటుంది. ఇందులో పెన్షనర్స్, మనీ మేనేజర్స్, స్పెక్యులేటర్లు, ఇండెక్స్‌ను ప్రభావితం చేసే చౌక పెట్టుబడులను కొనుగోలు చేయవచ్చు.

అందుకే పెట్టుబడిదారుడు ఈ ఫండ్స్‌ను కొనుగోలు చేసినప్పుడు, అతడు ప్రాథమిక వాటాలు కొంటాడు. ధరలు పెరుగుదలకు సాయం చేస్తాడు.

"గత 10 ఏళ్ల నుంచి మీరు ఒక ట్రెండ్ చూస్తున్నారు. డబ్బు ప్రవాహం క్రియాశీల నిధుల నుంచి నిష్క్రియాత్మక నిధులవైపు వెళ్తోంది" అని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌ ఆర్థిక మార్కెట్ పరిశోధకులు యోహానస్ పెట్రో అన్నారు.

చాలా కంపెనీలు తమ పరిమాణం వల్ల ఇండెక్స్‌తో అనుసంధానం అవడం, విడిపోవడం జరుగుతుంది. కానీ, ఎప్పుడూ అలానే జరగదు. పెద్ద కంపెనీలు షేర్ మార్కెట్ ఇండెక్స్‌లో భాగం కాకుండా కూడా ఉండచ్చు.

ఉదాహరణకు ఈ నెల ఎస్అండ్‌పీ500 ఇండెక్స్‌లో ప్రవేశించబోయే ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా ఫండ్ నుంచి షేర్లు కొనుగోలులో సమస్యలు తలెత్తడంతో షేర్ల కోసం అదనంగా వంద బిలియన్ డాలర్లు డిమాండ్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images

భయపడడం లేదు

పతనం కోసం పరిస్థితులు సిద్ధంగా ఉంటాయని చెబుతారని బ్రోకరేజ్ సంస్థ థీమిస్ ట్రేడింగ్‌లో భాగస్వామి జో సాలోజీ చెప్పారు.

"చాలా మంది పెట్టుబడిదారులు మార్కెట్ ఎప్పుడూ పైకే వెళ్లలేదని ఆలోచిస్తారు. కానీ, అందులో పతనం ఎప్పుడు వస్తుందనేది చెప్పడం కష్టం" అన్నారు.

"వాళ్లు సీఎన్ఎన్‌లో ఇచ్చిన ఒక ఇండికేటర్ చూస్తారు. దాని పేరు ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్. ఒకప్పుడు అది చాలా ఎత్తున ఉండేది. కానీ అది ఇప్పుడు పడిపోయింది. నాకది చూసినప్పుడు జనాల్లో భయం లేదనే అనిపిస్తుంది" అంటారు సాలోజీ.

ఆయన, మార్కెట్ వృద్ధితో పోలిస్తే పతనం అయ్యేటపుడు ఏర్పడే పరిస్థితుల నిష్పత్తి అనే మరో పాయింట్ మీద కూడా దృష్టి పెట్టారు. 2012 తర్వాత నుంచి ఇటీవలి వరకూ మార్కెట్‌ వృద్ధిపై విధించే షరతులు అది పతనమైనప్పుడు ఉండే షరతుల కంటే ఎక్కువగా ఉన్నాయి.

వీడియో క్యాప్షన్,

బామ్మగారి షేర్ మార్కెట్‌ ట్రేడింగ్ పాఠాలు

"జనాలు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ఇప్పుడు మనం దాన్నే విశ్లేషించాం. ఇప్పుడు ధర ఎక్కువ ఉందంటే... ఇదే మంచి సమయం అనుకుంటాం. మన షేర్లు తీసేయాలని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. అలా మనల్ని మనమే మార్కెట్లో చాలా తెలివైనవాళ్లం అనుకుంటాం. కానీ అది నిజం కాదు. మనమెవరం తెలివైన వాళ్లం కాదు" అని జో సాలోజీ చెప్పారు.

"కొన్ని కారణాల వల్ల మార్కెట్ స్వయంగా తనకు తానుగా నడుస్తుంటుంది. ఉద్యోగాలు పోయిన చాలా మంది ఇప్పుడు తక్కువగా ఖర్చు చేస్తున్నారు. కానీ తర్వాత వాళ్లు కొనుగోళ్లు చేయాలని అనుకుంటారు. గత సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వం బహుశా కఠినమైన మార్గం అవలంబించాల్సి ఉంటుంది" అంటారు నాఫ్కా

"మార్కెట్ దిగువకు వెళ్లినపుడు పెట్టుబడిదారులు ఎలాంటి వైఖరి ఎంచుకుంటారు అనేది చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్లు కొత్త పెట్టుబడిదారులు అయితే, మార్కెట్లో కొత్తగా ఒడిదొడుకులు అనుభవం పొందుతున్నప్పుడు, వీలైనంత త్వరగా లాభంతో తన డబ్బును వెనక్కు తీసేసుకోవాలని అనుకుంటాడు. అలాంటి వారి సంఖ్య తక్కువే ఉండచ్చు. కానీ, వాళ్లు ఈ మార్కెట్లో క్రియాశీలకంగా ఉన్నారు" అంటారు జో సాలోజీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)