కరోనావైరస్: బ్రెజిల్‌లో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 4,000 మరణాలు - News Reel

కోవిడ్‌తో తల్లి మరణించడంతో దుఃఖిస్తున్న కూతురు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

కోవిడ్‌తో తల్లి మరణించడంతో దుఃఖిస్తున్న కూతురు

బ్రెజిల్‌లో కరోనావైరస్ వ్యాప్తి వేగం బాగా పెరుగుతోంది. గత 24 గంటల్లోనే కోవిడ్‌తో ఆ దేశంలో 4,000 మందికి పైగా మరణించారు.

ఆసుపత్రుల్లో సామర్థ్యానికి మించి రోగులు ఉంటున్నారు. చికిత్స కోసం ఎదురుచూస్తూనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా ప్రాంతాల్లో వైద్య వ్యవస్థలు కుప్పకూలే దశకు చేరుకున్నాయి.

బ్రెజిల్‌లో ఇప్పటివరకూ కోవిడ్‌తో 3.37 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాలు అత్యధికంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్‌ది ప్రపంచంలోనే రెండో స్థానం. మొదటి స్థానంలో అమెరికా ఉంది.

అయితే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో లాక్‌డౌన్ విధించాలన్న ప్రతిపాదనను బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వ్యతిరేకిస్తున్నారు.

వైరస్ వల్ల జరిగే నష్టం కన్నా, లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థపై పడే దుష్ప్రభావం తీవ్రతే ఎక్కువగా ఉంటుందని ఆయన వాదిస్తున్నారు.

బ్రెజిల్‌లో 92 రకాల కరోనావైరస్‌లు వ్యాప్తిలో ఉన్నట్లు ఫియోక్రజ్ అనే ఆరోగ్య సంస్థ చెబుతోంది. వీటిలో పీ.1 అనే రకం వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రస్తుతం కేసులు ఈ స్థాయిలో పెరగడానికి ఈ రకమే కారణమని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)