గ్రామాలపైకి దూసుకొస్తున్న బూడిద మేఘం చూశారా..
ఇండోనేసియాలోని జావా ద్వీపంలో అగ్నిపర్వతం బద్దలవడంతో 13 మంది మృతిచెందగా 41 మందికి కాలిన గాయాలయ్యాయి.
సెమేరు అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద భారీ మేఘంలా కమ్ముకొస్తుండగా ప్రజలు పరుగులు తీయడం ఆన్‌లైన్‌లో షేర్ అయిన వీడియోలలో కనిపించింది.
అగ్నిపర్వత ధూళి చుట్టుపక్కల గ్రామాలను కమ్మేసిందని.. దట్టమైన పొగ కారణంగా సూర్యరశ్మి కూడా లేక అంధకారం అలముకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సుమారు 50 వేల అడుగులు(15 వేల మీటర్ల) ఎత్తు వరకు బూడిద మేఘం ఆవరిస్తుందని విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట) అగ్నిపర్వతం బద్దలైందని అధికారులు వెల్లడించారు.
సెమేరు చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు.
ఇవి కూడా చదవండి:
- ఈ దేశం ఎప్పుడు మునిగిపోతుందో చెప్పలేం...
- ఒమిక్రాన్: కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరగడంతో ప్రయాణ ఆంక్షలు కఠినతరం చేసిన బైడెన్
- యూపీఏ లాంటిదేమీ లేదని మమతా బెనర్జీ ఎందుకు అన్నారు? ఆమె ఉద్దేశ్యం ఏంటి?
- జవాద్ తుపాను హెచ్చరిక: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)