Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

లైవ్ రిపోర్టింగ్

అన్ని సమయాలు యుకె ఆధారంగా పేర్కొనబడ్డాయి

  1. 5 గంటలకు 58.22% పోలింగ్

    లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 58.22% పోలింగ్ నమోదైంది.

    బిహార్‌లో 53.67%, జమ్మూకశ్మీర్‌లో 9.98%, మధ్యప్రదేశ్‌లో 64.53%, మహారాష్ట్రలో 49.64%, ఒడిశాలో 63.57%, రాజస్థాన్‌లో 62.27%, ఉత్తర్‌ప్రదేశ్‌లో 52.05%, పశ్చిమ బెంగాల్‌లో 76.14%, ఝార్ఖండ్‌లో 60.55% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల కమిషన్ ట్విటర్‌లో వెల్లడించింది.

    View more on twitter
  2. ఎన్నికల్లో సినీ స్టార్లు

    లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌లో భాగంగా పెద్దసంఖ్యలో బాలీవుడ్ నటులు మహారాష్ట్రలోని ముంబయిలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో జయప్రద, సన్నీ దేవల్, ఊర్మిళ మటోండ్కర్ వంటి పలువురు నటులు పోటీలో ఉన్నారు.

    cartoon
  3. ముంబయిలో ఓటు వేసిన షారుక్ దంపతులు

    బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, ఆయన భార్య గౌరిలు ముంబయిలోని బాంద్రాలో ఓటు వేశారు.

    View more on twitter
  4. 3 గంటలకు ఎక్కడెంత పోలింగ్ నమోదైంది

    లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సరికి బిహార్‌లో 44.23 శాతం, మధ్యప్రదేశ్‌లో 55.22 శాతం, ఒడిశాలో 51.54 శాతం, మహారాష్ట్రలో 41.15 శాతం, రాజస్థాన్‌లో 54.16 శాతం, ఉత్తర ప్రదేశ్‌లో 44.16 శాతం, ఝార్ఖండ్‌లో 56.37 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 66.01 శాతం.. అత్యల్పంగా జమ్ముకశ్మీర్‌లో 8.42 శాతం నమోదైంది.

    రాజస్థాన్ ఓటర్
  5. ఓటు వేసిన బచ్చన్ కుటుంబం

    ముంబయిలో బచ్చన్ కుటుంబం ఓటు హక్కును వినియోగించుకుంది.

    అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కలిసి వచ్చి ఓట్లు వేశారు.

    View more on twitter
  6. టీఎంసీ గూండాలు ఓటింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు - ప్రధాని మోదీ

    తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గూండాలు ప్రజలను ఓట్లు వేయకుండా అడ్డకునేందుకు ప్రయత్నిస్తున్నారని, భాజాపా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. భాజపా నేతల ప్రచారానికీ వారు అడ్డుతగులుతున్నారని మోదీ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.

    పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరాంపూర్‌లో జరిగిన ఓ సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది.

    మోదీ
  7. మధ్యాహ్నానికి ఎక్కడెంత పోలింగ్ నమోదైంది

    లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సరికి బిహార్‌లో 37.71 శాతం, మధ్యప్రదేశ్‌లో 43.38 శాతం, ఒడిశాలో 35.79 శాతం, మహారాష్ట్రలో 29.18 శాతం, రాజస్థాన్‌లో 44.51 శాతం, ఉత్తర ప్రదేశ్‌లో 34.19 శాతం, ఝార్ఖండ్‌లో 44.9 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 52.37 శాతం.. అత్యల్పంగా జమ్ముకశ్మీర్‌లో 6.66 శాతం నమోదైంది.

    రాజస్థాన్‌లో ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళలు
    Image caption: రాజస్థాన్‌లో ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళలు
  8. ఓటు వేసిన నటి, కాంగ్రెస్ అభ్యర్థి నగ్మా

    కాంగ్రెస్ నాయకురాలు నగ్మా ముంబయిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్‌లో తాను క్యూలో నిల్చున్న ఫొటోలను ట్వీట్ చేశారు.

    View more on twitter
  9. ఓటు వేసిన సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్

    నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా సోమవారం బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్‌లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    సల్మాన్ ఖాన్
    హృతిక్ రోషన్
  10. ఓటు వేసిన తారలు

    బాలీవుడ్ తారలు అజయ్ దేవగన్, వరుణ్ ధావన్, ఇమ్రాన్ హష్మి, కరీనా కపూర్‌, ఉత్తర ముంబై కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళా మతోండ్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    తారలు
    Image caption: ఉత్తర ముంబయి కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళా మతోండ్కర్
    తారలు
    Image caption: అజయ్ దేవగన్
    తారలు
    Image caption: కరీనా కపూర్
    తారలు
    Image caption: వరుణ్ ధవన్
    తారలు
    Image caption: భార్య సరితతో మాధవన్
  11. అవినీతిని దూరం చేయాలి - రాఖీ సావంత్

    బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఓటు వేసిన తర్వాత అధికారంలోకి రాబోయే పార్టీని హెచ్చరించారు.

    కొత్త ప్రభుత్వం అన్నిరకాల అవినీతిని దూరం చేయాలని కోరారు.

    తనకు అవినీతి అంటే నచ్చదని చెప్పిన రాఖీ ముంబై రోడ్లు శుభ్రంగా ఉంచాలని కూడా డిమాండ్ చేశారు.

    View more on instagram
  12. పశ్చిమ బంగలో ఘర్షణలు

    లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కారుపై కొందరు దాడి చేశారు.

    View more on facebook
  13. ఓటు వేసిన ఆమీర్ ఖాన్

    ముంబయి బాంద్రాలోని పోలింగ్ కేంద్రంలో బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్, భార్య కిరణ్ రావుతో కలిసి వచ్చి ఓటు వేశారు.

    View more on facebook
  14. ప్రపంచ ఓటర్ల వేలిపై హైదరాబాద్ సిరా చుక్క

    'నీ వేలిపై సిరా చుక్క దేశ ప్రగతికి వేగుచుక్క' అంటాడో కవి. ఎన్నికల్లో మన ఓటు ఎంత ముఖ్యమో చెప్పడమే ఇక్కడ కవి ఉద్దేశం. అయితే, ఓటు మాత్రమే కాదు ఎన్నికల్లో సిరా చుక్కది కూడా కీలక పాత్రే.

    మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా సిరా చుక్కే.

    అందుకే, భారత్‌తో పాటు చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి.

    భారత ఎన్నికల సంఘంలోని నిబంధన37(1)ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒక వేళ ఓటరుకు ఎడమ చేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలుకైనా సిరా చుక్క పెట్టాలి.

    ఎన్నిల వేళ కీలకంగా మారే ఈ సిరా హైదాబాద్‌లోనే తయారవుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల ఎన్నికల్లో ఈ సిరానే వాడుతున్నారు.

    ఈ కథనం చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

    వేలిపై సిరా గుర్తు
  15. ఓటు హక్కు వినియోగించుకున్న కంగనా రనౌత్

    బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబయి ఖార్‌ ప్రాంతంలోని ఒక పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

    కంగనా రనౌత్
    Image caption: కంగనా రనౌత్
  16. పాకిస్తాన్ సరిహద్దున.. భారత్‌లోని చిట్టచివరి గ్రామంలో పోలింగ్..

    భారత్-పాక్ సరిహద్దుల్లో ఉన్న చివరి పోలింగ్ కేంద్రం దగ్గరకు బీబీసీ చేరుకుంది.

    మురార్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఓటింగ్ జరుగుతోంది.

    ఇది భారత్-పాక్ సరిహద్దుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 304 మంది ఓటర్లు ఉన్నారు.

    మురార్ గ్రామంలో ఓటింగ్
    Image caption: భారత్-పాక్ సరిహద్దుల్లోని మురార్ గ్రామంలో ఓటింగ్
    భారత్-పాక్ సరిహద్దుల్లోని మురార్ గ్రామంలో ఓటింగ్
    భారత్-పాక్ సరిహద్దుల్లోని మురార్ గ్రామంలో ఓటింగ్
  17. దొంగ ఓటును గెలవడం సాధ్యమేనా?

    కొంతకాలంగా సెక్షన్ 49(పి) గురించి చర్చ జరుగుతోంది. ఈ సెక్షన్ గురించి చాలా మంది గూగుల్‌లో వెతుకుతున్నారు. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్' సినిమా నేపథ్యం అంతా ఈ సెక్షన్ 49(పి) చుట్టూ తిరుగుతుంది. ఆ సినిమాలో హీరో విజయ్ పోయిన తన ఓటును ఈ నిబంధన ప్రకారమే తిరిగి దక్కించుకుంటారు.

    మరి, ఈ సినిమాలో చెప్పినట్లుగా సెక్షన్‌ 49(పి)‌తో పోయిన మన ఓటును వాస్తవంగా దక్కించుకునే అవకాశం ఉందా? ఇంతకీ సెక్షన్‌ 49(పి) అంటే ఏమిటి? ఈ నిబంధనతో మన ఓటును ఎలా పొందవచ్చు?

    ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

    ఓటు
  18. ఓటు వేసిన సోనాలీ బింద్రే

    బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే... విలే పార్లేలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    View more on instagram
  19. 11 గంటల వరకూ నమోదైన పోలింగ్ శాతం

    పీఐబీ సమాచారం మేరకు.. ఉదయం 11 గంటల వరకూ వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ వివరాలు..బిహార్ 18.26 శాతం,

    జమ్మూ, కశ్మీర్ 3.74 శాతం,

    మధ్యప్రదేశ్ 26.62 శాతం,

    మహారాష్ట్ర 16.14 శాతం,

    ఒడిశా 19.6 శాతం,

    రాజస్థాన్ 29.19 శాతం,

    ఉత్తర్ ప్రదేశ్ 21.18 శాతం,

    పశ్చిమ బంగ 35.10 శాతం,

    జార్ఖండ్ 29.21 శాతం.

    View more on twitter
  20. ఓటింగ్‌కు ఉత్సాహంగా..

    మహారాష్ట్రలోని దిండోరీ నియోజకవర్గంలో ఓటేసేందుకు డ్రమ్ములు వాయించుకుంటూ ఉత్సాహంగా వెళ్తున్న ఓటర్లు.

    View more on twitter