ఈ స్కై మ్యాప్‌కు వేల సంవత్సరాల వయసు
చూడ్డానికి ఇవి మామూలు రాళ్లు. 14 అడుగుల ఎత్తున్న నిలువురాళ్లు. ఒకప్పుడు వీటిని చూస్తే ప్రజలకు భయం. పరిశోధకులకు మాత్రం ఇవి అత్యంత అమూల్యమైనవి.!
తెలంగాణ-కర్నాటక సరిహద్దుల్లో మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణ మండలం కృష్ణా తీరంలో ముడుమాల్ గ్రామం శివార్లలో ఇవి ఉన్నాయి.
పంట పొలాల్లో 80 ఎకరాల విస్తీర్ణంలో 80 గండ శిలలు ఉన్నాయి. ఒక్కోటి 12 నుంచి 14 అడుగుల ఎత్తు ఉన్నాయి.
చిన్న చిన్న రాళ్లు 3500లకు పైగానే ఉన్నాయి.
రాళ్ల నీడ మారితే కాలం మారుతుంది!
ఇప్పుడు వాతావరణ మార్పులను తెలుసుకునేందుకు ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది.
కానీ 3000 ఏళ్ల క్రితం ఈ నిలువురాళ్ల నీడ ఆధారంగానే అప్పటి ప్రజలు రుతువులు, కాలాలను గుర్తించే వారని పరిశోధకులు చెబుతున్నారు.
సూర్యుడి గమనాన్ని బట్టి పడే ఈ రాళ్ల నీడల ఆధారంగా వాతావరణ మార్పులను అప్పటివారు గుర్తించేవారని అంచనా వేస్తున్నారు.
పదేళ్ల క్రితమే నిలువురాళ్ల రహస్యం బయటపడింది. అప్పటి నుంచి దేశ, విదేశ పరిశోధకులు ఈ రాళ్లను అధ్యయనం చేస్తున్నారు.
కాలిఫోర్నియా యూనివర్శిటీ, కొరియా జ్యోంగీ ప్రావిన్షియల్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు బృందం నిలువు రాళ్లపై అధ్యయనం చేసింది.
భవిష్యత్తులో మరింత సమగ్రంగా పరిశోధన చేస్తామని వారు ప్రకటించారు.
ఇంతటి చారిత్ర్రక ప్రాధాన్యత ఉన్న నిలువురాళ్లు ప్రపంచంలో మరెక్కడా లేవని దక్షిణ కొరియా ప్రతినిధులు తెలిపారు.
మా ఇతర కథనాలు
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.