వీళ్లు ప్రాణం ఉన్న పిల్లలు కాదు.. తల్లులను బతికిస్తున్న ఫేక్ బేబీలు - బీబీసీ 100 మంది మహిళలు
పోలాండ్‌లో ఫెర్టిలిటీ రేటు ప్రపంచంలోనే అత్యంత తక్కువ. ఈ దేశంలో కొందరు మహిళలు ఫేక్ బేబీలకు తల్లులు అవుతున్నారు.
అచ్చం అప్పుడే పుట్టిన పిల్లలను పోలి ఉండే ఈ హైపర్ రియలిస్టిక్ డమ్మీలను ఆ తల్లులు నిజంగా పుట్టిన పిల్లలకు చేసినట్టే అన్ని పనులూ చేస్తారు.
ఇదంతా ఏదో పిల్లల ఆటలా ఉన్నా.. ఈ బొమ్మల తయారీ వెనుక మాత్రం ఇంకా లోతైన ఆలోచన ఉందని వీటి రూపకర్త పోలిష్ ఆర్టిస్ట్ బార్బరా స్మొలిన్‌స్కా చెబుతున్నారు.
గర్భస్రావం వల్ల, పుట్టిన పిల్లలు చనిపోవడం వల్ల ఆందోళనకు, కుంగుబాటుకు గురయ్యే తల్లులకు థెరపీగా ఈ బొమ్మలు ఉపయోగపడుతున్నాయని కొందరు చెబుతున్నారు.
ఈ బొమ్మల డిజైనర్ బార్బరా ఈ ఏడాది బీబీసీ 100 మంది మహిళల్లో ఒకరు.
బార్బరా స్మోలిన్‌స్కా
అచ్చం ప్రాణమున్న చిన్నారుల్లాగే కనిపించే బొమ్మలు (రీబోర్న్ డాల్స్) పిల్లలను పోగొట్టుకున్న మహిళలకు ఊరట కలిగిస్తాయి. ఆందోళన, డిప్రెషన్, సంతానోత్పత్తి సమస్యలను అధిగమించడానికి సహాయపడతాయి. పోలండ్ కళాకారిణి బార్బరా స్మోలిన్‌స్కా ఈ బొమ్మలకు రూపకర్త.
సంగీత విద్వాంసురాలైన ఈమె కాస్మటాలజీలో కూడా శిక్షణ తీసుకున్నారు. రీబోర్న్ షుగర్ బేబీస్ సంస్థను స్థాపించారు. ఈమె చేతితో తయారుచేసిన బొమ్మలను సినిమాల్లో, డాక్టర్లు, నర్సులకు శిక్షణ ఇవ్వడంలో ఉపయోగిస్తుంటారు.
స్మోలిన్‌స్కా తన వృత్తిని ఎంతో ప్రేమిస్తారు. ఆమె తయారుచేసిన బొమ్మలు బాధలో ఉన్న మహిళల మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు దోహదపడతాయని ఆశిస్తున్నారు.
‘‘భిన్నమైన వాటి పట్ల మనుషులు మరింత సహానుభూతి, సహనంతో వ్యవహరించారని కోరుకుంటున్నాను. రీబోర్న్ డాల్స్ థెరపీ విషయంలో కూడా ఇలాగే ఉంటారని ఆశిస్తున్నాను. ఈ బొమ్మలు ఎంతోమంది మహిళలకు ఉపశమనం కలిగిస్తాయి’’ అని బార్బరా స్మోలిన్‌స్కా చెప్పారు.
బీబీసీ 100 మంది మహిళలు
బీబీసీ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతంగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన 100 మంది మహిళలను గుర్తించి జాబితా రూపొందిస్తుంది. వారి సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితంలోని వైవిధ్యాల గురించి ప్రత్యేక కథనాలు, డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు అందిస్తుంది. ఈ విజేతల కథనాలను ప్రముఖంగా ప్రచురిస్తుంది.
( #BBC100Women హ్యాష్‌ట్యాగ్ వాడి మీరూ ఈ చర్చలో భాగం కావొచ్చు.)
ఇవి కూడా చదవండి:
- లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ అక్కడికి ఎందుకెళ్లారు
- మనుషులు నడవడం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎందుకు నడిచారు?
- బైజూస్: మెరుపు వేగంతో వృద్ధి వెనుక ‘చీకటి నిజం’.. ఆందోళనలో కస్టమర్లు, ఉద్యోగులు
- బిపిన్ రావత్: హెలికాప్టర్ ప్రమాదంపై చైనా అధికార మీడియాలో వెటకారం
- చైనా కోసం పాకిస్తాన్ అమెరికానే వదులుకుంటోందా.. ఇమ్రాన్ ఖాన్ తాజా నిర్ణయ ఫలితం ఎలా ఉండనుంది
- అమృత్‌సర్‌లో మొదలైన మా స్నేహం చివరి వరకు కొనసాగింది - కల్నల్ దుర్గాప్రసాద్
- 29 ఏళ్ల కిందటి నకిలీ మార్క్షీట్ల కేసులో దోషిగా తేలడంతో ఎమ్మెల్యే శాసనసభ్యత్వం రద్దు
- ‘నీ సెక్స్ జీవితం ఎలా ఉంది అని అడిగారు, రేప్ చేసి చంపేస్తామనీ బెదిరించారు’
- బిపిన్ రావత్ మరణం: చైనా విషయంలో భారత విధానంపై ప్రభావం పడుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)