నైజీరియా: కిడ్నాపైన ఏడేళ్ల తర్వాత ఇంటికి చేరిన యువతి

చిబోక్ విద్యార్థినులు

ఫొటో సోర్స్, EPA

నైజీరియాలోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బొకో హరాం చెర నుంచి ఒక యువతికి విముక్తి లభించింది.

ఆమె పేరు రూత్ గ్లాడర్ పోగు. ఏడేళ్ల తర్వాత ఆమె తిరిగి తన కుటుంబం చెంతకు చేరారు.

2014లో బొకో హరం తీవ్రవాదులు బోర్నో రాష్ట్రంలోని చిబోక్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలపై దాడి చేశారు.

270 మందికిపైగా విద్యార్థినులను కిడ్నాప్‌ చేశారు. వారిలో రూత్ గ్లాడర్ కూడా ఉన్నారు.

కిడ్నాపైన 100 మందికిపైగా అమ్మాయిలను వివిధ సందర్భాల్లో విడుదల చేశారు. వారిలో కొందరు ఎలాగోలా తప్పించుకోగలిగారు. కానీ మిగిలిన వారు మాత్రం బందీలుగానే ఉండిపోయారు.

అలా మిలిటెంట్ల వద్ద బంధీగా ఉండిపోయిన రూత్ గ్లాడర్‌ కిడ్నాప్‌నకు గురైన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తిరిగి ఇంటికి చేరారు.

వీడియో క్యాప్షన్,

బీబీసీ కామెరూన్ పరిశోధన

అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. కిడ్నాప్ తర్వాత మిలిటెంట్లలోని ఒక వ్యక్తి రూత్ గ్లాడర్ పోగును పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ వ్యక్తి ఇటీవల నైజీరియా సైన్యానికి లొంగిపోయాడు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం, మానసిక పరిస్థితిపై దృష్టిపెట్టామని అధికారులు తెలిపారు.

ఉత్తర నైజీరియాలో సామూహిక కిడ్నాప్‌లు ఒక సమస్యగా మారిపోయాయి.

ఈ ఏడాది ఇప్పటికే వంద మందికిపైగా చిన్నారులను కిడ్నాప్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)