పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కోవిడ్-19 - Newsreel

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Reuters

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు కోవిడ్-19 సోకిందని ఆ దేశ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. '68 ఏళ్ల ప్రధాని ఇమ్రాన్ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు' అని పాకిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఫైజల్ ఖాన్ ట్వీట్ చేశారు.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన ఇమ్రాన్ ఖాన్ 2018 ఆగస్టులో ఆ దేశ ప్రధాని అయ్యారు. ఆయన రెండు రోజుల కిందటే వ్యాక్సీన్ కూడా తీసుకున్నారు. కోవిడ్-19కు కారణమయ్యే వైరస్‌ను ఎదుర్కోగల రోగనిరోధక శక్తిని వ్యాక్సీన్ పెంచుతుంది. అయితే, అది మనిషి శరీరం లోపల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. వ్యాక్సీన్ తీసుకున్న వెంటనే కొన్ని వారాల వరకు వైరస్ సోకే అవకాశం ఉంటుంది.

ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కీలకమైన సమావేశాలలో పాల్గొంటూనే ఉన్నారు. ఇటీవల రాజధాని ఇస్లామాబాద్‌లో సెక్యూరిటీ సదస్సుకు కూడా హాజరయ్యారు. ఆ సదస్సులో చాలా మంది పాల్గొన్నారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

ఆ సదస్సులో ఇమ్రాన్ మాస్క్ లేకుండానే ప్రసంగించారని, ఆ తరువాత శుక్రవారం నాడు పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టు ప్రారంబోత్సవంలో పాల్గొన్నారని రాయిటర్స్ నివేదించింది.

జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 6,23,135 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ మూలంగా 13,799 మంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)