Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

లైవ్ రిపోర్టింగ్

అన్ని సమయాలు యుకె ఆధారంగా పేర్కొనబడ్డాయి

  1. ఇవీ ఈనాటి లైవ్ అప్‌డేట్స్... మళ్లీ రేపటి లైవ్ పేజిలో కలుసుకుందాం

    ఇవీ ఈనాటి ముఖ్యాంశాలు..

    - ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య 363కి పెరిగింది. ఆరుగురు చనిపోయారు. తెలంగాణలో 471కి.పెరిగిన కేసుల జాబితా. మృతుల సంఖ్య 12.

    - కోవిడ్-19 బారినపడి చికిత్స పొందుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి కోలుకుంటున్నారు.

    * కోవిడ్-19 చికిత్సతో ఉపయోగపడుతుందని చెబుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరఫరా చేసినందుకు గాను, అమెరికా, బ్రెజిల్‌లు భారత ప్రధాని మోదీకి, భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపాయి. తాము సైతం కరోనాతో పోరాడుతున్నా కోవిడ్-19‌పై పోరాటంలో భారతదేశం మానవాళికి సాధ్యమైనంత సహకారం అందిస్తుందని మోదీ అన్నారు.

    కరోనావైరస్ తాజా అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  2. కరోనావైరస్ అప్‌డేట్స్‌లో గురువారం నాటి ముఖ్యాంశాలు

    మహమ్మారి కరోనావైరస్ కారణంగా ప్రపంచం అతలాకుతలం అవుతోంది. గురువారం కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి.

    * తమ దేశంలోని వుహాన్ నగరంలో ప్రబలిన కరోనావైరస్ విషయంలో తాము కేసులు, మరణాల సంఖ్యను దాచిపెట్టామన్న ఆరోపణలపై గురువారం చైనా స్పందించింది. అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ ఖండించింది. ఈ అంటువ్యాధి గురించి ప్రపంచానికి చెప్పడంలో చైనా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించిందని ఆ దేశ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి జావో లిజియాన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరించిందన్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపణలనూ ఖండిస్తూ ఆ సంస్థ వ్యవహరించిన తీరుకు మద్దతు పలికింది.

    * కోవిడ్-19 బారినపడి చికిత్స పొందుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి కోలుకుంటున్నారు.

    * కోవిడ్-19 చికిత్సతో ఉపయోగపడుతుందని చెబుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరఫరా చేసినందుకు గాను, అమెరికా, బ్రెజిల్‌లు భారత ప్రధాని మోదీకి, భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపాయి. తాము సైతం కరోనాతో పోరాడుతున్నా కోవిడ్-19‌పై పోరాటంలో భారతదేశం మానవాళికి సాధ్యమైనంత సహకారం అందిస్తుందని మోదీ అన్నారు.

    * ఏపీలో కేసుల సంఖ్య 363కి.. మరణాల సంఖ్య 6కి పెరిగాయి.

    * తెలంగాణలో కేసుల సంఖ్య 471కి.. మరణాల సంఖ్య 12కి పెరిగాయి.

  3. దిల్లీ వెళ్లొచ్చిన సింగరేణి కార్మికుడికి కరోనా.. కంటెయిన్‌మెంట్ జోన్లలో ఆంక్షలు : ఈటల

    ఈటల రాజేందర్

    భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడికి కరోనా భూపాలపల్లిలో సింగరేణి గని కార్మికుడు ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధరణైందని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

    ఆ కార్మికుడు మార్చి 19 నుంచి 30 వరకు విధులకు హాజరవడంతో ఆ కాలంలో విధుల్లో ఉన్న సహ కార్మికులందరినీ క్వారంటీన్‌కు పంపించారన్నారు.

    కాగా కరోనా సోకిన కార్మికుడు దిల్లీ వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారని చెప్పారు. ఆ కార్మికుడి కూతురికీ కరోనా సోకిందని, ఇద్దరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారని మంత్రి చెప్పారు.

    కంటైన్మెంట్ జోన్‌గా ఖైరతాబాద్

    హైదరాబాద్‌లో కరోనా రోగులున్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.

    అందులో భాగంగా ఖైరతాబాద్ గణేష్ చుట్టుపక్కల ఉన్న రహదారులను అధికారులు మూసివేశారు.

    ఖైరతాబాద్‌‌తో పాటు చింతల్‌బస్తీ, పంజగుట్ట, రామ్‌గోపాల్‌ పేట, మారేడుపల్లి, షేక్‌పేట్‌, అస్మత్‌పేట్‌, జగద్గిరిగుట్ట, రాజేంద్రనగర్‌, హఫీజ్‌పేట్‌, కూకట్‌పల్లిలనూ కంటెన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.

    హాట్ స్పాట్లుగా 101 ప్రాంతాలు

    కరోనా హాట్ స్పాట్లుగా 101 ప్రాంతాలను ప్రకటించామని, అక్కడి ప్రజలు బయటకు రాకూడదని మంత్రి చెప్పారు.

    కరోనా వైద్యం కోసం 1000 వెంటిలేటర్లు ఆర్డర్ చేసినట్లు తెలిపారు.

    తెలంగాణలో టెలిమెడిసిన్ అందుబాటులోకి తెస్తామన్నారు.

  4. క్వారంటీన్ కేంద్రానికి వెళ్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కారు సీజ్: పోలీసులు

    క్వారంటీన్ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు.

    లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రిమంచారంటూ ఆయన్ను అడ్డుకోవడంతో మాజీ మంత్రికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

    ఐపీసీ సెక్షన్ 188 మరియు ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్-1987 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు తెలిపారు.

    మాజీ మంత్రి కారును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

    కాగా తానేమీ లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించలేదని.. క్వారంటీన్ కేంద్రంలో ఉంటూ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సహాయ పడేందుకు వెళ్తుంటే పోలీసులు తనను దుర్భాషలాడి, దౌర్జన్యం చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

    కొల్లు రవీంద్ర
  5. ఏపీలో ఎంసెట్ సహా వివిధ ప్రవేశపరీక్షలు వాయిదా

    ఇంజినీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌ సహా ఇతర ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి గురువారం ప్రకటించింది.

    కోవిడ్‌-19 వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో పరీక్షలకు వాయిదా వేసినట్టు వెల్లడించింది.

    పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులకు తొలుత మార్చి 29 వరకు తుది గడువు విధించగా తరువాత ఏప్రిల్‌ 5 వరకు పొడిగించారు.

    లాక్‌డౌన్‌ విధించడంతో దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 17 వరకు పెంచారు.

    షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వాయిదా వేశారు.

    పరిస్థితులను బట్టి మే నెలలో కొత్త షెడ్యూల్స్‌ జారీ చేస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు.

  6. ఏపీలో 6కి చేరిన కరోనా మరణాలు.. 363కి చేరిన కరోనా బాధితులు

    ఆంధ్రప్రదేశ్‌లో గురువారం కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    ప్రకాశం జిల్లాలో 11, గుంటూరులో 2, కడప, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

    తాజాగా చిత్తూరు జిల్లాలో మరో బాధితుడు డిశ్చార్జయ్యారు.

    కరోనాతో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య ఆరుకి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 347 యాక్టివ్ కేసులున్నాయి.

    కరోనా కేసులు
  7. సౌదీ రాజకుటుంబంపైనా కరోనావైరస్ ప్రభావం

    ది కింగ్ ఫైజల్ స్పెషలిస్ట్ హాస్పిటల్

    అత్యాధునిక ఆరోగ్య సేవల వ్యవస్థ ఉన్నప్పటికీ సౌదీ అరేబియా కోవిడ్-19 నేపథ్యంలో దుర్బలంగా మారింది.

    న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన ఒక ధ్రువీకరణ లేని కథనం ప్రకారం పాలక అల్ సౌద్ కుటుంబమూ కరోనావైరస్ బారినపడింది.

    పెద్ద సంఖ్యలో వలస కార్మికులు, ఏటా వచ్చే హజ్ యాత్రికులతో కిటకిటలాడే సౌదీ అరేబియా గతంలోనూ వైరస్‌ల ప్రభావానికి లోనయింది.

    2012 తరువాత ఇప్పటివరకు మరో కరోనావైరస్ కారణంగా వచ్చే మెర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వల్ల సౌదీ అరేబియాలో 780 మంది ప్రాణాలు కోల్పోయారు.

    అంతకుముందు రిఫ్ట్ వ్యాలీ వైరస్ వల్ల కూడా వందలాది మంది చనిపోయారు. ఇప్పుడు కోవిడ్-19 మహమ్మారి కూడా మధ్యప్రాచ్యంలో విజృంభిస్తోంది.

    ఇలాంటి తరుణంలో అధికారంలో ఉన్న రాకుమారులు పెద్దగా కనిపించడం లేదు. మామూలుగా కూడా ఏటా వేసవిలో రాజకుటుంబంలోని చాలామంది వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి రాజధాని రియాద్‌ నుంచి జెడ్డా వెళ్లి సేదదీరుతారు.

    ప్రస్తుతం రాజు సల్మాన్ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.

    ఆయన కుమారుడు, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా సౌదీ వాయువ్య తీరంలోని పెద్దగా జనసంచారం లేని ప్రాంతానికి వెళ్లినట్లు చెబుతున్నారు.

  8. తెలంగాణలో 471 పాజిటివ్ కేసులు: మంత్రి ఈటల రాజేందర్

    శుక్రవారం మరోసారి పరీక్షలు నిర్వహించాక నెగటివ్ రిజల్ట్ వస్తే మొత్తం 68 మందిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేస్తామని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

    ఇంతవరకు తెలంగాణలో మొత్తం 471 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. అందులో 388 మంది మర్కజ్‌తో సంబంధం ఉన్నవారేనని మంత్రి చెప్పారు.

    గురువారం 665 శాంపిళ్లు పరీక్షించగా 18 పాజిటివ్ వచ్చాయన్నారు.

    మరొకరు మరణించడంతో మృతుల సంఖ్య 12కి చేరింది. గురువారం రాత్రి 8 గంటల సమయానికి రాష్ట్రంలో 414 యాక్టివ్ కేసులు ఉండగా, 45 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. 12 మంది మరణించారు.

    View more on twitter
  9. విశాఖలో ఐసోలేషన్‌లో ఉన్నది 16 మంది.. అందుబాటులో ఉన్న ఐసోలేషన్ బెడ్స్ 1,698

    విశాఖ జిల్లాలో 1,698 ఐసోలేషన్ పడకలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వినయ్ చంద్ చెప్పారు. ప్రస్తుతం విశాఖ నగరంలోని గీతం ఆసుపత్రిలో మాత్రమే 16 మంది ఐసోలేషన్ లో ఉన్నారని ఆయన తెలిపారు.

    జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులలో నిన్నటి వరకు 19మంది అడ్మిట్ కాగా వారిలో ముగ్గురిని ఈరోజు డిశ్చార్జి చేశారని చెప్పారు.

    జిల్లాలో వివిధ క్వారంటైన్ కేంద్రాలలో 164 మంది ఉన్నారన్నారు.

    యలమంచిలి క్వారంటైన్ కేంద్రంలో 34 మంది, నర్సీపట్నంలో 34 మంది, విశాఖపట్నంలో రైల్వే ఆసుపత్రిలో 45 మంది, గాజువాక వికాశ్ జూ. కాలేజీ 23, పాడేరులో 28, ఉన్నారని చెప్పారు.

    జిల్లాలో 96 కేంద్రాలలో 4758 పడకలకు ఇంకా 4594 క్వారంటైన్ పడకలు అందుబాటులో ఉన్నట్లు ఆయన వెల్లడించారు..

  10. కేరళలో మత్స్యకారులకు రూ.2 వేలు.. బీడీ కార్మికులకు రూ. వెయ్యి చొప్పున ప్రభుత్వ సాయం

    కేరళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి మత్స్యకారులను కరోనా విపత్తు సమయంలో ఆర్థికంగా ఆదుకునేందుకు చర్యలు ప్రారంభించింది.

    మత్స్యకారులందరికీ రూ. 2,000 చొప్పున వారికి సహాయం ప్రకటించింది.

    అలాగే బీడీ కార్మికులు, లాటరీ టికెట్లు అమ్ముకునేవారికి రూ.1000 చొప్పున సహాయం ప్రకటించారు. కాగా కేరళలో కరోనాపాజిటివ్ కేసుల సంఖ్య 357కి పెరిగింది.

    View more on twitter
  11. ఒడిశాలో మాస్క్ ధరించకపోతే జరిమానా.. ఎంతో తెలుసా

    ఒడిశాలో మాస్కు ధారణను తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం.

    మాస్కు ధరించకుండా ఎవరైనా బయటకు వస్తే మొదటి మూడు సార్లు వరకు రూ. 200 చొప్పున జరిమానా విధిస్తామని.. ఆ తరువాత నుంచి రూ. 500 చొప్పున జరిమానా విధిస్తామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.

    View more on twitter
  12. కోలుకుంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    బోరిస్ జాన్సన్

    కరోనావైరస్ సోకి ఆసుపత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం కుదుటపడుతోందని ఆయన అధికార ప్రతినిధి ప్రకటించారు.

    ప్రధాని ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న ఎన్‌హెచ్‌ఎస్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

  13. కరోనాపై పోరాటంలో ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధతకు రూ.15 వేల కోట్ల ప్యాకేజీ మంజూరు

    ‘ఇండియా కోవిడ్-19 అత్యవసర నిధి, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత ప్యాకేజీ’కి భారత ప్రభుత్వం రూ.15 వేల కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    View more on twitter
  14. భారత్‌లో కరోనా మరణాలు 169

    దేశంలో కరోనా మరణాలు, కేసులు మరిన్ని పెరిగాయి.

    కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 5,865కి చేరింది.

    మొత్తం మృతుల సంఖ్య 169కి చేరింది.

    గత 24 గంటల్లో 20 మంది మరణించగా.. కొత్తగా 591 కేసులు నమోదయ్యాయి.

    View more on twitter
  15. తెలంగాణ జైళ్లలో భారీ ఎత్తున మాస్కులు, హ్యాండ్ శానిటైజర్ల తయారీ

    తెలంగాణ జైళ్లలో పెద్ద ఎత్తున మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు తయారుచేస్తున్నారు. మాస్కులను జైళ్ల వద్దే విక్రయిస్తున్నారు. శానిటైజర్లను జైళ్ల వద్ద, బయట కూడా విక్రయిస్తున్నారు.

    శానిటైజర్లు
  16. 24 గంటల్లో 549 కొత్త కేసులు.. 17 మరణాలు.. ఇండియాలో మొత్తం కేసులు 5,734

    దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 5,734కి చేరింది.

    నిన్నటి నుంచి ఈ వైరస్ వల్ల మరో 17 మంది మరణించారు.

    దీంతో మృతుల సంఖ్య 166కి చేరింది. 473 మందికి వ్యాధి నయమైంది.

    View more on twitter
  17. కరోనావైరస్ అంటిస్తానంటూ పోలీసులపై ఉమ్మిన వ్యక్తిపై ఉగ్రవాదం కేసు

    కరోనావైరస్‌ను వ్యాప్తి చేస్తామని బెదిరించిన ఇద్దరిపై అమెరికాలో ఉగ్రవాద నేరాభియోగం నమోదు చేశారు.

    కరోనావైరస్‌ను జీవ ఆయుధ క్యాటగిరీలో చేర్చడంతో అమెరికాలో దీనిపై తప్పుడు సమాచారం, బెదిరింపులకు పాల్పడేవారికి అయిదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

    మార్చి నెలలో ఫ్లోరిడాలో ఒక వ్యక్తిని గృహ హింస కేసులో అరెస్టు చేస్తున్నప్పుడు ఆయన పోలీసుల ముఖాలపై దగ్గడంతో పాటు ఉమ్మడంతో ఆయనపై ఈ ఉగ్రవాద నేరాభియోగం నమోదుచేశారు.

    అలా దగ్గి, ఉమ్మినప్పుడు ఆ 31 ఏళ్ల వ్యక్తి పోలీసులతో ‘నాకు కరోనావైరస్ ఉంది జాగ్రత్త’ అంటూ హెచ్చరించాడని కోర్టు పత్రాలు చెబుతున్నాయి.

    అయితే, ఆ తరువాత పరీక్షలు నిర్వహించగగా ఆయనకు కరోనావైరస్ లేదని తేలింది.

    ఇక టెక్సాస్‌కు చెందిన మరో వ్యక్తి శాన్ ఆంటోనియాలోని సూపర్ మార్కెట్‌లో కరోనావైరస్‌ను వ్యాపింపజేయడానికి ఒకరికి తాను డబ్బులు ఇచ్చానని సోషల్ మీడియాలో చెప్పుకోవడంతో ఆయనపైనా ఉగ్రవాద నేరాభియోగాలు నమోదు చేశారు.

  18. కరోనా బాధితులకు రోగ నిరోధక శక్తి పెంచేలా ఆహారంలో డ్రైఫ్రూట్స్, గుడ్లు

    ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు క్వారంటీన్ కేంద్రంలో కరోనావైరస్ బాధితులకు రోగ నిరోధక శక్తి పెంచేందుకు బలవర్థకమైన ఆహారం అందిస్తున్నారు.

    డ్రైఫ్రూట్స్, కోడి గుడ్లను ఆహారంలో అందిస్తున్నారు.

    రాష్ట్రంలో ఏర్పాటుచేసిన అన్ని రిలీఫ్ సెంటర్లలో ‘గోరు ముద్ద’ పథకం మెనూన అందించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కోరారు.

    View more on twitter
    View more on twitter
  19. కరోనా కంటెయిన్మెంట్ జోన్లలో పకడ్బందీగా రాకపోకల నిషేధం అమలు

    హైదరాబాద్‌లో కరోనా హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో రాకపోకలపై నిషేధం అమలవుతోంది.

    ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇక్కడ చూడొచ్చు. ‘కోవిడ్-19 కంటెయిన్మెంట్ జోన్ ఇది.. ఇక్కడ ప్రవేశం నిషిద్ధం’ అంటూ బ్యానర్ల ఏర్పాటు చేశారు.

    View more on twitter
  20. మోదీకి ధన్యవాదాలు తెలిపిన బ్రెజిల్ అధ్యక్షుడు

    హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధ ముడిపదార్థాన్ని సరఫరా చేసినందుకు గాను భారత ప్రధాని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్స్‌నారో ధన్యవాదాలు తెలిపారు.

    View more on twitter