టోక్యో ఒలింపిక్స్ విజేతలకు ఇచ్చిన బొకేల కథేంటో తెలుసా

flores olímpicas

ఫొటో సోర్స్, Getty Images

ఒలింపిక్స్‌లాంటి విశ్వ క్రీడల్లో గెలుపొందడం ఏ ఆటగాడికైనా ఓ మరుపురాని అనుభూతి.

అలాంటి మధురమైన క్షణాల్లో విజేతలకు పతకాలతో పాటు బొకేలు అందిస్తుంటారు.

టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలకు అందించిన బొకేలకు ఒక ప్రాముఖ్యత ఉంది.

భారీ విపత్తు సంభవించిన ప్రాంతాల్లో వికసించిన పూలతో ఈ బొకేలను తయారు చేశారు.

ఒలింపిక్, పారాలింపిక్ క్రీడల్లో 5,000 కంటే ఎక్కువ బొకేలు అథ్లెట్లకు అందజేశారు.

2011లో భూకంపం, సునామీ ఆ తర్వాత ఫుకుషిమా అణు కేంద్రంలోని మూడు రియాక్టర్లు కరిగిపోవడంతో జపాన్‌ తీవ్రంగా నష్టపోయింది.

ఇవాటే, ఫుకుషిమా, మియాగి ప్రాంతాలలో సంభవించిన విపత్తులో దాదాపు 20వేల మంది మరణించారు.

బొకేల్లో ఉపయోగించిన పూలను ప్రధానంగా ఈ మూడు ప్రాంతాల్లోనే సాగు చేశారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్ రెండింటిలోనూ పతక విజేతలకు ఇచ్చిన బొకేల్లో వాడిన పసుపు, ఆకుపచ్చ, నీలం రంగు పూలను ఈ మూడు ప్రాంతాల్లోనే సాగు చేశారు.

ఫొటో సోర్స్, AFP

బొకేల్లో వాడిన ప్రకాశవంతమైన పసుపురంగులోని పొద్దుతిరుగుడు మొక్కలను మియాగిలో పెంచారు.

విపత్తులో మరణించిన వారి తల్లిదండ్రులతో ఈ మొక్కలను నాటించారు.

సునామీ బారి నుంచి పిల్లలను కాపాడిన కొండను ఈ మొక్కలు నాటడానికి ఎంచుకున్నారు.తెలుపు, ఊదా రంగులోని పుష్పాలనిచ్చే యూస్టోమాలు, సోలమన్ సీల్స్‌లు ఫుకుషిమాలో పెరిగాయి.

నాటి విపత్తు వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపించింది.

జెంటియన్స్ ఒక చిన్న ప్రకాశవంతమైన నీలం పువ్వు. 2011 విపత్తులో ధ్వంసమైన తీర ప్రాంతం ఇవాటేలో ఈ పూలను సాగు చేశారు. ఇక పూల బొకేకు తొడుగుగా వాడే ఆకుపచ్చ ఆస్పిడిస్ట్రాలను మాత్రం ఒలింపిక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన టోక్యో నగరానికి సూచికగా ఇక్కడ పెంచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)