నైజీరియాలో తల్లులు, శిశువుల ప్రాణాలు కాపాడుతున్న కారు

నైజీరియాలో తల్లులు, శిశువుల ప్రాణాలు కాపాడుతున్న కారు

నైజీరియా మారుమూల ఉండే బార్డో గ్రామం నుంచి ఆస్పత్రి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఒకప్పుడు గర్భిణులు ఆస్పత్రికి వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు ఉండేవి కావు. అక్కడికి వెళ్లేలోపే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

గత రెండేళ్లలోనే 18 మంది గర్భిణులు చనిపోయారు. దీంతో, గ్రామంలోని మహిళలందరూ కలిసి ఈ కారు కొనుగోలు చేశారు.

ఇప్పుడు గర్భంతో ఉన్న ఎవరిని ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నా ఈ కారు అందుబాటులో ఉంటుంది. రూ.200 చెల్లించి దాన్లో ఆస్పత్రికి వెళ్లవచ్చు.

అలా వసూలు చేసిన మొత్తాన్ని కారు డీజిల్, రిపేర్ల కోసం, డ్రైవర్‌కు వేతనంగా ఉపయోగిస్తున్నారు.

ఈ కారు సమస్యను పరిష్కరించడమే కాదు, తమకు ఏ సమస్య వచ్చినా గ్రామంలోని మహిళలందరూ కలిసి దానిని పరిష్కరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)