ఆహారం వృథా కాకుండా అన్నార్థుల ఆకలి తీరుస్తున్న దక్షిణాఫ్రికా చెఫ్‌లు

ఆహారం వృథా కాకుండా అన్నార్థుల ఆకలి తీరుస్తున్న దక్షిణాఫ్రికా చెఫ్‌లు

దక్షిణాఫ్రికా జనాభాలో 25 శాతం మంది రోజూ ఆకలి కడుపులతోనే నిద్రపోతారని ఒక అంచనా. కోవిడ్-19 సంక్షోభం తర్వాత ఆ సంఖ్య పెరగడంతో దేశంలో అలాంటి వారి సంఖ్య మరింతపెరిగింది.

అలాంటి వారి కడుపు నింపేందుకు దక్షిణాఫ్రికాలోని చెఫ్‌లు ఒక కార్యక్రమం ప్రారంభించారు.

మార్కెట్లలో రోజూ వృథాగా పారేస్తున్న కూరగాయలను, వివిధ హోటళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించి, వాటితో వంటలు చేసి అన్నార్థుల కడుపు నింపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)