Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

లైవ్ రిపోర్టింగ్

అన్ని సమయాలు యుకె ఆధారంగా పేర్కొనబడ్డాయి

  1. 50 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్

    దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సుమారు 50 మంది కోవిడ్-19 బారినపడ్డారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    View more on twitter
  2. దిల్లీ కరోనా పాజటివ్ కేసుల్లో సగం మంది నిజాముద్దీన్ మర్కత్‌కు చెందినవారే: కేజ్రీవాల్

    దిల్లీలో ఇంతవరకు మొత్తం 219 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 108 మంది నిజాముద్దీన్ మర్కత్‌కు చెందినవారేనని.. దిల్లీలో చనిపోయిన నలుగురిలో ఇద్దరు కూడా నిజాముద్దీన్ మర్కత్‌కు చెందినవారేనని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

    View more on twitter
  3. స్పెయిన్‌లో 10 వేలు దాటిన మృతుల సంఖ్య

    స్పెయిన్‌లో కరోనావైరస్ మృతుల సంఖ్య 10,000 దాటిపోయింది. ఒక్కరోజులో 950 మంది మరణించడంతో మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.

    View more on twitter
  4. హోమ్ క్వారెంటైన్‌లో ఉన్న 25 వేల మందిని ట్రాక్ చేస్తామన్న మంత్రి ఈటల

    కోవిడ్-19 మానిటరింగ్ సిస్టమ్ సహాయంతో పర్యవేేక్షణ

    హోమ్ క్వారెంటైన్‌లో ఉన్న 25 వేలకు పైగా కరోనా అనుమానితుల్ని వారి జియో లొకేషన్ ద్వారా రియల్ టైమ్‌లో ఆరోగ్య శాఖ ట్రాక్ చేస్తుందని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ట్వీట్ చేశారు. దిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ కార్యక్రమానికి హాజరై వచ్చిన వారి ప్రభావం విస్తృత స్థాయిలో ఉంటుందనే ఆందోళనల నేపథ్యంలో పర్యవేక్షణ చర్యలు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.

    View more on twitter
  5. తమిళనాడులో 'తబ్లీగీ జమాత్' కరోనా కేసులు

    నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్‌కు వెళ్లి వచ్చిన తమిళనాడు వాసులకు కూడా కరోనా ఉన్నట్టు తేలింది.

    ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి 1500 మంది హాజరయ్యారు. వీరిలో 50 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏఎన్ఐ ధ్రువీకరించింది.

    తాజాగా 50 కేసులతో తమిళనాడులోని మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 124కు చేరిందని తమిళనాడు హెల్త్ సెక్రటరీ చెప్పారని తెలిపింది.

    View more on twitter
  6. కోవిడ్-19 నివారణ చర్యలు, విశాఖ సెంట్రల్ జైలు ఖైదీల తాత్కాలిక విడుదల

    కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ సెంట్రల్ జైల్లో 7 ఏళ్ల శిక్ష అనుభవించిన ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేసింది.

    విశాఖ నగర పరిధిలో 71 మంది , విజయనగరం, శ్రీకాకుళం నగర పరిధిలో ఒక్కొక్కరు మొత్తం 73 మందిని విడుదల చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు విశాఖ సెంట్రల్ జైల్ నుండి విడుదలయ్యారు.

    జైలు నుంచి విడుదలైన అందరినీ ఒక నెల రోజులు పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉంటారు. నెల రోజుల తర్వాత వీరందరూ తిరిగి విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్తారు.

    "చట్ట పరమైన షరతుల ప్రకారం 73 మంది ఖైదీలు విడుదల చేశాం, వీరి కదలికలపై నిఘా ఉంచుతాం" అని విశాఖ జిల్లా జైల్ అధికారులు చెప్పారు.

  7. ఈ లైవ్ పేజీలో లైవ్ అప్‌డేట్లు ఆగిపోయాయి. తాజా సమాచారం కోసం ఈ లింక్‌పైన క్లిక్ చేయండి

    కరోనావైరస్, లాక్‌డౌన్ల కవరేజీకి సంబంధించిన తాజా అప్‌డేట్ల కోసం ఈ లింక్‌పైన క్లిక్ చేయండి.

  8. ఇబ్బందుల్లో ఉన్నవారి ఇంటి అద్దె దిల్లీ ప్రభుత్వమే చెల్లిస్తుంది: సీఎం కేజ్రీవాల్

    దిల్లీలో పేదలెవరైనా ఇంటి అద్దెలు చెల్లించలేకపోతే వారికి బదులు తన ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

    ఇంటి యజమానులు రెండు మూడు నెలల పాటు అద్దెల కోసం ఒత్తిడి చేయొద్దని సూచించారు. ఎ

    వరైనా చెల్లించలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పిన ఆయన ఎవరైనా అద్దెల కోసం ఒత్తిడి చేసినా, ఖాళీ చేయమన్నా అలాంటి ఇంటి యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

    View more on twitter
  9. భారత్‌లో 1024 పాజిటివ్ కేసులు.. 27 మరణాలు

    భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం రాత్రి 7.30 సరికి 1024కి పెరిగింది. వారిలో 96 మంది వ్యాధి నయం కాగా 27 మంది మరణించారు.

    అత్యధికంగా మహారాష్ట్రలో ఆరుగురు, గుజరాత్‌లో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.

    కర్ణాటకలో ముగ్గురు, దిల్లీ, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇద్దరేసి కరోనావైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయారు.

    బిహార్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కో మరణం నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించింది.

  10. ఆంధ్రప్రదేశ్‌లో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు

    ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    మార్చి 17న బర్మింగ్‌హామ్ నుంచి వచ్చిన రోగి(పేషెంట్ నంబర్ 7)తో మార్చి 21న ప్రత్యక్షంగా మెలగడంతో ఈ ఇద్దరికి వైరస్ సోకినట్లు గుర్తించారు.

    ఆదివారం 102 శాంపిళ్లు పరీక్షించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్ వెల్లడించింది.

    విశాఖ జిల్లాలో 6, గుంటూరులో 4, కృష్ణా జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 3, చిత్తూరు 1, తూర్పుగోదావరి 1, కర్నూలు 1, నెల్లూరు జిల్లాలో 1 కేసు నమోదైనట్లు వెల్లడించింది.

  11. కొత్త కేసులు నమోదు కాకుంటే ఏప్రిల్ 7 తరువాత తెలంగాణలో కరోనా ఉండదు: కేసీఆర్

    తెలంగాణలో ఇప్పటివరకు కరోనాపాజిటివ్ కేసులు 70 నమోదయ్యాయని.. వారిలో 11 మందికి ఇప్పుడు నయమైందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. తాజాగా వారికి చేసిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఆ 11 మందిని సోమవారం డిశ్చార్జి చేస్తారన్నారు. మిగతావారికీ నయమైతే, కొత్తగా కేసులు నమోదు కాకుంటే ఏప్రిల్ 7 నాటికి ఇప్పుడున్నవారంతా డిశ్చార్జ్ అవుతారని.. అప్పుడు తెలంగాణలో కరోనా కేసులు ఉండవని కేసీఆర్ అన్నారు.

  12. వరి, మొక్క జొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: కేసీఆర్

    తెలంగాణలో ఈ వ్యవసాయ సీజన్‌లో రైతులు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ప్రధానంగా 40 లక్షల ఎకరాల్లో 1.05 కోట్ల టన్నుల వరి చేతికందనుందని.. 14.5 లక్షల టన్నుల మొక్కజొన్న చేతికందనుందని చెప్పారు. ఈ పంటనంతటినీ కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనాలని నిర్ణయించిందని కేసీఆర్ చెప్పారు. గ్రామాలకే వచ్చి నియంత్రిత కొనుగోలు కేంద్రాలలో కొంటామన్నారు. రైతులకు నిర్దేశిత తేదీలు కేటాయించి, కూపన్లు ఇచ్చి ఆ ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎవరూ కొనుగోలు కేంద్రాలకు రావొద్దని.. అక్కడ ఎవరూ ఉండరని.. అలా కొనుగోలు కేంద్రాలకు వస్తే అనవసరంగా కరోనావ్యాప్తి జరుగుతుందని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణ పల్లెల్లో విజృంభించే ప్రమాదం ఉంటుందని.. దాన్ని నివారించేందుకే గ్రామాలకు వెళ్లి అధికారులు కొనుగోలు చేస్తారని చెప్పారు. రైతులంతా ఈ నిబంధనను పాటించాలని సూచించారు.

  13. కరోనాపై పోరులో మనకున్న ఏకైక ఆయుధాన్ని వాడుదాం: కేసీఆర్

    క్వారంటీన్‌లో ఉన్నవారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.. వారిలో ఎవరికైనా రోగ లక్షణాలు తీవ్రంగా ఉంటే వారిని ఆసుపత్రులకు రిఫర్ చేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.. ఇకపై కొత్తగా కేసులు నమోదు కాకుంటే కొద్ది రోజుల్లో ప్రస్తుత బాధితులందరూ కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అవుతారని చెప్పారు. విమనాశ్రయాలు, రైల్వేలు అన్నీ మూసివేయడం వల్ల కొత్తగా ఎవరూ బయట నుంచి వచ్చే అవకాశం లేదు కాబట్టి కొత్త కేసులు రావనే ఆశిస్తున్నామన్నారు. భారత్‌లో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌పై అంతర్జాతీయ మెడికల్ జర్నళ్లలోనూ వ్యాసాలు వచ్చాయని, 130 కోట్ల మంది ఉన్న దేశంలో సమస్య ముదరకుండా తెలివైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. కరోనాపై పోరులో మనకున్న ఏకైక ఆయుధమైన స్వీయ నియంత్రణను పాటించి లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు.

    కేసీఆర్
  14. ప్రైవేట్ ఆరోగ్య వ్యవస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి: మానవ హక్కుల వేదిక

    కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులను, నర్సింగ్ హోంలను స్వాధీనం చేసుకోవాలని మానవ హక్కుల వేదిక(హెచ్‌ఆర్‌ఎఫ్) డిమాండ్ చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలను వాటిలో ఉన్న అన్ని వైద్య సదుపాయాలు, మానవ వనరులు సహా స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నిర్వహణ చేపట్టి ఈ విపత్తును ఎదుర్కోవాలని కోరింది. ఈ విషయంలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌ను జాతీయం చేసిన స్పెయిన్‌ను భారత ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. కరోనావైరస్ మహమ్మారి మానవాళిని గడగడలాడిస్తున్న తరుణంలో గూడులేని నిరుపేదలు, వలస కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని.. 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు ప్రభుత్వం వీరి గురించి ఏమాత్రం ఆలోచించలేదని హెచ్‌ఆర్‌ఎఫ్ ఆరోపించింది. జైళ్లలో ఈ అంటువ్యాధి వ్యాపించకుండా అండర్ ట్రయల్ ఖైదీలు, కొన్ని రకాల శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలను అత్యవసర పెరోల్, ఫర్లోపై విడుదల చేసే విషయంలో తెలుగు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్-19 నేపథ్యంలో జైళ్లలో ఖైదీల సంఖ్య తగ్గించడానికి అండర్ ట్రయల్ ఖైదీలు, ఏడేళ్ల లోపు శిక్షలు అనుభవిస్తున్నవారిని పెరోల్, బెయిలుపై విడుదల చేసే విషయంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేసిన విషయాన్ని మానవ హక్కుల వేదిక గుర్తుచేసింది.

    వలస కార్మికులు
  15. తెలంగాణలో కరోనావైరస్ నుంచి కోలుకున్న 11 మంది

    తెలంగాణలో 11 మంది కరోనావైరస్ బాధితులు కోలుకున్నారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గతంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధరణయిన వీరిని ఇప్పుడు నెగటివ్ అని టెస్టుల్లో తేలిందని తెలిపారు.

    View more on twitter
  16. ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ.. పూర్తి సహకారం అందిస్తామన్న కాంగ్రెస్ ఎంపీ

    కరోనావైరస్‌పై భారత్ చేస్తున్న యుద్ధంలో ప్రభుత్వానికి అండగా ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. లాక్‌డౌన్ వల్ల రోజుకూలీలపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. తన లేఖలో రాహుల్ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.

    View more on twitter
  17. ఏపీలో పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

    ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తీరు, దాని నివారణ కోసం అందుబాటులో ఉన్న వైద్య విధానాలు త‌దిత‌ర అంశాల‌పై తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల‌యంలో మంత్రులు, చీఫ్ సెక్ర‌ట‌రీ, ఆరోగ్య‌శాఖాధికారుల‌తో ముఖ్యమంత్రి స‌మీక్ష‌ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం దుకాణాలు తెరవడం వంటివాటికి పాటిస్తున్న సమయాలను కుదించాలని నిర్ణయించారు. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలకోసం అనుమతిస్తారు.. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటవరకూ అనుమతి ఉంటుంది. నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే జైలుకే.. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ప్రదర్శించాలని సూచించారు. అందులోనే ఫిర్యాదు చేయాల్సిన కాల్‌ సెంటర్‌ నంబర్‌ కూడా ఉంటుందని చెప్పారు.

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  18. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్నవారంతా నన్ను క్షమించాలి - ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ

    ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

    దేశ ప్రజలనుద్దేశించి ఆయన ఆలిండియా రేడియోలో ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడారు.

    లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల విధించిన ఆంక్షల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వారంతా తనను క్షమించాలని ప్రధాని కోరారు.

    రోజుకూలీల కష్టాలను తాను అర్థం చేసుకోగలనని ప్రధాని అన్నారు.

    21 రోజుల లాక్‌డౌన్‌ను పాటించి, ఇళ్లకే పరిమితం కావాల్సిన ప్రజల్లో కొంతమంది ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారని, వాళ్లు వాళ్ల ప్రాణాలతోనే కాకుండా సన్నిహితుల ఆరోగ్యంతో కూడా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారని తెలిపారు.

    హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది కరోనావైరస్ బారి నుంచి బయటపడిన ఒక ఐటీ ఉద్యోగితోను, ఆగ్రాలో చికిత్స పొంది కోవిడ్-19 వ్యాధి నయమైన ఒక కుటుంబ యజమానితోనూ మోదీ మాట్లాడారు.

    ఇది యుద్ధం లాంటి పరిస్థితేనని ఒక డాక్టర్‌తో మాట్లాడుతూ మోదీ అన్నారు.కోవిడ్-19 కేసులు ఒక్కసారిగా పెరిగిపోతుంటాయని, విదేశాల్లో కూడా ఇలాగే జరిగిందని, ఆ పరిస్థితి భారత్‌లో రాకూడదన్నదే తమ ప్రయత్నమని మోదీ చెప్పారు.

    రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది సేవలను మోదీ ప్రశంసించారు.

    నరేంద్ర మోదీ
  19. కరోనాపై పోరులో భారత్‌ను ఇండియా వదిలేయ కూడదు - కైలాశ్ సత్యార్థి

    కరోనాపై పోరాటంలో పేద భారతదేశాన్ని ఆధునిక ఇండియా వదిలేయకూడదని నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ‘‘రోజువారీ కూలీల పిల్లలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకలితో కానీ, మందులు లేక కానీ ఒక్క చిన్నారి మరణించినా అది మనందరికీ కళంకం. కోవిడ్-19పై పోరులో భారత్‌ను ఇండియా వెనకాల వదిలేయ కూడదు’’ అని ఆయన అన్నారు.

    View more on twitter
  20. ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభం

    కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తోంది.

    ఆదివారం ఉదయం 6 గంటల నుంచే ప్రభుత్వ చౌక ధరల దుకాణాల వద్ద బియ్యం, కందిపప్పు, గోధుమ పిండి, పంచదార పంపిణీ చేస్తున్నారు.

    నిత్యావసర వస్తువులను తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.

    కాగా, కరోనావైరస్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి మనిషికి ఐదు అడుగుల దూరం ఉండేలా అధికారులు గుర్తులు పెట్టి, క్యూలైన్లను నియంత్రిస్తున్నారు.

    చాలామంది ప్రజలు ముక్కు, నోటికి గుడ్డలు, మాస్కులు పెట్టుకుంటున్నారు.

    1.40 కోట్ల మందికి రేషన్

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రేషన్ కార్డులు ఉన్న మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1.40 కోట్లు.

    ఏప్రిల్‌ నెలాఖరులోగా మూడు సార్లు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

    ఒక్కో రేషన్ కార్డుకు ప్రతిసారీ ఐదు కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు చొప్పున మొత్తం 15 కేజీల బియ్యం, మూడు కేజీల కంది పప్పును ప్రభుత్వం అందించనుంది.

    ఏప్రిల్‌ నెల కోటా మొదటి విడత సరుకులను లబ్దిదారులు ఈరోజు తీసుకుంటున్నారు.

    రెండో విడత సరుకులు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి పంపిణీ చేస్తారు. ఏప్రిల్‌ 29న మూడో విడత రేషన్‌ను అందిస్తామని పౌరసరరాలశాఖ కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు.

    ఇంటింటికీ వెళ్లి ఎందుకు ఇవ్వట్లేదు?

    సరుకులను రేషన్‌ షాపుల్లో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పంపిణీ చేస్తారు.

    సరుకుల కోసం వచ్చే వారు ఒక్కొక్కరు కనీసం ఒక మీటర్‌ దూరంలో నిల్చునేలా ప్రత్యేకంగా మార్కింగ్‌ చేశారు.

    లబ్దిదారుల నుంచి బయోమెట్రిక్ అవసరం లేదని ప్రభుత్వం అదేశాలు ఇచ్చింది.

    వీఆర్వో/సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్‌తో లబ్ధిదారులకు సరుకుల పంపిణీ చేస్తారు.

    రేషన్‌ షాపుల వద్ద సబ్బు, శానిటైజర్‌ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అదేశాలు ఇచ్చారు.

    ‘‘లబ్ధిదారులందరికీ సరుకులు అందిస్తాం తమకు సరుకులు అందుతాయో లేదో అనే ఆందోళన వద్దు. లబ్ధిదారులందరికీ సకాలంలో అందేలా ఏర్పాటు చేశాం. సరుకులు తీసుకునేందుకు అందరూ ఒక్కసారిగా వెళ్లకుండా రేషన్‌ షాపు వద్దకు నలుగురు చొప్పున వెళ్లి డీలర్లకు సహకరించాలి. ఇంటింటికీ పంపిణీ పరిశీలన చేసినా సాధ్యం కాదని నిర్దరణకు వచ్చాం. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నప్పటికీ తొలుత వారికి సరుకులు అందించి, అక్కడి నుంచి మళ్లీ లబ్దిదారులకు చేర్చడం కన్నా, ఒక్క దశలోనే నేరుగా అందించడం మేలు అని నిర్ణయించాం’’ అని కోన శశిధర్ చెప్పారు.

    ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ సరుకుల పంపిణీ
    ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ సరుకుల పంపిణీ
    ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ సరుకుల పంపిణీ
    ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ సరుకుల పంపిణీ
    ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ సరుకుల పంపిణీ
    ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ సరుకుల పంపిణీ