ఇప్పుడు సమంత మదిలో ఏముంది?: కలవరం, ఉద్వేగం

  • 6 అక్టోబర్ 2017
సమంత, నాగచైతన్య Image copyright Instagram/Samantharuthprabhuoffl

హీరోయిన్ సమంత పెళ్లి సందర్భంగా సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది. మరికొన్ని గంటల్లో పెళ్లనగా.. చైతూ పెళ్లికొడుకయ్యాడంటూ నాగార్జున ట్విటర్‌లో ఫొటో పోస్ట్ చేశారు.

Image copyright TWITTER/iamnagarjuna

సామాజిక మాధ్యమాల్లో ఇదే ట్రెండింగ్ న్యూస్.

కానీ సమంత-చైతూల పెళ్లవుతుంటే కొందరు ఫ్యాన్స్‌ తెగ ఫీలైపోతున్నారు.

Image copyright Twitter/iamnagarjuna

చైతూని మిస్‌ అవుతున్నామంటూ కొందరు అమ్మాయిలు ట్వీట్ చేశారు.

"నా ఆశ చచ్చిపోయింది. నువ్వు నన్ను అస్సలు పట్టించుకోలేదు. నేను అత్యంత దురదృష్టవంతురాలిని" అంటూ ఒకమ్మాయి ట్వీట్ చేసింది.

Image copyright TWITTER

"చైతూని నేనెంతో ప్రేమిస్తున్నా.. మీరైనా చెప్పండి" అంటూ సమంతకు ట్వీట్ చేసింది మరో అమ్మాయి.

Image copyright TWITTER

అమ్మాయిలు కాదు.. నేను అన్‌లక్కీ అంటూ శివాజీ అనే వ్యక్తి మరో పోస్ట్ పెట్టారు. "నేను దురదృష్టవంతుడిని. నేను నా సమంతను మిస్ అవుతున్నా" అని ట్వీట్ చేశారు.

Image copyright TWITTER

సమంత-చైతూ పెళ్లిపై అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Image copyright Instagram/Samantharuthprabhuoffl

చైతూ ఏమైనా ఇబ్బంది పెడితే తమకు చెప్పమని సమంత అభిమానులు అడిగితే.. ఆమె చైతూని ఇబ్బంది పెట్టకుంటే చాలని నాగ చైతన్య ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు.

Image copyright TWITTER
Image copyright TWITTER

ఇంకొందరు అభిమానులు సమంత-చైతూలకు విషెస్ చెప్పారు.

Image copyright TWITTER

కొందరైతే పుట్టబోయే బిడ్డకు 'గౌతమ్ మీనన్' అని పేరు పెడతారా అంటూ ఆసక్తిగా అడిగారు. దీనికి సమంత పడిపడి నవ్వే ఎమోజీని సమాధానంగా పోస్ట్ చేశారు.

Image copyright TWITTER

పెళ్లి చేసుకున్నా.. అభిమానులకు దగ్గరగానే ఉంటానని చెప్తూ ఫ్యూచర్‌ ప్లాన్స్‌పై సమంత క్లారిటీ ఇచ్చారు.

తమపై ప్రేమ కురిపిస్తున్న అభిమానులందరికీ థాంక్స్ చెప్పారు.

Image copyright Twitter

ఇప్పుడు మీ మదిలో ఏముంది? అని కార్తిక రవీంద్రన్ అనే అభిమాని ట్విటర్‌లో అడిగిన ప్రశ్నకు సమంత స్పందిస్తూ.. కలవరం, ఉద్వేగం అని సమంత బదులిచ్చారు.

పెళ్లి తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇస్తారా? అన్న మరో ప్రశ్నకు బదులిస్తూ.. అసలు నేను సినిమాలు మానేస్తేనే కదా! అని సమాధానమిచ్చారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం