దక్షిణ చైనా సముద్రం: ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద ప్రాంతంగా ఎందుకు మారింది

దక్షిణ చైనా సముద్రం: ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద ప్రాంతంగా ఎందుకు మారింది

ప్రపంచంలో అత్యంత వివాదాస్పద ప్రాంతాల్లో దక్షిణ చైనా సముద్రం ఒకటి.

ఇందులో చాలాభాగం తమదేనని చైనా వాదిస్తోంది. కానీ దాని చుట్టుపక్కలున్న దేశాలు, అమెరికా దీన్ని అంగీకరించడం లేదు.

దీంతో ఈ విషయంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగల ప్రాంతీయ సమస్యగా మారుతోంది. అసలు దక్షిణ చైనా సముద్రం ఎందుకు వివాదాస్పదం అవుతోంది. ఇప్పుడు చూద్దాం.

దక్షిణ చైనా సముద్రంలోని ద్వీపాలు తమవేనని వేర్వేరు దేశాలు వాదిస్తున్నాయి.

పసిఫిక్- హిందూ మహా సముద్రాలను ఇది కలుపుతోంది. ఏడాదికి 3ట్రిలియన్ డాలర్ల వ్యాపారం జరిగే వాణిజ్య జలమార్గాలు కూడా ఉన్నాయి.

ప్రపంచంలో మూడోవంతు షిప్పింగ్ ఇక్కడే జరుగుతుంది. చమురు, గ్యాస్ నిల్వలతో పాటు మత్య్ససంపద పుష్కలంగా ఉంది.

సరిహద్దు దేశాలకు దీనిలో కొంత భాగముంది. ఇక మిగిలింది అంతర్జాతీయ జలాలే.

ఇందులో 90శాతం తమదేనంటోంది చైనా. 1947లో చైనా ఒక మ్యాప్ విడుదల చేసింది. అందులో ఈ సముద్రం తమదేనని మొదటిసారిగా చెప్పింది. 'నైన్-డాష్ లైన్' పేరుతో గుర్తించిన ప్రాంతం తమదేనని అది వాదిస్తోంది.

కానీ 2016లో చైనా వాదనను కోర్టులు తిరస్కరించాయి. చాలా ద్వీపాల్లో రాళ్లే ఉన్నాయని చెప్పాయి.

కానీ చైనా దీన్ని పట్టించుకోలేదు.

ఈ ద్వీపాలపై ఆధిపత్యం ఎవరదన్న విషయంలో ఇతర దేశాలు కూడా తమ తమ వాదినలు వినిపిస్తున్నాయి. ఇవి తమకే చెందుతాయని తైవాన్, మలేషియా, బ్రూనై వంటి దేశాలు అంటున్నాయి.

అలాగే, వివాదాస్పద ద్వీపాల్లో నిర్మాణాలు చేపడుతున్న ఫిలిప్పీన్స్, వియత్నాం కూడా వీటిపై తమకు హక్కులున్నాయని చెబుతున్నాయి.

అయితే, ఈ దేశాలన్నింటి కంటే ఎక్కువగా కృత్రిమ ద్వీపాలను నిర్మిస్తోంది చైనా. ఇది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం. ఇవి ఒకప్పుడు పగడపు దిబ్బలుగా ఉండేవి. కానీ ఇప్పుడివి సైనిక స్థావరాలుగా మారాయి. అనుమతి లేకుండా ఎవరినీ అక్కడికి రానివ్వరు.

 అమెరికా ఈ వివాదంలో నేరుగా జోక్యం చేసుకోలేదు. కానీ నావిగేషన్ స్వేచ్ఛను కాపాడటానికి దక్షిణ చైనా సముద్రానికి ఈమధ్య యుద్ధ నౌకలను ఎక్కువగా పంపిస్తోంది.

దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా తన నౌకలు, విమానాలను తరచుగా పంపిస్తోంది. అవి బల ప్రదర్శన చేస్తున్నాయి. ఈ ప్రాంత శాంతికి, స్థిరత్వానికి అది మంచిది కాదు.

చైనా ఆధిపత్యం పెరగకుండా చూసేందుకు బైడెన్ అధికార యంత్రాంగం జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాలతో కలిసి పనిచేస్తోంది.

అమెరికాకు వ్యతిరేకంగా, ఆధిపత్యం కోసం చైనా ఆశయాలు పెరుగుతున్నాయి. అమెరికా నాయకత్వం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

దక్షిణ చైనా సముద్రంపై తమకు హక్కుందని చెబుతున్న దేశాలు. తమ జాతీయ ప్రయోజనాల కోసం పోరాడుతున్నాయి. అదే సమయంలో రెండు సూపర్ పవర్స్ మధ్య వివాదం మరింత పెరుగుతోంది.

ఈ ద్వీపాలు పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ సైనిక ఘర్షణ ముప్పు మాత్రం పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)