ఆస్ట్రేలియా: ఆక్టోపస్‌కు కోపం వస్తే మనిషిని ఎలా కొడుతుందో చూడండి

ఫొటో సోర్స్, Instagram/Lance Karlson
ఆక్టోపస్‌కు కోపం వచ్చింది... సరదాగా సముద్ర స్నానానికి వెళితే ఒంటి మీద ఓ చరుపు చరిచిందని ఓ వ్యక్తి వాపోయాడు.
ఈ ఘటన పశ్చిమ ఆస్ట్రేలియా బీచ్‌లో జరిగింది. ఈత కొట్టడానికి వెళ్లిన ఒక వ్యక్తిపై ఆక్టోపస్ దాడి చేసింది.
ఆ ఆక్టోపస్ "చాలా కోపంగా ఉంది" అని ఆయన వివరించారు.
భూవిజ్ఞాన శాస్త్రవేత్త అయిన లాన్స్ కార్ల్సన్ సెలవులు గడపడానికి బీచ్ ఒడ్డుకు వెళ్లారు.
ఆయన సముద్రంలో ఈత కొడుతుండగా ఆక్టోపస్ దాడి చేసిన వీడియో వైరల్ అయ్యింది.
అది కార్ల్‌సన్‌ను వెంబడిస్తూ తన టెంటకిల్స్ (చేతులు)తో ముందు భుజం మీద చరిచింది. తరువాత మెడ మీద, వీపు మీద కొరడా దెబ్బలు కొట్టినట్టు కొట్టింది.
ఆక్టోపస్ కొట్టిన దెబ్బలకు కార్ల్సన్ శరీరంపై ఎర్రగా తట్లు తేరాయి. దెబ్బలపై కూల్‌డ్రింక్ పోస్తే గానీ తగ్గలేదని ఆయన వివరించారు.
ఆక్టోపస్‌కు కోపం వచ్చింది... కొరడా ఝళిపించింది
ఆస్ట్రేలియాలోని 7న్యూస్ వార్తా సంస్థతో కార్ల్సన్ మాట్లాడుతూ.. "సముద్ర జీవుల వలన కలిగే గాయాలకు వెనిగర్ వాడాలి. కానీ ఆ సమయంలో నా దగ్గర వెనిగర్ లేదు. ఆమ్లం ఉన్న పదార్థాలు దెబ్బలను తగ్గిస్తాయని తెలుసు. అందుకే తట్లు తేరిన చోట కోలా పోశాను" అని చెప్పారు.
"నేను నా కుటుంబం బీచ్‌కు దగ్గరగా ఉన్న రిసార్ట్‌లో దిగాం. సరదాగా సముద్రంలో ఈత కొడదామని నీళ్లల్లోకి దిగాం. అది ఆక్టోపస్ అనుకోలేదు. సీగల్‌ను వేటాడుతున్న స్టింగ్రే అనుకున్నాను" అని కార్ల్సన్ వివరించారు.
తన రెండేళ్ల కూతురిని తీసుకుని దానికి దగ్గరగా వెళ్లినప్పుడే అది ఆక్టోపస్ అని తెలిసింది. దానికి వీడియో తీస్తుండగా, అకస్మాత్తుగా అది వీళ్లవైపు తిరిగింది.
"ఆక్టోపస్ మాపై దాడి ప్రారంభించింది. మేము షాక్ అయిపోయాం" అని కార్ల్సన్ రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.
తరువాత, ఆయనొక్కరే నీళ్లల్లోకి వెళ్లారు. అప్పుడు మళ్లీ ఆ ఆక్టోపస్ ఆయన్ను వెంబడించింది.
"నా కళ్లద్దాలు మసకబారాయి. నీళ్లన్నీ మురికిగా అయిపోయాయి. నాకు దిమ్మ తిరిగిపోయింది" అని కార్ల్సన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: మామిడి కాయలు కోశారన్న అనుమానంతో ముఖానికి పేడ పూసి తినిపించారు...పోలీసుల అదుపులో నిందితులు
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు
- విశాఖ: 20వేల తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు ఇలా..\
- మాస్క్ చరిత్ర: 17వ శతాబ్దం నాటి కాకి ముక్కు మాస్క్ నుంచి నేటి కోవిడ్-19 మాస్క్ వరకు...
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- బిహార్‌లో ఆంధ్రా చేపల కలకలం : రసాయనాలు పూసిన చేపలు తినొచ్చా.. తినకూడదా?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- ‘పొట్టి పిచ్చుక పొట్ట నిండా ప్లాస్టిక్ ముక్కలే’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)