జో బైడెన్: ‘అమెరికన్లు అందరికీ అధ్యక్షుడిగా ఉంటాను.. ఐకమత్యంతో ముందుకువెళ్దాం’.. ప్రమాణ స్వీకార ప్రసంగంలో స్పష్టం చేసిన కొత్త అధ్యక్షుడు

ఫొటో సోర్స్, Ani
ప్రమాణం చేస్తున్న బైడెన్
జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
యూఎస్ కేపిటల్ భవనంలో ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు.
ప్రమాణం చేసిన అనంతరం బైడెన్ తన భార్య జిల్‌ను ముద్దాడారు.
అనంతరం ప్రసంగించిన ఆయన అమెరికా ఎన్నో సవాళ్లను తట్టుకుని నిలిచిందని.. ఇకపైనా సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పారు.
ఫొటో సోర్స్, Ani
ఇది ప్రజాస్వామ్యం విజయం సాధించిన రోజు
''ఇది అమెరికా రోజు, ఇది ప్రజాస్వామ్యం విజయం సాధించిన రోజు, చరిత్ర.. ఆశల రోజు’’ అని అభివర్ణించారు.
యుగాల నుంచీ అమెరికా ఎన్నో పరీక్షలను ఎదుర్కొని నిలిచింది. అది సవాళ్ల నుంచి ఆవిర్భవించింది.
ఈ రోజు మనం ఒక అభ్యర్థి విజయం సాధించినందుకు మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యం గెలిచినందుకు సంబరం చేసుకుంటున్నాం'' అన్నారు.
''ప్రజాస్వామ్యం విలువైనది, ప్రజాస్వామ్యం సున్నితమైనదని మనం మళ్లీ తెలుసుకున్నాం. మిత్రులారా! ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచింది'' అన్నారు బైడెన్.
ఈ పవిత్రమైన నేలపై కొన్ని రోజుల కిందట చెలరేగిన హింస కేపిటల్ పునాదిని కదిలించాలని ప్రయత్నించింది. రెండు దశాబ్దాలకు పైగా మనకు ఉన్న శాంతియుత అధికార మార్పిడి కోసం ఒక దేశంగా కలిసివద్దాం'' అని బైడెన్ పిలుపునిచ్చారు.
''నా కంటే ముందు అధ్యక్షులుగా పనిచేసిన నేతలు ఈరోజు ఇక్కడకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను'' అన్నారు బైడెన్.
ఈ వేడుకకు మాజీ అధ్యక్షులు క్లింటన్, బుష్, ఒబామా హాజరయ్యారు.
96 ఏళ్ల వయసున్న మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌తో కూడా ఫోన్లో మాట్లాడానని, ఆయన సేవలకు నమస్కరించానని ఆయన చెప్పారు.
అమెరికా ఘనత నిలిపేందుకు ఐక్యత అవసరమని అన్నారు.
"ఉద్రిక్తతలు తగ్గించండి.. ఐక్యత లేకుండా శాంతి నెలకొనదు, ఐక్యత అనేది ప్రగతి మార్గం" అన్నారు.
మనం ఈ క్షణం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఒక్కటవ్వాలన్న బైడెన్ ఆ సందర్భంగా యునైటెడ్ అనే పదాన్ని నొక్కిపలికారు.
108 ఏళ్ల కిందట ఇక్కడే.. ఇప్పుడూ ఇక్కడే
కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయడం గురించి కొత్త అధ్యక్షుడు మాట్లాడారు.
''108 సంవత్సరాల క్రితం ఓటు హక్కు కోసం ధైర్యంగా ఉద్యమం చేసిన మహిళలను కొన్ని వేల మంది ఆందోళనకారులు అడ్డుకున్న చోట మనం నిలబడి ఉన్నాం.
ఈరోజు అమెరికా చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారానికి మనమే సాక్ష్యంగా నిలిచాం.
పరిస్థితులు మారవని నాకు చెప్పకండి'' అని బైడెన్ అన్నారు.
జో బైడెన్ తన ప్రసంగం తర్వాత కోవిడ్ మృతులకు సంతాపంగా కొన్ని క్షణాలు మౌనం పాటించారు.
మనల్ని వదిలి వెళ్లినవారి కోసం, మన దేశం కోసం కొన్ని క్షణాలు మౌనం వహించాలని ఆయన ప్రజలను కోరారు.
కోవిడ్ మహమ్మారి వల్ల ఈ కార్యక్రమానికి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు.
ఫొటో సోర్స్, Ani
జో బైడెన్ ప్రమాణం చేయడానికి ముందు అమెరికా మెరైన్ బ్యాండ్ దేశ జాతీయగీతం వినిపించింది.
అమెరికా జాతీయగీతాన్ని ప్రముఖ గాయని లేడీ గాగా ఆలపించారు.
వేడుకలో మొట్టమొదట అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణం చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ కమలా హ్యారిస్‌తో ప్రమాణం చేయించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అభినందనలు తెలిపారు.
అమెరికాతో భారత సంబంధాల బలోపేతానికి బైడెన్‌తో కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు.
ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు.
ఫొటో సోర్స్, Reuters
కాపిటల్ భవనం దగ్గర సతీసమేతంగా జో బైడెన్
అంతకు ముందు..
జో బైడెన్ ప్రమాణ స్వీకారం కోసం కేపిటల్ భవనం చేరుకున్నారు. ఆయన భార్య జిల్ చేతిలో చేయి వేసి మెట్లు ఎక్కారు.
కొన్ని వారాల క్రితం అల్లర్లు జరిగిన కాపిటన్ భవనం ప్రమాణ స్వీకార వేడుకతో సందడిగా మారింది.
యూఎస్ కాపిటల్‌లో ప్రారంభ వేడుకకు అతిథుల రాక ప్రారంభమైంది.
ఫొటో సోర్స్, Reuters
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా
ప్రమాణ స్వీకార వేడుకకు హాజరైన వారిలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒమాబా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా, జార్జియా సెనేటర్ జాన్ ఒసాఫ్ ఉన్నారు. ఆయన కూడా తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు.
ఫొటో సోర్స్, Reuters
వాషింగ్టన్ కాథలిక్ చర్చిలో జో బైడెన్ దంపతులు
నూతన అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసే ముందు జో బైడెన్ తన భార్య జిల్‌తో కలిసి వాషింగ్టన్‌లోని కాథలిక్ చర్చిలో ప్రార్థనలు చేశారు.
ఫొటో సోర్స్, Reuters
చర్చిలో రిపబ్లికన్ నేతలు
ఈ ప్రార్థనలకు కమలా హ్యారిస్, ఆమె భర్త డగ్ ఎంహాఫ్, సెనేట్ రిపబ్లికన్ నేత మిచ్ మెక్ కొనెల్, ప్రతినిధుల సభ రిపబ్లికన్ నేత కెవిన్ మెక్ కార్తీ, సభ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా హాజరైనట్లు ఫొటోల్లో కనిపిస్తోంది.
జో బైడెన్ ప్రసంగానికి సిద్ధమైన వేదిక
బైడెన్ ప్రసంగం కోసం సిద్ధమైన వేదిక
కొన్ని గంటల్లో బైడెన్ తన ప్రారంభోపన్యాసం ఇవ్వనున్నారు. దీనికోసం అమెరికా కాపిటల్‌లో ఆటో క్యూ(టెలీప్రాంప్టర్) ఏర్పాటు చేయడంలో సిబ్బంది బిజీగా ఉన్నారు.
ఇక్కడ బైడన్ ప్రసంగం 20 నిమిషాలపాటు ఉంటుందని భావిస్తున్నారు.
ఫొటో సోర్స్, Reuters
ఫ్లోరిడాకు బయల్దేరిన ట్రంప్
వైట్ హౌస్ విడిచి, ఫ్లోరిడాకు బయల్దేరిన ట్రంప్
కొన్ని గంటలే అమరికా అధ్యక్షుడుగా ఉండనున్న డోనల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వీడారు. ఫ్లోరిడాకు బయల్దేరారు.
ట్రంప్తోపాటూ ఆయన కుటుంబం కూడా ఉంది.
ట్రంప్ ప్లోరిడా పామ్ బీచ్‌లో ఉన్న తన మార్-ఆ-లాగో రిసార్టులో ఉంటారు.
ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఫ్లోరిడాకు వెళ్లారు. కానీ ఈ విమానంలో ఆయన బహుశా ఆఖరిసారి వెళ్లనున్నారు.
ఫ్లోరిడాలో ట్రంప్ దిగిన తర్వాత ఎయిర్ పోర్స్ వన్ విమానం మేరీలాండ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత దానిని కొత్త అధ్యక్షుడు జో బైడెన్ వినియోగం కోసం ఉపయోగిస్తారు.
జో బైడెన్ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరు కావడం లేదని ట్రంప్ ముందే చెప్పారు.
ట్రంప్ నూతన అధ్యక్షుడు బైడెన్ కోసం ఒక సందేశం ఇచ్చారని వైట్ హౌస్ ఒక ప్రతినిధి ధ్రువీకరించారు.
వైట్ హౌస్ నుంచి ఇచ్చిన తన ఫేరవెల్ స్పీచ్‌లో కూడా ట్రంప్ కొత్త అధ్యక్షుడి పేరు ప్రస్తావించలేదు.
ఇవి కూడా చదవండి:
- సింగర్ సునీత వివాహం: మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం తప్పా
- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: భారత క్రికెట్‌ను మార్చిన ఒక మ్యాచ్ కథ
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- చైనాలో వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన బీబీసీ బృందాన్ని ఎలా వెంటాడారంటే..
- కరోనా వ్యాక్సీన్ కోసం చైనాను నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)