‘మహిళలైతే న్యాయం అందించడంలో ముందుంటారు’ - బీబీసీ 100 మంది మహిళలు

‘మహిళలైతే న్యాయం అందించడంలో ముందుంటారు’ - బీబీసీ 100 మంది మహిళలు

నైజీరియాలో మహిళా న్యాయవాదుల బృందం పేదలు, అట్టడుగు వర్గాల వారికి ఉచితంగా న్యాయ సేవలు అందిస్తోంది.

తొలుత ఒక కోర్టు నుంచి ప్రారంభమై.. ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సేవలు అందించే దిశగా ప్రయాణిస్తోంది.

ఇందుకోసం ఒక మొబైల్ యాప్‌ను కూడా తీసుకొచ్చారు. న్యాయ సహాయం కోరేవారు ఆ యాప్ ద్వారా ఈ మహిళా న్యాయవాదులను సంప్రదించవచ్చు.

దేశంలోని వందలాది జైళ్లలో విచారణ పూర్తి కాకుండానే, అన్యాయంగా మగ్గిపోతున్న ఖైదీలను బయటకు తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని ఈ బృందం చెబుతోంది.

బీబీసీ 100 మంది మహిళలు

బీబీసీ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతంగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన 100 మంది మహిళలను గుర్తించి జాబితా రూపొందిస్తుంది. వారి సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితంలోని వైవిధ్యాల గురించి ప్రత్యేక కథనాలు, డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు అందిస్తుంది. ఈ విజేతల కథనాలను ప్రముఖంగా ప్రచురిస్తుంది.

( #BBC100Women హ్యాష్‌ట్యాగ్ వాడి మీరూ ఈ చర్చలో భాగం కావొచ్చు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)