నేచరిజం: ‘మేం నగ్నంగా బయట తిరుగుతాం. మీరూ ప్రయత్నించండి’

ఫొటో సోర్స్, J&DPrice
బ్రిటిష్ నేచరిస్ట్ డోనా ప్రైస్
కోవిడ్ లాక్డౌన్లు ముగిసిన తర్వాత చాలా మంది బయటతిరగడంలో ఉండే స్వేచ్ఛను, ఆనందాన్ని మళ్లీ కొత్తగా అనుభూతి పొందుతున్నారు.
బయట తిరగడంలో ఆనందం ఉంటుంది సరే... బట్టలు లేకుండా బయట తిరగడంలో ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుందా?
ఈ ప్రశ్నకు కొందరు అవునని సమాధానం ఇస్తున్నారు. నగ్నంగా బతకడం వారికి ఇష్టం. ఇలా బతకడాన్ని నేచరిజం అంటారు.
బ్రిటన్‌లో ఉంటున్న డోనా ప్రైస్, ఆమె భర్త నేచరిస్టులు. కరోనావైరస్ సంక్షోభ సమయంలో సమయం అనుకూలించినప్పుడల్లా వీళ్లిద్దరూ అలా నగ్నంగా వాకింగ్‌కు వెళ్లి వస్తున్నారు.
నేచరిజం అంటే ఆసక్తి ఉన్నవారు తమలా ఓసారి ప్రయత్నించి చూడాలని డోనా సలహా కూడా ఇస్తున్నారు.
‘‘నేచరిజంను ప్రయత్నించిన తర్వాత మీలో బంధనాలను తెంచుకున్నట్లుగా, స్వేచ్ఛ పొందినట్లుగా భావనలు కలుగుతాయి. ఒకేసారి బయటకు వెళ్లి నగ్నంగా తిరగమని నేను ఎవరికీ సలహా ఇవ్వమను. మొదటగా మీకు మీరు సౌకర్యవంతంగా మారండి. నగ్నంగా మీ ఇంట్లో తిరగండి. మీ పెరట్లో తిరగండి. నగ్నంగా ఉండటం సహజమన్న భావన పెంపొందించుకోండి. ఇలా ఉండటంలో నాకు ఎంతో ఆనందం కలుగుతుంది’’ అని ఆమె అన్నారు.
ఫొటో సోర్స్, J&DPrice
భర్తతో డోనా ప్రైస్
‘సెక్స్‌తో సంబంధం లేదు’
బయటి ప్రదేశాల్లో వస్త్రధారణ ఎలా ఉండాలన్నదానిపై ఒక్కో దేశంలో ఒక్కో రకమైన చట్టాలు, అభిప్రాయాలు ఉన్నాయి.
కొన్ని దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా తిరగడం చట్ట విరుద్ధం. ఇంకొన్ని దేశాల్లో కొన్ని పరిమితులు, నిబంధనల మధ్య నగ్నత్వానికి అనుమతి ఉంది.
బ్రిటన్‌లో బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా ఉండటం నేరం కాదు. ఒకవేళ ఇతరులను ఇబ్బందిపెట్టడానికే ఆ వ్యక్తి దుస్తులు విప్పినట్లు రుజువైతే మాత్రం నేరంగా పరిగణిస్తారు.
తాను, తన భర్త నగ్నంగా రోజూవారీ పనులు చేసుకుంటున్నప్పుడు తీసిన ఫొటోలను డోనా సోషల్ మీడియాలో పెడుతుంటారు.
స్నేహితులను కలవడం, ఇంట్లో వంట చేసుకోవడం, సముద్రంలో ఈతకు వెళ్లడం, కొండల్లో హైకింగ్... ఇలా నగ్నంగా ఉంటూనే డోనా, ఆమె భర్త చేస్తున్న పనుల ఫొటోలు ఆమె ఖాతాలో కనిపిస్తుంటాయి.
నేచరిజానికి, సెక్స్‌కు సంబంధం లేదంటున్నారు డోనా.
‘‘ప్రయాణాలు, ఫుడ్, స్విమ్మింగ్, సోషలైజింగ్, నేచరిజం... మధ్య వయసు మహిళ చేసే అన్ని సహజమైన విషయాలూ నాకు ఇష్టమే. ఇది పార్న్ కాదు’’ అని తన ట్విటర్ ఖాతా బయోలో ఆమె రాసుకున్నారు.
ఫొటో సోర్స్, J&DPrice
‘ప్రోత్సహిస్తూనే మాట్లాడతారు’
బ్రిటీష్ నేచరిజం సంస్థలో డోనా కార్యకర్తగా పనిచేస్తున్నారు. వుమెన్ ఇన్ నేచరిజం ప్రచార కార్యక్రమానికి ఆమె నేతృత్వం కూడా వహిస్తున్నారు.
నగ్నత్వం అంటే సమాజంలో కొందరికి ఏహ్యపు భావనలు ఉంటాయని, అందుకే అందరూ నేచరిజాన్ని ఆహ్వానించలేకపోవచ్చని డోనా అంగీకరిస్తున్నారు.
‘‘నగ్నంగా నడిస్తే, ఈత కోడితే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాకు చాలా మంది నుంచి సానుకూలంగానే స్పందనలు వస్తున్నాయి. చాలా మంది ప్రోత్సహిస్తూనే మాట్లాడతారు’’ అని ఆమె అన్నారు.
ఫొటో సోర్స్, J&DPrice
బీబీసీతో మాట్లాడుతున్న డోనా రైస్
‘‘మరీ షాక్‌కు గురయ్యేవారైతే చాలా తక్కువ. చాలా మంది ‘గుడ్ మార్నింగ్’ అని చెప్పి తమ పని తాము చేసుకుంటారు. ‘నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నేను కూడా నీలా చేయగలిగితే బాగుండు’ అని కొందరు అంటారు. వాళ్లకు మీరు కూడా ప్రయత్నించవచ్చని చెబుతుంటా’’ అని డోనా అన్నారు.
నగ్నంగా తిరిగినప్పుడు ప్రకృతితో కలిసిపోయిన భావన కలుగుతుందని, దాన్ని తాము ఎంతగానో ఆస్వాదిస్తామని ఆమె చెప్పారు.
‘‘బయట నగ్నంగా ఉండటం అదే మొదటిసారైతే... ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మన శరీరం మొత్తాన్నీ వెచ్చటి గాలి తాకుతుంటే కలిగే ఫీలింగే వేరు’’ అని ముగించారు డోనా.
ఇవి కూడా చదవండి:
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)