వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్

ఫొటో సోర్స్, NurPhoto/gettyimages
ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్ వరుసగా నాలుగో ఏడాది కూడా నిలిచింది.
ఐక్యరాజ్య సమితి స్పాన్సర్‌షిప్‌తో గాలప్ సంస్థ రూపొందించిన 'వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్'లో ఆ దేశం మొదటి స్థానంలో ఉంది.
రెండో స్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో స్విట్జర్లాండ్ ఉన్నాయి.
ఐస్లాండ్, నెదర్లాండ్స్ నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచాయి.
కాగా తొలి 10 స్థానాల్లో ఒక్క న్యూజిలాండ్ తప్ప మిగతావన్నీ ఐరోపా దేశాలే ఉన్నాయి.
అయితే గత ఏడాదితో పోల్చితే బ్రిటన్ నాలుగు స్థానాలు పడిపోయింది. గత ఏడాది 13వ స్థానంలో ఉన్న ఆ దేశం ఈ ఏడాది 17వ స్థానంలో ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఈ సూచీలో 139వ స్థానంలో ఉంది. భారత్ పొరుగుదేశాల్లో శ్రీలంక 87వ స్థానంలో, బంగ్లాదేశ్ 101, పాకిస్తాన్ 105, మియన్మార్ 126, శ్రీలంక 129వ స్థానాల్లో ఉన్నాయి.
149 దేశాలలోని ప్రజలను వివిధ ప్రశ్నలు అడిగి వారు ఎంత సంతోషంగా ఉన్నారనేది లెక్కించింది గాలప్ సంస్థ.
వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక అండ, జీడీపీ, అవినీతి వంటి అనేక అంశాల ప్రాతిపదికన ఈ నివేదిక, సూచీ రూపొందించారు.
ఈ సూచీలో అఫ్గానిస్థాన్ చిట్టచివర ర్యాంకులో ఉండి దుఃఖభరిత దేశంగా నిలిచింది. జింబాబ్వే, రువాండా, బోట్స్వానా, లెసోథోలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ కారణంగా..
కోవిడ్ కారణంగా చాలాదేశాల్లో ప్రజలు సంతోషంగా లేరని నివేదిక భావించింది.
అయితే, 22 దేశాలు గత ఏడాది కంటే ఈసారి తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయి.
చైనా గత ఏడాది 94వ ర్యాంకులో ఉండగా ఈసారి 84వ స్థానంలో ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
ఫిన్లాండ్
మొదటి పది స్థానాలలో..
1) ఫిన్లాండ్
2) డెన్మార్క్
3) స్విట్జర్లాండ్
4) ఐస్లాండ్
5) నెదర్లాండ్స్
6) నార్వే
7) స్వీడన్
8) లగ్జెంబర్గ్
9) న్యూజీలాండ్
10) ఆస్ట్రియా
ఫొటో సోర్స్, EPA
సంతోష సూచీలో అట్టడుగున ఉన్న 10 దేశాలు
1) అఫ్గానిస్థాన్ (149వ స్థానం)
2) జింబాబ్వే (148)
3) రువాండా (147)
4) బోట్స్వానా (146)
5) లెసోథో (145)
6) మలావీ (144)
7) హైతీ (143)
8) టాంజేనియా (142)
9) యెమెన్ (141)
10) బురుండి (140)
ఫొటో సోర్స్, Getty Images
అసలేంటీ హ్యాపీనెస్ ఇండెక్స్?
2012 నుంచి ఐక్యరాజ్య సమితి ఈ ఆనందం సూచీలను విడుదల చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా వలసదారుల పరిస్థితి ఎలా ఉంది? ఏ దేశంలో ప్రవాసులు సంతోషంగా గడుపుతున్నారు? అనే అంశాల ఆధారంగా ఈ ఏడాది ర్యాంకులు ఇచ్చారు.
దేశ స్థూల తలసరి ఆదాయం, సామాజిక మద్దతు, ఆరోగ్యం, సామాజిక స్వేచ్ఛ, ఉదారత, అవినీతి అనే ఆరు ప్రధాన అంశాలను ఆధారంగా ఈ నివేదిక రూపొందిస్తారు.
ఆయా దేశాల్లో పుట్టిపెరిగిన వారితో పాటు, ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంది? ఎంత సంతోషంగా ఉన్నారు? వసతులు కల్పన, సామాజిక బాంధవ్యాలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలపై అధ్యయనం చేస్తారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు... అమరావతి భూముల సేకరణపై విచారణకు రావాలని ఆదేశం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)