‘బిగ్ బాస్’ బాలాజీ ఎవరు?

  • 29 సెప్టెంబర్ 2017
శివబాలాజీ, బిగ్ బాస్ Image copyright Twitter

తెలుగు బిగ్ బాస్ సీజన్-1 విజేత ఎవరు? అంటే ఇప్పుడు ఎవరైనా శివబాలాజీ అని ఠక్కున చెప్పేస్తారు. మరి శివ బాలాజీ అంటే.. చాలా మందికి తెలియదు. ఆయన నటుడిగా తెలిసినా.. ఆయన ఎక్కడి వారన్నది కాస్త ఆసక్తికరం.

చెన్నైలో పుట్టి పెరిగిన ఈయన.. 17ఏళ్ల వయసు నుంచే తన తండ్రి స్థాపించిన బాలాజీ గ్రూప్ సంస్థల వ్యాపారాన్ని చూసుకునేవాడు. ఆ తర్వాత మూడేళ్లలో సొంతంగా ఓ పరిశ్రమను ప్రారంభించాడు.

'ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ' చిత్రంలో నటించే అవకాశం రావడంతో 2002లో వ్యాపారాన్ని వదిలేశాడు. 2005లో వచ్చిన 'ఇంగ్లిష్‌కరణ్' సినిమాలో తనతో తెరను పంచుకున్న నటి మధుమితను 2009 వివాహం చేసుకున్నాడు.

వీరికి ఇద్దరు కుమారులు పుట్టారు. నటుడిగా టాలీవుడ్, కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్య, చందమామ, శంభో శివ శంభో తదితర చిత్రాలతో తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు.

బిగ్ బాస్ షో విజయంతో మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)

సంబంధిత అంశాలు