సూయెజ్ కెనాల్‌లో ఇరుక్కున్న భారీ నౌక ముక్కలయ్యే ప్రమాదం ఉందా?

సూయెజ్ కెనాల్‌లో ఇరుక్కున్న భారీ నౌక ముక్కలయ్యే ప్రమాదం ఉందా?

ప్రపంచ వాణిజ్యానికి సూయజ్ కాలువను వెన్నెముకగా చెబుతుంటారు. ప్రధాన జల మార్గాల్లో ఇది ఒకటి.

ప్రపంచ వాణిజ్యంలో 12శాతం సరుకు రవాణా దీని ద్వారానే జరుగుతోంది.

చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్తున్న ఒక కార్గో నౌక మంగళవారం ఉదయం కాలువలో చిక్కుకుపోయింది.

ఇసుకలో చిక్కుకున్న దాన్ని తిరిగి సరైన మార్గంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

కానీ ఇంతవరకు ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు.

మరికొన్ని రోజులు ఆ నౌక అక్కడే అలాగే ఉంటే అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

కాలువలో ఈ కార్గో నౌక ఇరుక్కుపోవడంతో ఆ దారిలో చాలా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నౌకను మళ్లీ జలమార్గంలోకి మళ్లించాలంటే మూడు విధానాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏమిటవి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)