టీ20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ 73 ఆలౌట్, ఏడు ఓవర్లకే ఆస్ట్రేలియా విజయం

ఫొటో సోర్స్, Michael Steele-ICC/getty images
ఆరాన్ ఫించ్
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ 1 సూపర్ 12 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇంకా 82 బంతులు మిగిలుండగానే విజయ లక్ష్యం అందుకున్న ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది.
మొదటి వికెట్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్(18), ఆరాన్ ఫించ్(40) 58 పరుగులు జోడించారు.
2 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగిన ఓపెనర్, కెప్టెన్ ఆరాన్ ఫించ్ 20 బంతుల్లో 62 పరుగులు చేసి 58 పరుగుల దగ్గర అవుటవగా, మొదటి నుంచీ ఆచితూచి ఆడిన మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 67 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు.
ఏడో ఓవర్లో మొదటి రెండు బంతులకు 1 ఫోర్, 1 సిక్స్ కొట్టి జట్టుకు విజయం అందించిన మిచెల్ మార్ష్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, షరీఫుల్ ఇస్లామ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ విజయంతో గ్రూప్ 1 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకున్న ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలు మెరుగు పరుచుకుంది.
మొత్తం 6 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా 1.031 రన్ రేటుతో దక్షిణాఫ్రికాను మూడో స్థానానికి నెట్టింది.
బంగ్లా 73 ఆలౌట్
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 15 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
5 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్ ఆడం జంపా బంగ్లాదేశ్‌ను 73 పరుగులకే కట్టడి చేశాడు.
వరసగా వికెట్లు కోల్పోతూ వచ్చిన బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.
వీరిలో షమీమ్ హుస్సేన్ చేసిన 19 పరుగులే అత్యధిక స్కోరు.
ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ 17, కెప్టెన్ మహ్మదుల్లా 16 పరుగులు చేశారు.
మరో ఓపెనర్ లిటన్ దాస్, అఫీఫ్ హుస్సేన్ సహా మొత్తం నలుగురు డకౌట్ అయ్యారు.
వరసగా తొలి మూడు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ తర్వాత ఏ దశలోనూ పెద్ద భాగస్వామ్యం నమోదు చేయలేకపోయింది.
32 పరుగులకు మొహమ్మద్ నయీమ్, 33 దగ్గర అఫీఫ్ హుస్సేన్ వికెట్లను వెంటవెంటనే కోల్పోయిన బంగ్లాదేశ్ 62 పరుగుల దగ్గర ఆడం జంపా వేసిన 11వ ఓవర్ చివరి రెండు బంతులకు షమీమ్ హుస్సేన్, మెహెదీ హసన్ వికెట్లను కోల్పోయింది.
తర్వాత మూడు పరుగులకే మిచెల్ స్టార్క్ కెప్టెన్ మహ్మదుల్లాను పెవిలియన్ పంపాడు. 15వ ఓవర్లో మరోసారి విజృంభించిన ఆడం జంపా 73 పరుగుల దగ్గర చివరి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఆసీస్ బౌలర్లలో ఆడం జంపా మొత్తం 5 వికెట్లు పడగొట్టగా, మిచెల్ స్టార్క్, జాష్ హేజల్‌వుడ్ చెరి 2 వికెట్లు, గ్లెన్ మాక్స్‌వెల్ 2 వికెట్ తీశారు.
ఇవి కూడా చదవండి:
- డెల్టా ప్లస్ కరోనా వేరియంట్: ఇట్టే వ్యాపిస్తుంది... ఇప్పుడున్న వ్యాక్సీన్లకు లొంగుతుందా?
- Ivermectin: కోవిడ్-19పై ఈ ఔషధం అద్భుతంగా పోరాడుతోందా? ఈ వార్తల్లో నిజమెంత
- బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల విషయంలో భారత్ ఎందుకు ఆచితూచి వ్యహరిస్తోంది
- కరోనా సైడ్ ఎఫెక్ట్స్: కాలి వేళ్ల మీద పుండ్లు ఎందుకు ఏర్పడుతున్నాయి?
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను 'దక్షిణ టిబెట్' అని ఎందుకు అంటోంది
- కరోనావైరస్: వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత ఆల్కహాల్ తాగొచ్చా?
- మనిషికి పంది కిడ్నీపెట్టిన వైద్యులు
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- భారత్- పాకిస్తాన్ క్రికెటర్లు ఆవేశంతో రెచ్చిపోయిన అయిదు సందర్భాలివే...
- కోవిడ్ వ్యాక్సినేషన్: వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా కరోనావైరస్ సోకుతుందా?
- సిరియా: ఇస్లామిక్ స్టేట్ శిబిరాలలో చిన్నారుల జీవితాలు మగ్గిపోవాల్సిందేనా, అక్కడ కూడా మతాన్ని నూరిపోస్తున్నారా
- కరోనావైరస్: వ్యాక్సీన్లు తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు వస్తే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)