మనుషులు నడవడం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎందుకు నడిచారు?
- జాన్ సిమెక్
- కన్వర్జేషన్

ఫొటో సోర్స్, WIKIMEDIA COMMONS
మానవజాతిలో నిటారుగా నడిచిన ఆదిమ జాతికి చెందిన ముగ్గురు.. మధ్యలో ఉన్నది లూసీ. దక్షిణాఫ్రికాలో 20 లక్షల సంవత్సరాలకు పూర్వం మనుషులు నడక మొదలు పెట్టి ఉండొచ్చని అంచనా
ఇదో ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే నిల్చోవడం లేదా బైపెడలిజం లేదా రెండు కాళ్లపై నడవడం అనేది హోమినిన్స్ లేక ఆధునిక మానవులు, వారి పూర్వీకుల లక్షణంగా చాలా మంది ఆంత్రోపాలజిస్టులు భావిస్తారు.
దీన్ని సులువైన మార్గంలో వివరించడం కష్టం. బైపెడలిజం అనేది రాత్రికి రాత్రే పుట్టుకు రాలేదు. ఇది లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైన పరిణామ ప్రక్రియ.
వాస్తవానికి, నిటారుగా నడవడం ప్రారంభించిన మొదటి వ్యక్తికి సంబంధించిన సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి, పురాతన కాలంలో మానవులు ఎలా కదిలేవారు అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఎలా సమాధానం ఇవ్వగలిగారు?
అదృష్టవశాత్తూ, ఎముకల ఆకారానికి సంబంధించిన ఆధారాలు శాస్త్రవేత్తలకు దొరికాయి. వీటి అమరిక ఒక జీవిలో ఎలా ఉండేది, జీవించి ఉన్నప్పుడు అవి ఎలా కదిలేవి అనే సమాచారాన్ని వారికి ఇచ్చింది.
1994లో, హోమినిన్స్ జాతికి చెందిన మొదటి శిలాజాలను ఇథియోపియాలో కనుగొన్నారు. వీటిని నిటారుగా ఉండే రెండు కాళ్లతో నడిచే హోమినీడ్కు చెందిన ఉప జాతిగా వర్గీకరించారు. ఆ తర్వాత దీని గురించిన వివరాలు ఏవీ బయటకు రాలేదు.
మనుషులు బతకలేనంతగా వేడెక్కిపోతున్న దేశం ఇది
కొత్త ఆవిష్కరణకు బాధ్యత వహించిన ఆంత్రోపాలజిస్టులు వాటిని ఆర్డిపిథెకస్ రామిడస్ జాతికి చెందిన వయోజన స్త్రీ అవశేషాలని వెల్లడించారు. ఆ తర్వాత దాన్ని "ఆర్డి" అని పిలిచారు.
తర్వాతి 10 సంవత్సరాలలో, దాదాపు 100 ఆర్డి జాతి శిలాజాలను కనుగొన్నారు. వాటి వయసు 42 నుంచి 44 లక్షల సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు.
బైపెడ్ లక్షణాలు
సేకరించిన ఎముకలను పరిశీలించినప్పుడు, బైపెడలిజంను సూచించే కొన్ని లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఉదాహరణకు, పాదాల నిర్మాణం వేళ్లను ఆసరాగా చేసుకుని ముందుకు సాగడానికి ఉపయోగపడేలా ఉంది. నేటి మానవుడు వేళ్లను ఆసరాగా చేసుకుని నడక సాగిస్తున్నాడు. నాలుగు కాళ్లపై నడిచే కోతులు అలా చేయలేవు.
కటి ఆకారం, దానికి కాళ్లు అమరిఉన్న విధానం కూడా ఈ జీవులు రెండు కాళ్లపై నడిచాయనడాన్ని సూచిస్తున్నాయి.
ఆర్డి నడక సరిగ్గా మనది పోలినది కాకపోవచ్చు. కానీ 44 లక్షల సంవత్సరాల పురాతనమైన ఈ జాతి మానవుడికి, బైపెడలిజం అనేది అతని సహజ లక్షణాల్లో ఒకటి అని సూచిస్తుంది.
ఫొటో సోర్స్, Getty Images
లూసీ (ఊహాచిత్రం)
ఇథియోపియాలో ఆర్డీ తర్వాత లక్షల సంవత్సరాల కిందట జీవించిన హోమినిన్స్ జాతికి చెందిన అస్థి పంజరానికి చెందిన 40 శాతం భాగాన్ని కూడా ఆంత్రోపాలజిస్టులు కనుగొన్నారు.
దక్షిణ, తూర్పు ఆఫ్రికాలో లభించిన ఇతర శిలాజాలతో దాని సారూప్యత కారణంగా, వారు దానికి ఆస్ట్రాలోపిథెకస్ అఫారెన్సిస్ అని పేరు పెట్టారు.
ఆర్డీ లాగే, కొత్త శిలాజం కూడా ఒక స్త్రీ నుండి వచ్చింది. ఆంత్రోపాలజిస్టులు ఆమెను "లూసీ" అని పిలిచారు. ఈ పేరును బ్రిటీష్ బ్యాండ్ ది బీటిల్స్‌కు చెందిన లూసీ ఇన్ ది స్కై విత్ డైమండ్స్ పాట నుంచి ప్రేరణ పొంది పెట్టారు. అప్పట్లో ఆ పాట బాగా ప్రాచుర్యం పొందింది.
ఈ జాతికి చెందిన దాదాపు 300 శిలాజాలను కూడా కనుగొన్నారు. కాబట్టి, నేటి పరిశోధకులకు లూసీ, ఆమె బంధువుల గురించి కొంత తెలుసు.
లూసీ కటి వలయ భాగాన్ని కనుగొనడం వల్ల ఆమె ఒక స్త్రీ అని తెలుసుకోగలిగారు. కాళ్లు అమరిక తీరును బట్టి ఆమె రెండు కాళ్లతో నడవగలదని శాస్త్రవేత్తలకు స్పష్టంగా అర్థమైంది.
భవిష్యత్ రిమోల్ కంట్రోల్ ఆయుధాలదేనా?
ప్రాచీన శిలాయుగపు పాదముద్రలు
లూసీ జాతికి చెందిన వ్యక్తులు టాంజానియాలోని లోయర్ పాలియోలిథిక్ సైట్ అయిన లేటోలి వద్ద ఎలా తిరిగారు అనే దానికి సంబంధించి ఇతర ముఖ్యమైన ఆధారాలను కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
36 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన అగ్నిపర్వత బూడిద పొర కింద శిలాజ రూపంలోని పాదముద్రలను ఆంత్రోపాలజిస్టులు కనుగొన్నారు.
30 మీటర్ల వరకు విస్తరించి ఉన్న దాదాపు 70 జాడలు అక్కడ ఉన్నాయి. ఇవి రెండు కాళ్లపై నడిచే ముగ్గురు వ్యక్తులవి అయి ఉండవచ్చని, అచ్చుల వయసు కారణంగా వారు ఆస్ట్రాలోపిథెకస్ అఫారెన్సిస్ జాతికి చెందిన వారని తెలుస్తోంది.
మన శరీర నిర్మాణాన్ని పోలి ఉండే ఓ హోమినిడ్, మనలానే నడిచిందని చెప్పవచ్చు. ఇది 18 లక్షల సంవత్సరాల క్రితం వరకు ఆఫ్రికాలో కనిపించలేదు.
ఫొటో సోర్స్, Getty Images
పొడవాటి కాళ్లు, పొట్టి చేతులను కలిగివున్న మొదటిది హోమో ఎరెక్టస్. ఈ రోజు మనం చేస్తున్నట్లే భూమ్మీద నడవడానికి, పరిగెత్తడానికి, కదలడానికి వీలు కల్పించి ఉండొచ్చు.
మునుపటి బైపెడల్ హోమినిన్‌ల కంటే దీనికి చాలా పెద్ద మెదడు ఉంది. అచెలెన్స్ అని పిలిచే రాతి పనిముట్లను తయారు చేసి ఉపయోగించింది.
ఆంత్రోపాలజిస్టులు హోమో ఎరెక్టస్‌ను మన దగ్గరి బంధువుగా భావిస్తారు.
సరిగ్గా గమనిస్తే, మానవ నడక అభివృద్ధి చెందడానికి చాలా సమయం పట్టింది. తొలుత 44 లక్షల సంవత్సరాల క్రితం, అంటే పనిముట్ల తయారీకి చాలా కాలం ముందు ఆఫ్రికాలో కనిపించింది.
'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
కానీ వారు ఎందుకు నిటారుగా నడవడం ప్రారంభించారు?
ఇది వారు వేటాడే జంతువులను చూడటాన్ని సులభతరం చేసి ఉండవచ్చు లేదా వారిని వేగంగా పరిగెత్తేలా చేసి ఉండవచ్చు. లేదా పర్యావరణం మారి, ఎక్కడానికి తక్కువ చెట్లు ఉండి ఉండొచ్చు.
ఏదేమైనప్పటికీ, మానవులు, వారి పూర్వీకులు, వారి పరిణామ చరిత్రలో చాలా ముందుగానే నడవడం ప్రారంభించారు.
బైపెడలిజం పనిముట్ల తయారీకి ముందు ప్రారంభమైనప్పటికీ, నిటారుగా ఉండే భంగిమ, చేతితో టూల్స్‌ను తయారు చేసుకోవడానికి ఉపయోగపడింది. చివరికి మానవుల లక్షణాలలో ఒకటిగా మారింది.
ఇవి కూడా చదవండి:
- బైజూస్: మెరుపు వేగంతో వృద్ధి వెనుక ‘చీకటి నిజం’.. ఆందోళనలో కస్టమర్లు, ఉద్యోగులు
- బిపిన్ రావత్: హెలికాప్టర్ ప్రమాదంపై చైనా అధికార మీడియాలో వెటకారం
- చైనా కోసం పాకిస్తాన్ అమెరికానే వదులుకుంటోందా.. ఇమ్రాన్ ఖాన్ తాజా నిర్ణయ ఫలితం ఎలా ఉండనుంది
- అమృత్‌సర్‌లో మొదలైన మా స్నేహం చివరి వరకు కొనసాగింది - కల్నల్ దుర్గాప్రసాద్
- 29 ఏళ్ల కిందటి నకిలీ మార్క్షీట్ల కేసులో దోషిగా తేలడంతో ఎమ్మెల్యే శాసనసభ్యత్వం రద్దు
- ‘నీ సెక్స్ జీవితం ఎలా ఉంది అని అడిగారు, రేప్ చేసి చంపేస్తామనీ బెదిరించారు’
- బిపిన్ రావత్ మరణం: చైనా విషయంలో భారత విధానంపై ప్రభావం పడుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)