Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

సారాంశం

  1. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: టైమ్స్ నౌ-వీఎంఆర్: బీజేపీ 306, కాంగ్రెస్ 142, ఇతరులు 94
  2. ఏపీలో సీపీఎస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం టీడీపీకి 43 - 44, వైసీపీకి 130 - 133, జనసేనకు 01
  3. తెలంగాణ పార్లమెంటులో లగడపాటి సర్వే: టీఆర్ఎస్‌ 14-16, కాంగ్రెస్‌ 0-2, బీజేపీ 0-1, ఎంఐఎం 01
  4. సీఓటర్ ట్రాకర్: టీడీపీ 14, వైసీపీ 11 ఎంపీ స్థానాలు

లైవ్ రిపోర్టింగ్

అన్ని సమయాలు యుకె ఆధారంగా పేర్కొనబడ్డాయి

  1. ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయేకు ఆధిక్యం

    భారతదేశ చరిత్రలోనే సుదీర్ఘ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ హడావిడి మొదలైంది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. రిపబ్లిక్ సీఓటర్ సర్వేలో ఎన్డీయేకు 287 స్థానాలు వస్తాయని చెప్పగా, టుడేస్ చాణక్య, ఆజ్‌తక్ యాక్సిస్ మై ఇండియా, సీఎన్ఎన్ ఐబీఎన్ ఇఫ్సాస్ సంస్థలు తమ సర్వేలో బీజేపీకి 336 నుంచి 340 స్థానాలు వస్తాయని చెప్పాయి.

  2. ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్

    ఎగ్జిట్ పోల్స్
  3. ఎగ్జిట్ పోల్స్ - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

    exit
  4. ఎగ్జిట్ పోల్స్ కాసేపట్లో....

    ఏ మీడియా సంస్థ ఏం చెబుతోంది?

    ఎగ్జిట్ పోల్స్ కాసేపట్లో

    పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేశారు అనే ప్రాతిపదికన నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటారు. ఎన్నికల ముందు నిర్వహించే ఒపీనియన్ పోల్స్ కన్నా, పోలింగ్ అనంతర ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అసలైన ఫలితాలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే అన్నిసార్లూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కాలేదు. కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నమైన ఫలితాలను కూడా మనం చూశాం. ఏది ఏమైనా ఎన్నికల కౌంటింగ్ కన్నా ముందే పోలింగ్ ముగియగానే వెలుగుచూసే ఎగ్జిట్ పోల్స్ అంటే అందరికీ ఆసక్తే. ఈసారి సుదీర్ఘంగా జరిగిన భారత ఎన్నికల ప్రక్రియ అనంతరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అంచనా వేయడానికి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ మన ముందుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు ఎటువైపు ఉన్నారు అనేదానికి సంకేతంగా నిలిచే ఎగ్జిట్ పోల్స్ వివరాలు మరికాసేపట్లో..

  5. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్

    టషీగంగ్‌లో ఓటింగ్
    Image caption: ప్రపంచంలో ఎత్తైన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్

    ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రం హిమాచల్ ప్రదేశ్ టషీగంగ్ గ్రామంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తున ఉంది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల లోపు ఇక్కడ 53 శాతం పోలింగ్ నమోదైంది. టషీగంగ్‌లో మొత్తం 49 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఓటింగ్ ఉదయం ఏడు గంటలకు మొదలైనప్పుడు ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లో ఉంది. 9 గంటలకే ఇక్కడి ఓటర్లు సగానికి పైగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  6. కుమార్తెలతో కలిసి ఓటు వేసిన మూన్‌మూన్ సేన్

    కూతుళ్లతో మూన్‌మూన్ సేన్
    Image caption: కుమార్తెలతో మూన్‌మూన్ సేన్

    నటి, అసన్‌సోల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మూన్‌మూన్ సేన్ తన కూతుళ్లు రైమా, రియాలతో కలిసి వచ్చి ఓటు వేశారు. మూన్‌మూన్‌ సేన్ బీజేపీ అభ్యర్థి బాబుల్ సుప్రియోకు పోటీగా బరిలో నిలిచారు.

  7. రెండు గంటల వరకూ 41.42 శాతం ఓటింగ్

    2 గంటల వరకూ 41.42 శాతం పోలింగ్

    మధ్యాహ్నం 2 గంటల వరకూ వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ శాతం

    • బిహార్ 36.20 శాతం
    • హిమాచల్ ప్రదేశ్ 44.02 శాతం
    • మధ్యప్రదేశ్ 46.03 శాతం
    • పంజాబ్ 37.89 శాతం
    • ఉత్తరప్రదేశ్ 37.00 శాతం
    • పశ్చిమ బంగాల్ 49.79 శాతం
    • ఝార్ఖండ్ 52.89 శాతం
    • చండీగఢ్ 37.50 శాతం
  8. పంజాబ్‌ తరన్-తారన్‌లో హింస

    పంజాబ్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ చెప్పారు. తరన్-తారన్‌లో ఒక హత్య జరిగింది. ఎఫ్ఐఆర్‌లో దీనిని వ్యక్తిగత గొడవల వల్ల జరిగిందిగా పేర్కొన్నారని సీఎం చెప్పారు. భద్రత కట్టుదిట్టం చేశామని, పరిస్థితి అదుపులో ఉందని వివరించారు.

    View more on twitter
  9. కేసు పెట్టిన తేజ్ ప్రతాప్

    ఓటు వేయడానికి వెళ్లినప్పుడు తన డ్రైవర్, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి జరిగిందని ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ ఆరోపించారు. పట్నా విమానాశ్రయం పోలీస్ స్టేషన్లో తేజ్ ప్రతాప్ కేసు పెట్టారు.

    View more on twitter
  10. నాపై హత్యాయత్నం జరిగింది: తేజ్ ప్రతాప్

    “ఈరోజు ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం బయటకు వస్తున్నప్పుడు నాపైన హత్యాయత్నం జరిగింది. నా కారు ధ్వంసమైంది. మా డ్రైవర్, సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు” అని తేజ్ ప్రతాప్ తెలిపారు.

    View more on twitter
  11. మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం

    పీఐబీ సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం 1 గంట వరకూ ఏడవ దశలో 38.85 శాతం పోలింగ్ నమోదైంది.

    రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి..

    • బిహార్ 36.20 శాతం
    • హిమాచల్ ప్రదేశ్ 42.38 శాతం
    • మధ్యప్రదేశ్ 45.81 శాతం
    • పంజాబ్ 37.86 శాతం
    • ఉత్తరప్రదేశ్ 37.00 శాతం
    • పశ్చిమ బెంగాల్ 479.79 శాతం
    • ఝార్ఖండ్ 52.89 శాతం
    • చండీగఢ్ 37.50 శాతం
  12. ఓటేసిన అవిభక్త కవలలు

    అవిభక్త కవలలు సబా, ఫరాహ్‌లు బిహార్‌లోని సమన్‌పురాలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకూ వీరికి ఒకటే గుర్తింపు కార్డు, ఓటు ఉండేది. ఈసారి మాత్రం ఇద్దరికీ వేర్వేరు గుర్తింపు కార్డులు ఇచ్చారు. దీంతో ఇద్దరూ తమతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    సబా, ఫరాహ్
  13. ఓటేసిన ‘స్వతంత్ర భారత తొలి ఓటరు’ శ్యామ్ శరణ్ నేగి

    హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కురువృద్ధుడు శ్యామ్ శరణ్ నేగి.. లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    103 ఏళ్ల నేగి.. 1951 నుంచి ఇప్పటి వరకు అన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారని, స్వతంత్ర భారతదేశంలో తొలి ఓటరు ఆయనే అని అంటుంటారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్వీట్ చేసింది.

    103 ఏళ్ల ఓటరు శ్యామ్ శరణ్ నేగి
    View more on twitter
  14. తమిళనాడులో ఉప ఎన్నికలు, రీ పోలింగ్

    తమిళనాడులో నాలుగు అసెంబ్లీ స్థానాలు.. తిరుప్పరంగుండ్రం, సూళ్లూర్, అరవకురిచ్చి, వొట్టపిడారం నియోజకవర్గాల్లో ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

    అలాగే, 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది.

    తమిళనాడులో ఉప ఎన్నికలు
  15. చంద్రగిరిలో రీ పోలింగ్

    లోక్‌సభ ఎన్నికల పోలింగ్ చివరిరోజునే చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరుగుతోంది.

    మొదటి విడత పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీనే ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరిగింది.

    అయితే, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని నిర్ధరించుకున్న ఎన్నికల సంఘం రీ పోలింగ్‌కు ఆదేశించింది.

    రీ పోలింగ్ జరుగుతున్న కేంద్రాలు

    • ఎన్ఆర్ కమ్మపల్లి
    • పులివర్తిపల్లి
    • కొత్త ఖండ్రిగ
    • కమ్మపల్లి
    • వెంకటాపురం
    • కల్లేపల్లి
    • కుప్పం బాదర
    ఓటు
  16. ఓటేసిన ప్రముఖులు

    అన్ని ప్రాంతాల్లోనూ ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

    జలంధర్‌లో ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్, గోరఖ్‌పూర్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పట్నాలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    హర్భజన్ సింగ్
    యోగి ఆదిత్యనాథ్
    నితీశ్ కుమార్